అమెరికా ఎన్నికల్లో మోడీ నినాదం!

Update: 2016-10-28 04:52 GMT
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయాలనే విషయంలో ఇప్పటికే అమెరికన్ ఓటర్లు ఒక క్లారిటీకి వచ్చేసినట్లు సర్వేలు చెబుతున్న తరుణంలో... ఇప్పుడక్కడ ఇండో అమెరికన్స్ ఓట్లు కీలక పాత్ర పోషించబోతున్నాయి. అయితే ఈ విషయంలో ఇండో అమెరికన్స్ ఓట్లపై ట్రంప్ భారీ అంచనాలు, ఆశలు పెట్టుకున్నట్లే ఉంది. ఈ క్రమంలో అమెరికాలో జరిగిన దీపావళి సంబరాల్లో ట్రంప్ కోడలు పాల్గొని సందడి చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఇండియన్స్ ని ఆమె బాగా కనెక్ట్ అయ్యారనే కథనాలు వచ్చాయి. ఆ సంగతి అలా ఉంటే... ఇండియాలో ఎన్నికల సమయంలో బీజేపీ విజయనినాదం ప్రస్తుతం అమెరికా ఎన్నికల్లో వినిపిస్తోంది.

2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో "అబ్‌ కీ బార్‌.. మోడీ సర్కార్‌" (ఈసారి మోడీ సర్కారే) అన్న బీజేపీ విజయనినాదం భారతను ఊపేసిన సంగతి తెలిసిందే. వాయపేయి హయాంలో "భారత్ వెలిగిపోతుంది" అనే నినాదాన్ని ఎత్తుకున్న బీజేపీ... మోడీ హయాంకి వచ్చేసరికి "ఈ సారి మోడీ సర్కారే" అనే నినాదంతో దూసుకెళ్లింది. అయితే తాజాగా అమెరికాలో జరగబోతున్న అధ్యక్ష ఎన్నికల్లో ఆ నినాదం ఇప్పుడు మార్మోగుతోంది. భారతీయ అమెరికన్ల ఓట్లపై కన్నేసిన రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌... మోడీ నినాదాన్ని అందుకున్నారు. "అబ్‌ కీ బార్‌.. ట్రంప్‌ సర్కార్‌" అని ఆయన ప్రకటనలతో ప్రచారం నిర్వహిస్తున్నారు. దీంతో ఇండో అమెరికన్ ఓట్లపై ట్రంప్ ఏస్థాయి ఆశలు పెట్టుకున్నారనే విషయం స్పష్టమవుతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News