• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఏ మాత్రం త‌గ్గేది...

ఏ మాత్రం త‌గ్గేది లేదంటున్న ట్రంప్‌

By - Tupaki Desk
Update: 2017-04-28 05:12 GMT
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ త‌న  మాటంటే మాటేన‌ని పున‌రుద్ఘాటించారు. అమెరికా-మెక్సికో సరిహద్దుల్లో గోడ కట్టితీరతామని మరోసారి స్పష్టం చేశారు. భారీ ఖర్చుతో కూడుకున్న ఈ వివాదాస్పద భారీ గోడ నిర్మాణాన్ని తాత్కాలికంగా పక్కనపెట్టేశారన్న వార్తల నేపథ్యంలో అధ్యక్షుడి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. శ్వేతసౌధంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎవరికైనా సందేహాలుంటే తీర్చుకోవాలని... ఎట్టిపరిస్థితుల్లోనూ గోడ కట్టితీరతామని కుండబద్దలు కొట్టారు.

దాదాపు 3,100 కిలోమీటర్ల గల అమెరికా-మెక్సికో సరిహద్దులో 1600 కిలోమీటర్ల పరిధిలో ఈ గోడ నిర్మించనున్నట్టు డొనాల్డ్ ట్రంప్‌ వెల్లడించారు.  అమెరికా-మెక్సికో గోడ‌నిర్మాణం ద్వారా మత్తుపదార్థాలు, మనుషుల అక్రమ రవాణాను నిరోధించవచ్చని చెప్పారు. వాస్తవానికి ఇవి ప్రపంచం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్యలని, కానీ వీటిపై ఎవరూ మాట్లాడటం లేదని డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. గోడ కట్టేందుకు అనేక ప్రాంతాల్లో సాధ్యం కాకపోవడంతో 1600 కి.మీ. మేర నిర్మించనున్నట్టు ఇంజినీరింగ్‌ వర్గాలు తెలిపాయి. ఇటీవల తనని కలిసిన రక్షణ కార్యదర్శి జాన్‌ కెల్లీ సైతం కచ్చితంగా ఓ గోడను నిర్మించాల్సిన అవసరం ఉందని చెప్పారని ట్రంప్‌ వెల్లడించారు. అయితే కొందరు దీనికి వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుకుంటున్నారో తనకు తెలియదని.. వందశాతం గోడ కట్టితీరతామని ఆయన స్పష్టం చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Donald Trump 
  • Mexican Wall 
  • Telugu NEws 

Similar News

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో క‌విత స‌త్తా చాటేనా?

2026-11-11 17:30 GMT

సోనియా గాంధీ ఒక స్పై.. ఆమె రాగానే గాంధీ కుటుంబంలో హత్యలు.. కంగన సంచలన ఆరోపణలు

2026-11-11 16:47 GMT

షర్మిలమ్మను మురిపించిన సోనియమ్మ

2026-11-11 16:45 GMT

సాయి రెడ్డి పీఆర్‌పీ.. కొన్ని కీల‌క 'గ‌మ్మ‌త్తులు'.. !

2026-11-11 16:41 GMT

చంద్ర‌బాబు హ‌ర్ట్‌: అమిత్ షా విశాఖ ప‌ర్య‌ట‌న ర‌ద్దు రీజ‌న్ ఇదే!

2026-11-11 16:40 GMT

కశ్మీర్‌లో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రదాడి.. 30 రౌండ్ల కాల్పులు

2026-11-11 16:34 GMT

క్యాన్సర్ నుంచి అల్జీమర్స్ వరకు ఏ రోగాలు ఉండవు.. ఏఐతో అన్నీ మటాషేనట..!

2026-11-11 12:15 GMT

కొత్త కోవిడ్ వేరియంట్ PJ.2.1.. మళ్లీ కరోనా భయం అవసరమా?

2026-11-11 11:25 GMT

భార్య మృతదేహాన్ని ముక్కలుగా చేసి పడేశాడు.. హత్య కేసులో ఎన్నారై దోషిగా నిర్ధారణ

2026-11-11 11:24 GMT

డిసెంబర్ నుంచే డేంజర్ బెల్స్.. హైదరాబాద్ కు పొంచి ఉన్న పెను ముప్పు

2026-11-11 10:36 GMT

హాట్ టాపిక్ : విజయసాయిరెడ్డి వెంట నందమూరి తారకరత్న భార్య

2026-11-11 09:41 GMT

ఇప్పటికింకా నా వయసు నిండా 18.. అంటే ఇన్ స్టాగ్రామ్ ఇక ఊరుకోదు..

2026-11-11 09:38 GMT

Copyright @2026

Powered by Blink CMS