లోకేష్ ను ఎవరైనా నమ్ముతారా ?

Update: 2021-06-26 14:30 GMT
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై నారావారి వారసుడు లోకేష్ లో రోజు రోజుకు అక్కసు పెరిగిపోతోంది. తాజాగా జగన్ దెబ్బకు రిలయన్స్ కంపెనీ రాష్ట్రంవదిలి వెళ్ళిపోయినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. నిజానికి రిలయన్స్ రాష్ట్రం వదిలి వెళ్ళటానికి ప్రభుత్వానికి సంబంధమే లేదు. ఇంకా గట్టిగా చెప్పాలంటే రిలయన్స్ వెళ్ళిపోవటానికి చంద్రబాబునాయుడే కారణం. తమ హయాంలో జరిగినదానికి కూడాజగన్ ప్రభుత్వమే కారణమని బురద చల్లేస్తున్న లోకేష్  మాటలను జనాలు నమ్ముతారా అనే డౌటు పెరిగిపోతోంది.

అసలు విషయం ఏమిటంటే  చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్షరింగ్ యూనిట్ ఏర్పాటుకు రిలయన్స్ ప్రతిపాదించింది. ఇందుకు అంగీకరించిన ప్రభుత్వం రిలయన్స్ కు చిత్తూరు జిల్లాలోని రేణిగుంట మండలంలో 130 ఎకరాలను కేటాయించింది.  కాగితాలపై కేటాయింపులైతే జరిగింది కానీ క్షేత్రస్ధాయిలో వాళ్ళకు భూములు అప్పగించలేదు. ఇంతలోనే వాళ్ళకు కేటాయించిన భూములకు సంబంధించి 15 మంది రైతులు కోర్టులో కేసు వేశారు.

ఈ కేసు ఇలా ఉండగానే టీడీపీ ప్రభుత్వం కేటాయించిన భూమి వివాదాన్ని పరిష్కరించి మిగిలిన 70 ఎకరాలను రిలయన్స్ కు అప్పగించటానికి రెడీ అయ్యింది. ఇదే విషయాన్ని ఏపిఐఐసీ రిలయన్స్ యాజమాన్యానికి స్పష్టం చేసింది. 75 ఎకరాల భూమిని రిలయన్స్ ప్రతినిధులు ఒకటికి రెండుసార్లు పరిశీలించారు కూడా. అయితే తర్వాత ఏమి జరిగిందో ఏమో కానీ ప్రభుత్వం కబురు చేసినా రిలయన్స్ ప్రతినిధులు తిరిగి చూడలేదు.

ఇంతకాలానికి అధికారికంగానే ప్రభుత్వం తమకు కేటాయించిన భూమి అవసరం లేదని రిలయన్స్ ప్రకటించింది. కారణం ఏమిటంటే రేణిగుంటలో పెట్టబోయే యూనిట్ లో సెట్ టాప్ బాక్సులు తయారు చేద్దామని అనుకున్నది. అయితే ఈ మధ్యలోనే ఫాక్స్ కాన్ అనే సంస్ధతో సెట్ టాప్ బాక్సులు తయారుచేసే కాంట్రాక్టు కుదుర్చుకుంది రిలయన్స్. అంటే రిలయన్స్ కు అవసరమైన సెట్ టాప్ బాక్సులన్నింటినీ ఫాక్స్ కాన్ సంస్ధే తయారు చేసిస్తుందన్నమాట.

విచిత్రమేమిటంటే ఈ విషయాన్ని రిలయన్స్ సంస్ధే ప్రకటించింది. రిలయన్స్ సంస్ధ అధికారికంగా ప్రకటించిన విషయాన్ని కూడా లోకేష్ వక్రీకరిస్తున్నారు. సంస్ధ పెట్టటానికి రిలయన్స్ సిద్ధంగా ఉంటే జగన్ ప్రభుత్వమే దాన్ని తరిమేస్తోందని లోకేష్ అబద్ధపు ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ తప్పంతా చంద్రబాబు మీదే ఉంది. రిలయన్స్ కు ఇచ్చిందే లిటిగేషన్లో ఉన్న భూమిని ఇచ్చారు. అప్పట్లోనే లిటిగేషన్ను క్లియర్ చేయమని రిలయన్స్ ఎంత మొత్తుకున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు.

అప్పట్లోనే వాళ్ళకు క్లియర్ ల్యాండ్ ఇచ్చున్నా లేకపోతే సమస్య పరిష్కారం చేసున్నా యూనిట్ ఏర్పాటు జరిగేదేమో. జగన్ అధికారంలోకి రాగానే రిలయన్స్ సంస్ధ తమ సమస్యను చెబితే వెంటనే ఏపీఐఐసి రంగంలోకి దిగి సమస్యను పరిష్కరించింది. అయితే అప్పటికే ఫాక్స్ కాన్ సంస్ధతో జరిగిన ఒప్పందం కారణంగా యూనిట్ ఏర్పాటును రిలయన్స్ విరమించుకున్నది. వాస్తవం ఇదైతే లోకేష్ మాత్రం నోటికొచ్చిన అబద్ధాలు చెబుతుండటమే ఆశ్చర్యంగా ఉంది. అబద్ధాలను ప్రచారం చేసుకుంటు జగన్ పై తనకున్న అక్కసును వెళ్ళగక్కుతున్నారంతే.
Tags:    

Similar News