ఆ ప్ర‌ముఖుడిని ట్రంప్ అరెస్ట్ చేయిస్తాడ‌ట‌

Update: 2017-04-22 15:07 GMT
వికీలీక్స్‌ స్థాపకుడు జూలియన్‌ అసాంజ్‌ అరెస్టుకు అమెరికా నూత‌న అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ స‌ర్కారు రంగం సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా అమెరికా జస్టిస్‌ డిపార్ట్‌మెంట్‌ అభియోగాలు ఖరారు చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్ప‌టికే ప్ర‌తిపాద‌న‌లు రూపొందిచిన‌ట్లు అమెరికా మీడియా వెళ్ల‌డించింది. త్వ‌ర‌లోనే ఆయ‌న అరెస్టు ఉంటుంద‌ని జోస్యం చెప్పింది.

2010లో వికీలీక్స్‌ ద్వారా అమెరికాకు చెందిన సైనిక రహస్యాలను అసాంజే వెలుగులోకి తెచ్చారు. అప్పటి అమెరికా ఆర్మీ అధికారి చెల్సియా మన్నింగ్‌ దొంగలించిన రహస్య పత్రాలను వీకీలీక్స్‌ వెలుగులోకి తెచ్చింది. దేశ రహస్యాలను బయటపెట్టినందుకు అసాంజేను అరెస్ట్  చేయాలని నిర్ణయించారు. ఎన్‌.ఎస్‌.ఎ పత్రాలను లీక్‌ చేసిన ఎడ్వర్డ్‌ స్నోడన్‌ కు కూడా అసాంజేనే సహకరించాడని అమెరికా చెబుతోంది. ఈ నేపథ్యంలో ఆయనపై కేసు దర్యాప్తు చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. త్వరలోనే అసాంజే ను అరెస్ట్ చేయవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం లండన్‌ లో ఈక్వెడార్‌ రాయబార కార్యాలయంలో అసాంజే ఆశ్రయం పొందుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News