చెప్పినంత పని చేసిన ట్రంప్... త్వరలోనే..!
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా తన అభిమానులను కలుసుకోనున్నారు. ఇందుకోసం ఆయన ఏకంగా ఓ సామాజిక మాధ్యమాన్ని క్రియేట్ చేశారు. అచ్చం చూసేందుకు ట్విట్టర్ లానే కనిపిస్తున్నా కానీ ఇది వేరు.
దీనిని ట్రూత్ సోషల్ పేరుతో అందుబాటులోకి తీసుకురానున్నారు. మరికొన్ని రోజుల్లోనే ఇది ప్రజలకు అందుబాటులోకి రానుంది. అయితే ట్రంప్ కొత్తగా తీసుకువస్తున్న ఈ సామాజిక మాధ్యమానికి సంబంధించిన వివరాలను ఆయన కుమారుడు వివరించారు.
ఈ సరికొత్త సోషల్ మీడియాలో ముందుగానే ట్రంప్ తన అకౌంట్ ను క్రియేట్ చేసుకున్నారు. అంతేగాకుండా దానిలో ఓ పోస్ట్ కూడా పెట్టారు. దీనిని ట్రంప్ కుమారుడు జూనియర్ ట్రంప్ స్క్రీన్ షాట్ తీసి ఓ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ప్రస్తుతం కొత్తగా తీసుకుని వస్తున్న ఈ సామాజిక మాధ్యమం పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు భారీగానే ఖర్చు చేశారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా కొత్త ఫ్లాంట్ ఫాం ను తీసుకుని రావడం వెనక కొన్ని కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ ఓటమి అనివార్యం అయ్యింది.
అదే సమయంలో అతని అభిమానులు చేసిన రచ్చ అంత ఇంతా కాదు. క్యాపిటల్ భవనం దగ్గర వారు చేసిన హంగామాను అప్పటికి ఉన్న సోషల్ మీడియాలు ఫేస్ బుక్, ట్విట్టర్ ల్లో పోస్ట్ చేశారు. దీంతో నియమాలను అతిక్రమించిన కారణంగా ఆయన ఖాతాను రెండు సంస్థలు నిలిపి వేశాయి.
తన గొంతు నొక్కేసిన వాటికి ధీటుగా కొత్త సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ను తీసుకుని వస్తానని ఇదివరకే చెప్పారు ట్రంప్. ఇప్పుడు అన్నంత పని చేశారు. అప్పుడు జరిగిన ఈ విషయాలను మనసులో ఉంచుకొని కొత్త సామాజిక మాధ్యమాన్ని అభివృద్ధి చేశారు.
ఈ కొత్త సోషల్ మీడియాను తీసుకువచ్చింది ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ సంస్థ. ఈ కంపెనీ దీనిని డెవలవ్ చేసింది. దీనిని కచ్చితంగా చెప్పాలంటే ట్విట్టర్ కు ప్రత్యామ్నాయంగా తీసుకువస్తున్నారు. ట్విట్టర్లో అయితే మనం చేసిన పోస్టును ట్వీట్ అంటాం. ట్రంప్ దానిలో పోస్ట్ ను ట్రూత్ అని పిలుస్తారని సంబంధితవర్గాలు తెలిపాయి.
దీనికి సంబంధించిన తొలి ట్రూత్ ను ట్రంప్ పోస్ట్ చేశారు. గెట్ రెడీ, త్వరలోనే మీరు మీకు ఇష్టమైన అధ్యక్షుడు కలవబోతున్నారు అని రాసుకొచ్చారు. అయితే ఈ సైట్ ప్రస్తుతం అభివృద్ధి దశలోనే ఉంది. ఇది పూర్తిలో స్థాయిలో అందుబాటులోకి రావాలంటే మరో నెల రోజులు పడుతుందని తెలుస్తోంది. మార్చిలో దీనిని లైవ్ లోకి తీసుకువస్తారు అని ఓ టెక్కీ చెప్పాడు.
సరికొత్త సోషల్ మీడియాతో వస్తున్న ట్రంప్ తన తొలి పోస్టుని ఫిబ్రవరి 10 వ తేదీన పోస్టు చేశారు. ఈ పోస్టు చేసే సమయానికి ఆయన అకౌంట్ ను ఫాలో అయ్యే వారి సంఖ్య 175గా ఉంది.