ఇలాంటి ఆలోచనలు జగన్ కు మాత్రమే వస్తాయేమో?
అధికారంలో చాలానే ప్రభుత్వాలు ఉంటాయి. వాటిని నడిపించే అధినేతలకు కొదవ ఉండదు. కానీ.. అధికారం ఇచ్చిన ప్రజలకు ఏదైనా చేయాలన్న తపన గుండెల్లో ఉండాలే కానీ.. అందుకు తగ్గట్లుగా పలు నిర్ణయాలు తీసుకోవటమే కాదు.. ఆపదలో ఉన్న ప్రజల్ని ఆదుకునేందుకు బోలెడన్ని సదుపాయాల్ని తీసుకురావచ్చన్న విషయాన్ని చేతలతో చేసి చూపిస్తున్నారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జనగ్మోహన్ రెడ్డి.
ఇంటిని పోషించే ఇంటి పెద్ద చనిపోతే.. వారి కుటుంబం వీధిన పడకుండా ఉండేందుకు వైఎస్సార్ బీమా పథకాన్ని షురూ చేయటం తెలిసిందే. సహజ మరణం కానీ.. ప్రమాదంలోకానీ.. ఇతర కారణాలతో మరణిస్తే.. వారికి ఆర్థికఇబ్బందులు చుట్టుముట్టకుండా ఉండేందుకు.. బీమా క్లెయిం సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఇలాంటి వారి కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వినూత్నంగా ఆలోచించారు.
మరణించిన రోజే.. రూ.10వేల మొత్తాన్ని సాయాన్ని అందించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన అధికారిక ఆదేశాల్ని జారీ చేశారు. దీని ప్రకారం.. ఇంటి పెద్ద ఎవరైనా మరణిస్తే.. అదే రోజు రూ.10వేల ఆర్థిక సాయాన్ని అందిస్తారు. ఈ మొత్తాన్ని గ్రామ వాలంటర్ చేతుల మీదుగా అందిస్తారు
అనంతరం.. సాధారణ మరణం అయితే కుటుంబానికి 15 రోజుల వ్యవధిలో.. ప్రమాణ వశాత్తు మరణిస్తే 21 రోజుల వ్యవధిలో లబ్థిదారులకు మిగిలిన డబ్బులు అందిస్తారు.ఈ మొత్తం ప్రక్రియలో గ్రామ వాంటీర్.. గ్రామ సచివాలయం కీలకభూమిక పోషించనుంది. డబ్బులు అందరూ ఖర్చుచేస్తారు. కానీ.. అవసరమైన వారికి.. అవసరమైన సమయంలో అందించే మొత్తం.. వారి జీవితం మొత్తంలో గుర్తుండిపోయేలా చేస్తుందన్న విషయాన్ని మర్చిపోకూడదు.