ఏపీ సీఎం అపాయింట్ మెంట్ వద్దు.. డబ్బే ప్రదానం అంటున్న ఎమ్మెల్యేలు!?

Update: 2020-09-21 03:45 GMT
ఏపీలో రాజకీయం విభిన్నంగా నడుస్తోంది. అసలు ఏమీ అవుతుందో కూడా అర్థం కావడం లేదని పలువురు అంటున్నారు. మొదట్లో ఎమ్మెల్యేలు మాకు సీఎం జగన్ అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదని టీడీపీ మీడియాకు లీకులు ఇస్తే.. వాళ్లు దానిమీద చర్చ పెట్టి ఏదో హడావుడి చేశారు. కొంచెం రాష్ట్రం సర్దుకునే టైంలో సీఎం జగన్ ఎమ్మెల్యేలకు టైం ఇవ్వలేకపోయారు. ఆ తరువాత కరోనా వచ్చి రాష్ట్రం పరిస్థితి ఇబ్బందికరంగా తయారైంది.
 
ఈలోగా ఎమ్మెల్యేలు చాలా మంది ఏపీ సీఎం అపాయింట్ మెంట్ వద్దు.. డబ్బే ముద్దు అని సీఎం అపాయింట్ మెంట్ అడగడం లేదట.. ఇప్పుడే ఇదే ఏపీ రాజకీయాల్లో  పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తోంది. ప్రతీ జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో డబ్బులు ఏ విధంగా సంపాదించాలని దారులు వెతుకుతున్నారట..ఏపీ సీఎం ఒక మంచి పరిపాలన అందించాలని అనుకుంటే సలహాదారులు కూడా మంచి సలహాలు ఇవ్వకుండా వాళ్ల దారి వాళ్లే సపరేట్ గా ముందుకెళ్తున్నారు.
 
90శాతం నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు అడ్డదార్లు తొక్కుతున్నారని.. ఏపీ సీఎంకి ఇంటెలిజెన్స్ కి సమాచారం ఇస్తున్నారు. వాళ్ల మీద ప్రజలకు అప్పుడే బ్యాడ్ ఓపీనియన్ వచ్చిందని.. మనం ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేసినా ఈ ఎమ్మెల్యే వల్ల చెడు జరిగే పరిస్థితి ఉందని ఇంటెలిజెన్స్ సమాచారం వచ్చిందని అంటున్నారు.
 
అసలు వైసీపీ కేడర్ చెల్లుచెదురు అయిపోయిందని.. ఉపాధి హామీ పనులకు పోయే పరిస్థితి వచ్చిందనే టాక్ ఉందట.. ఈ పరిస్థితి రావడానికి కారణం ఎమ్మెల్యేలు మమ్మల్ని పట్టించుకోకపోవడమేననే వైసీపీ కింది స్థాయి శ్రేణులు అంటున్నారు.

అసలు రాష్ట్రంలో ఏం అవుతోందనే గందరగోళం అంతటా ఉందని కూడా మేధావులు అంటున్నారు. కరోనా ఎఫెక్ట్ తో రాష్ట్రం అంతా కుదేలు అవుతోందని అంటున్నారు. అధికారులకు, ఎమ్మెల్యేలకు సఖ్యత లేకుండా ఉందని.. అలాగే ఎమ్మెల్యేలకు పార్టీ కేడర్ కు సఖ్యత లేకుండా ఉందని.. ఆర్థిక పరిస్థితి మెరుగు పడితే తప్పితే రాబోయే సంవత్సరాల్లో ఇబ్బందికరంగా ఉంటుందని అంటున్నారు. 
Tags:    

Similar News