అధ్యక్ష పదవికి డొనాల్డ్ ట్రంప్ నామినేషన్

Update: 2020-08-28 05:00 GMT
నవంబర్ లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల వేడి రాజుకుంది. అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ తరుఫున అధికారికంగా రెండోసారి ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నామినేషన్ పొందారు. రిపబ్లికన్ పార్టీ తరుఫున ట్రంప్ అధ్యక్ష పదవికి నామినేట్ అయ్యారు.

ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. హృదయపూర్వక  కృతజ్ఞతతో.. అనంతమైన ఆశావాదంతో అమెరికా అధ్యక్షుడిగా ఈ నామినేషన్ అంగీకరిస్తున్నానని ట్రంప్ తెలిపారు.ప్రజల ముందు మళ్లీ అధ్యక్షుడిగా నిలబడతానంటూ విశ్వాసం వ్యక్తం చేశారు.

ప్రత్యర్థి బిడెన్ పై ట్రంప్ విమర్శలు గుప్పించారు. అమెరికాను బిడెన్ రక్షించేవాదు కాదని.. ప్రతిష్టను, ప్రజల ఉద్యోగాలను నాశనం చేసేవాడని ట్రంప్ ఆరోపించారు.

కాగా ట్రంప్ ను ఆయన కుమార్తె ఇవాంక ట్రంప్ పరిచయం చేసింది. తన భార్య మెలానియాతో ట్రంప్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Tags:    

Similar News