ఆ దేశాల మీద నిషేదపు వేటు వేసిన ట్రంప్

Update: 2020-02-02 04:30 GMT
విద్య.. ఉపాధి కోసం అమెరికాకు వెళ్లాలనుకునే కొన్ని దేశాలపై ఆంక్షలు విధించే పత్రాలపై సంతకాన్ని చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. భద్రతా నిబంధనల్ని పాటించటంలో ఫెయిల్ అయిన దేశాలకు చెందిన వారు అమెరికాకు వచ్చేందుకు వీలు లేని రీతిలో ఈ ఆంక్షలు ఉండనున్నాయి.

తాజాగా నిషేధం ఎదుర్కొనే దేశాల విషయంలోకి వస్తే ఇరాన్.. లిబియా.. ఉత్తర కొరియా.. సిరియా.. వెనెజులా.. యెమన్.. సోమాలియా పౌరులు అమెరికాకు అనుమతించే విషయంలో బ్యాన్ కొనసాగిస్తున్నట్లు అమెరికా వెల్లడించింది. అంతేకాదు.. మయన్మార్.. ఎరిట్రియా.. కిర్గిజిస్తాన్.. నైజీరియా వలసదారుల వీసాలపైనా బ్యాన్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది.

ఈ దేశాలే కాదు.. సూడాన్.. టాంజానియా దేశాలు వీసా లాటరీలో పాల్గొనే అవకాశాన్ని రద్దు చేస్తున్నట్లు వైట్ హౌస్ పేర్కొంది. అయితే.. ఈ ఆంక్షలు పర్యాటకులకు.. వ్యాపారస్తులకు వర్తించదని పేర్కొనటం గమనార్హం. తాము చెప్పినట్లుగా భద్రతా నిబందనల్ని పాటించటంలో ఫెయిల్ అయిన దేశాల పౌరుల వీసా అనుమతులపై ఆంక్షలు విధిస్తారు. అంతర్జాతీయ భద్రతా నిబంధనల్ని పాటించకుంటే ఎలా ఉంటుందో ఆయా దేశాలకు అర్థమయ్యేందుకే ఈ బ్యాన్ అని అమెరికా పేర్కొంది.

అమెరికా భద్రత.. ప్రజల రక్షణే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తొలి బాధ్యతగా అభివర్ణించిన వైట్ హౌస్.. ఆ లక్ష్యం చేరుకునేందుకు వీలుగా తాజా ఆంక్షలుగా పేర్కొన్నారు.  తన ప్రయోజనాలకు ఏ మాత్రం భంగం వాటిల్లకుండా ఉండేందుకు అగ్రరాజ్యం దేనికైనా రెఢీ అన్నట్లుగా తాజా ఆంక్షల్ని చెప్పక తప్పదు.


Tags:    

Similar News