డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం

Update: 2021-01-01 09:06 GMT
అమెరికాలోని నిరుద్యోగులు, కార్మికులను రక్షించడానికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. విదేశీయులకు ఇచ్చే వర్క్ వీసాలైన హెచ్ -1బి వీసాలతోపాటు ఇతర రకాల విదేశీ వర్క్ వీసాలను మరో మూడు నెలల పాటు నిషేధిస్తూ అందరికీ షాకిచ్చాడు. కోవిడ్ -19 వ్యాక్సిన్లు ఇటీవలే వచ్చాయని.. ఇంకా అమెరికాలో నిరుద్యోగం పోలేదని.. ఆర్థిక వ్యవస్థ కుదుటపడలేదని.. వాటి ప్రభావం కార్మిక మార్కెట్.. సమాజ ఆరోగ్యం ఇంకా పూర్తిగా తొలిగిపోలేదని పేర్కొంటూ అమెరికన్లకు ఊరటనిస్తూ విదేశీయులకు షాకిచ్చారు.

ఇప్పటికే  అక్టోబర్ 1న ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల  హెచ్ -1 బి వీసాలు జారీ చేసిన భారతీయ ఐటి నిపుణులు మరియు అనేక అమెరికన్ మరియు భారతీయ కంపెనీలపై తీవ్ర ప్రభావం పడింది.   గత ఏడాది ఏప్రిల్ 22 మరియు జూన్ 22 వరకు మొదట విదేశీయుల వివిధ వర్గాల వర్క్ వీసాలను ట్రంప్ స్తంభింపజేశాడు.  ఆ  నిషేధం గడువు డిసెంబర్ 31తో గడువు ముగియడానికి కొన్ని గంటల ముందు తాజాగా ట్రంప్ మార్చి 31 వరకు ఈ నిషేధం పొడిగించాలని గురువారం మరో ప్రకటన విడుదల చేశారు. ఈ ఆంక్షలు జారీ చేయడానికి కావాల్సిన కారణాలు ఏవీ మారలేదని చెప్పారు.

హెచ్1 బీ వీసా అనేది నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా, ఇది సైద్ధాంతిక లేదా సాంకేతిక నైపుణ్యం అవసరమయ్యే వృత్తినిపుణులు, విదేశీ కార్మికులను నియమించడానికి యుఎస్ కంపెనీలకు అనుమతిస్తుంది. భారతదేశం మరియు చైనా వంటి దేశాల నుండి ప్రతి సంవత్సరం పదివేల మంది ఉద్యోగులను నియమించడానికి సాంకేతిక సంస్థలు దానిపై ఆధారపడతాయి. ఇప్పుడు ట్రంప్ నిషేధంతో విదేశీ నిపుణులు  కనీసం మార్చి చివరి వరకు వేచి ఉండాలి.  అమెరికాలో హెచ్ -1 బి వీసాల పునరుద్ధరణను కోరుకునే వారిలో పెద్ద సంఖ్యలో భారతీయ ఐటి నిపుణులపై ఇది తీవ్రప్రభావం చూపనుంది.

“2019లో వచ్చిన కరోనావైరస్ అమెరికన్ల జీవనోపాధిని గణనీయంగా దెబ్బతీసింది.  రాష్ట్రాల్లో నవంబర్ మొత్తం నిరుద్యోగిత రేటు ఏప్రిల్ గరిష్ట స్థాయి నుండి గణనీయమైన క్షీణతను ప్రతిబింబింబించింది. 2020 ఫిబ్రవరిలో కంటే నవంబర్లో 9,834,000   ఉద్యోగాలు కోల్పోయారు.”అని ట్రంప్ తన ప్రకటనలో తెలిపారు.

 కరోనా వ్యాక్సిన్ వచ్చినా ఇంకా దాని ప్రభావం కార్మిక మార్కెట్.. సమాజ ఆరోగ్యం ఇంకా పూర్తిగా తొలిగిపోలేదని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ట్రంప్ ప్రకటించాడు.  అంతేకాకుండా, 2020 ఫిబ్రవరితో పోల్చితే రాష్ట్రాల  వ్యాపారాలపై నిరంతర ఆంక్షలు  వంటి చర్యలు ఇప్పటికీ కార్మికుల సంఖ్యను తగ్గించాయని.. ఉపాధి పెంచడానికే ఈ నిర్ణయాలని" అని ట్రంప్ అన్నారు, అవసరమైతే తన తాజా ప్రకటనను పొడిగిస్తామని ట్విస్ట్ ఇవ్వడం విశేషం.

Tags:    

Similar News