కుక్క కోసం ఇద్దరి కొట్లాట.. డీఎన్ఏ పరీక్ష చేయించిన పోలీసులు !
ఓ కుక్క కోసం ఇద్దరు వ్యక్తులు కొట్లాటకు దిగారు. నాదంటే నాది అంటూ పోలీసుల ఎదుట తగువు పెట్టుకున్నారు. దీంతో ఏం చేయాలో పాలుపోక పోలీసులు కుక్కకు డీఎన్ఏ పరీక్షలు చేయించారు. ఆ ఫలితాలు వస్తే కానీ ఆ కుక్కకు యజమాని ఎవరు అన్న విషయంపై క్లారిటీ వచ్చేలా లేదు. ఇంతకీ ఏం జరిగిందంటే.. మధ్యప్రదేశ్ రాష్ట్రం హోషంగాబాద్ కు చెందిన షాదాబ్ ఖాన్ ఓ పత్రికలో జర్నలిస్ట్‌కు పనిచేస్తున్నాడు.
అయితే అతడు లాబ్రడార్ జాతికి చెందిన ఓ కుక్కను తెచ్చుకొని దానికి ‘కూకూ’ అనే పేరుపెట్టి పెంచుకున్నాడు. ఇటీవల ఆ కుక్క తప్పిపోయింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అదే పట్టణంలో ఉంటున్న ఏబీవీపీ నాయకుడు కార్తీక్ శివ్‌హరే దగ్గర తన కుక్క కనిపించింది. దీంతో షాదాబ్‌ఖాన్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. కార్తీక్ అనే వ్యక్తి దగ్గర తన కుక్క ఉందని చెప్పాడు. అతడు దాన్ని అమ్మేందుకు ప్రయత్నిస్తున్నాడని చెప్పారు. దీంతో పోలీసులు కార్తీక్ విశ్హరేను పిలిపించారు.
శివహర్ మాత్రం ఆ కుక్క తనదేనని చెబుతున్నాడు. పైగా దానిపేరు ‘కుకూ’ కాదని టైగర్ అని చెప్పాడు. పోలీసులు ఇద్దరి సమక్షంలోకి ఆ కుక్కను తీసుకొచ్చారు. ఆ కుక్క ‘కూకూ’ అని పిలవగానే షాదాబ్ దగ్గరకు వెళ్లింది. ‘టైగర్’ అని పిలవగానే కార్తీక్ దగ్గరకు వచ్చింది. దీంతో ఏం చేయాలో పోలీసులకు అర్థం కాలేదు. అయితే 2017లో పంచమర్హి నుంచి ఈ కుక్కను తెచ్చుకున్నానని కావాలంటే డీఎన్ఏ పరీక్ష చేయాలని షాదాబ్ పోలీసులను కోరాడు. పోలీసులు శనివారం కుక్క డీఎన్ఏ శాంపిల్స్ సేకరించి టెస్ట్ కు పంపించారు. పరీక్ష ఫలితాలు వస్తే ఈ కుక్క ఎవరిదనే విషయం నిర్ధారణ అవుతుంది.