• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఈ ఇద్ద‌రు సీనియర్ల‌తో...

ఈ ఇద్ద‌రు సీనియర్ల‌తో భ‌లే చిక్కు!

By - Tupaki Desk
Update: 2016-12-03 10:39 GMT
అధిష్టాన పెద్ద‌ల‌కు అత్యంత స‌న్నిహితులు - రాజ‌కీయాల్లో సీనియ‌ర్లు అయిన‌ప్ప‌టికీ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ - బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి తీరే వేరు. వీలు చిక్కిన‌పుడ‌ల్లా ప్ర‌తిపక్షాల‌ను విమ‌ర్శించ‌డంతో పాటు అవ‌స‌రం అయితే సొంత పార్టీపైనా అసంతృప్తి వ్యక్తం చేయ‌డంలో ఈ నేత‌లు ముందుంటారు. తాజాగా వేర్వేరుగా మీడియాతో మాట్లాడుతూ ఇదే రీతిలో రియాక్ట‌య్యారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాందీ ట్విట్టర్ అక్కౌంట్ హ్యాక్ అయిన సంగ‌తి తెలిసిందే. దీనిపై దిగ్విజయ్ సింగ్ స్పందిస్తూ వ‌చ్చే ఒలింపిక్ క్రీడలలో హ్యాకింగ్ ను కూడా చేర్చాలని  పంచ్ వేశారు. హాకింగ్ ను ఒలింపిక్స్ లో చేరిస్తే భారత్ కు పతకాల కరవు తీరిపోతుందని వ్యాఖ్యానించారు. ఒలింపిక్స్ లో హ్యాకింగ్ ను చేరిస్తే అందులో మనకు బంగారు పతకం ఖాయమని ఎద్దేవా చేశారు.  రాహుల్ గాందీ ట్విట్టర్ అక్కౌంట్ హ్యాక్ అయిన రోజుల తరువాత దిగ్విజయ్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేయ‌డం గ‌మ‌నార్హం.

ఇక సొంత పార్టీ నిర్ణ‌యాలు అయిన‌ప్ప‌టికీ ఏ మాత్రం మొహ‌మాటం లేకుండా వాటిపై స్పందించే బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి తాజాగా నోట్ల రద్దుపై మ‌ళ్లీ త‌న‌దైన విశ్లేష‌ణ చేశారు. దేశంలో నల్లధనం - అవినీతి అరికట్టేందుకు ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని సమర్థిస్తూనే ఈ నిర్ణయం వల్ల పేదలు - సామాన్యులు ఇక్కట్లు పడుతున్నారని సుబ్రహ్మణ్య స్వామి అన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు - ఇక్కట్లను సత్వరమే తీర్చకుంటే ఈ నిర్ణయం వల్ల వచ్చిన ప్రజాదరణ ప్రజావ్యతిరేకతగా మారే ప్రమాదం ఉందని స్వామి కేంద్ర ప్ర‌భుత్వాన్ని హెచ్చ‌రించారు.

మ‌రోవైపు ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పై యోగా గురు బాబా రాందేవ్  ప్రశంసల జల్లు కురిపించారు. బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ తో భేటీ అయిన రాం దేవ్ అనంతరం విలేకరులతో మాట్టాడారు. సామాజిక - రాజకీయ రంగాలలో లాలూ ప్రసాద్ యాదవ్ అవసరం ఎంతో ఉందని అన్నారు. ఆయన సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. లాలూ సతీమణి రబ్రిదేవి మాట్లాడుతూ రామ్ దేవ్ తన భర్తను పరామర్శించేందుకు వచ్చారనీ, ఇటీవల అనారోగ్యానికి గురైన తన భర్తను పరామర్శించి యోగా చేయాల్సిందిగా సూచించారని చెప్పారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Digvijay SIngh 
  • Subramanian Swamy 
  • Demonetisation 

Similar News

దాదాపు 50 ఏళ్లుగా అంతరిక్షంలో ప్రయాణం.. వాయేజర్-1లో భూమి నుంచి పంపిన ఓ అరుదైన సందేశం!

2026-11-20 04:37 GMT

హైదరాబాద్‌లో పోడ్ కార్లు.. ఐటీ ఉద్యోగుల ప్రయాణ కష్టాలు తగ్గుతాయా?

2026-11-20 04:15 GMT

జడ్పీ పీఠాలు : టీడీపీకి 22, జనసేనకు 4, బీజేపీకి 1

2026-11-20 03:36 GMT

యూత్ కి బీపీ షుగర్...ఏంటీ జనరేషన్ !

2026-11-20 03:36 GMT

బీఆర్ఎస్ కి రాజకీయ సిద్ధి...అక్కడే రేవంత్ గురి !

2026-11-20 03:35 GMT

పిచ్చికుక్క కరిచిందా.. ఎర్రగడ్డకు పంపిస్తాం.. కోమటిరెడ్డికి రేవంత్ రెడ్డి పరోక్ష పంచ్.. కాంగ్రెస్‌లో మాటల మంటలు

2026-11-19 21:30 GMT

విశాఖ నుంచి తిరుపతి వెళ్ళే భక్తులకు సూపర్ న్యూస్

2026-11-19 21:15 GMT

సీనియర్లను రంగంలోకి దించిన జనసేన

2026-11-19 21:15 GMT

ఎవరు గెలిచినా మేమే...వైసీపీ అలా తృప్తి పడుతోందా ?

2026-11-19 21:12 GMT

మంత్ర్రుల‌ను కాద‌న‌లేరు.. కార్య‌క‌ర్త‌ల‌ను వ‌ద్ద‌న‌లేరు: బాబుకు చిక్కులు

2026-11-19 21:12 GMT

పెరిగే సీట్లు వైసీపీ రాజకీయాన్ని ముంచేస్తాయా ?

2026-11-19 21:11 GMT

మలేషియా గేట్లు మూసేసింది.. భారతీయులకు ఇక వీసా కష్టాలు.. అసలు కారణమిదే..

2026-11-19 21:10 GMT

Copyright @2026

Powered by Blink CMS