డ్రాగన్ వార్నింగ్ ఎవరికో తెలుసా ?

Update: 2021-07-02 05:30 GMT
ప్రపంచదేశాలకు డ్రాడన్ దేశం గట్టి వార్నింగ్ ఇచ్చిందా ? అవుననే అనిపిస్తోంది ఆ దేశాధ్యక్షుడు జిన్ పింగ్ హెచ్చరికలు విన్నతర్వాత. తమతో పెట్టుకుంటే బాక్సులు బద్దలైపోవటం ఖాయమంటు పేరు చెప్పకుండా జిన్ పింగ్ పెద్ద వార్నింగే ఇచ్చారు. యావత్ ప్రపంచంలో చైనాతో పెట్టుకునేంత సీన్ ఒక్క అమెరికాకు తప్ప మరే దేశానికి లేదన్నది వాస్తవం. సైనిక శక్తి,  ఆయుధాల విషయంతో పాటు సాంకేతిక పరిజ్జానంలో ఒక్క అమెరికా మాత్రమే అత్యంత శక్తిమంతంగా కనబడుతోంది.

సో క్షేత్రస్ధాయిలోని వాస్తవాలను పరిగణలోకి తీసుకుంటే చైనా అధ్యక్షుడు ఇచ్చిన వార్నింగ్ అమెరికాకే అన్న విషయం అర్ధమైపోతోంది. బీజింగ్ లోని తియాన్మెన్ స్క్వేర్ లో జరిగిన చైనా వందేళ్ళ సంబరాల సందర్భంగా గంటపాటు మాట్లాడిన జిన్ పింగ్ చాలా విషయాల్లో ప్రపంచానికి వార్నింగులు పంపటం గమనార్హం. తమతో పెట్టుకుంటే ఎవరైనా మటాషే అని నేరుగానే వార్నింగ్ ఇచ్చారు.

కాకపోతే తన ప్రసంగంలోకి కొన్ని విషయాలు వింటే ఆశ్చర్యంగా ఉంది. తమ దేశం ఏ దేశంజోలికి వెళ్ళదట. ఇతర దేశాల భూభాగాలను ఆక్రమించుకోవాలని ఎప్పుడూ ప్రయత్నించలేదని చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. ప్రతిరోజు చైనా-భారత్ సరిహద్దుల్లో చేస్తున్న ప్రయత్నాలను అధ్యక్షుడు ఎలా సమర్ధించుకుంటారు ? లడ్డాఖ్ లోయ ప్రాంతంలో ప్రతిరోజు సైనికులతో గొడవలు చేయిస్తు మన భూభాగంలోకి చొచ్చుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్న విషయం అందరికీ తెలిసిందే.

ఇక, అరుణాచల్ ప్రదేశ్, టిబెట్ విషయంలో డ్రాగన్ దేశం చేస్తున్న కంపు అందరు చూస్తున్నదే. అరుణాచల్ ప్రదేశ్ తమ దేశపు అంతర్భాగమే అంటు చాలా కాలంగా గొడవలు చేస్తున్నది డ్రాగన్. మన దేశంలోని రాష్ట్రాన్ని తమ ప్రాంతంగా చైనా ఎలా చెప్పుకుంటోందో ఎవరికీ అర్ధం కావటంలేదు. అంతర్జాతీయ వేదికలపై తన వాదన వీగిపోతున్నా చైనా సరిహద్దుల్లో గొడవలు చేయటం మాత్రం మానటంలేదు.


Tags:    

Similar News