'దిశ' నిందితుల అంత్యక్రియలకు ఏర్పాట్లు పూర్తి!

Update: 2019-12-06 11:52 GMT
దేశ వ్యాప్తంగా వెటర్నరీ డాక్టర్ దిశ ఉదంతం ఎంత పెద్ద సంచలనం అయ్యిందో అందరికి తెలిసిందే. కాగా  - నేడు ఈ కేసులో ప్రధాన నిందుతులుగా ఉన్న నలుగురుని పోలీసులు ఎన్ కౌంటర్ చేసారు. దీనితో పోలీసులపై ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. జైల్లో ఉన్న నిందుతులని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు ..సీన్ రీకన్‌ స్ట్రక్షన్ సందర్భంగా నిందితులను ఘటనాస్థలికి తీసుకెళ్లగా అక్కడ ఆ నలుగురు పోలీసుల పై దాడికి దిగి  - పోలీసుల వద్ద ఉన్న వెపన్స్ తీసుకోని ఫైర్ చేసారు. దీనితో ఆత్మ రక్షణ కోసం పోలీసులు కూడా వారి పై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆ నలుగురు మృతిచెందారు.

ఇకపోతే ఎన్ కౌంటర్ జరిగిన ప్రదేశంలోనే  తహసీల్దారులతో పంచనామా పూర్తి చేసిన అధికారులు ..పోస్టుమార్టం కోసం  మహబూబ్‌ నగర్‌ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.  ఫోరెన్సిక్ నిపుణుల సమక్షంలో పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం వారి తల్లిదండ్రులకు మృతదేహాలను అప్పగించనున్నారు. మహమ్మద్ ఆరీఫ్‌ మృతదేహాన్ని తీసుకుపోయేందుకు బంధువులు ఆసుపత్రికి చేరుకున్నట్టు సమాచారం. జక్లేర్‌ గ్రామంలో ఆరీఫ్ అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. మిగతా ముగ్గురు నిందితులు జొల్లు శివ - జొల్లు నరేశ్ - చింతకుంట చెన్నకేశవులు మృతదేహాలకు గుడిగండ్ల గ్రామంలో అంత్యక్రియలకు వారి బంధువులు  ఏర్పాట్లు చేశారు. మరోవైపు దిశ ఇంటి దగ్గర భద్రత పెంచారు. 
Tags:    

Similar News