• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  దీదీ ముహూర్తం ఫిక్స్...

దీదీ ముహూర్తం ఫిక్స్ చేసిందా ?

By - Tupaki Desk
Update: 2021-07-26 05:35 GMT
నరేంద్రమోడి సర్కార్ కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తీసుకురావటానికి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతబెనర్జీ ముహూర్తం నిర్ణయించారా ? క్షేత్రస్ధాయిలోని పరిస్ధితులు చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈనెల 28వ తేదీన ఢిల్లీలో ప్రతిపక్ష నేతలందరినీ ఒకచోట చేర్చాలని దీదీ ఇప్పటికే ఏర్పాట్లు మొదలుపెట్టేశారు. విచిత్రమేమిటంటే 28వ తేదీన ఉదయం ప్రధానమంత్రి నరేంద్రమోడితో మమత భేటీ అవబోతున్నారు.

మోడితో భేటీ అయిపోగానే అదేరోజు మధ్యాహ్నం పైన ప్రతిపక్ష నేతలతో సమావేశం ఏర్పాటుకు రెడీ అవుతున్నారు. ప్రతిపక్షాలన్నింటినీ సమావేశానికి రప్పించేందుకు ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, కాంగ్రెస్ కీలక నేత చిందంబరం చొరవ తీసుకోవాలని దీదీ రిక్వెస్టు చేశారు. వీళ్ళద్దరినీ ఫాలోఅప్ చేసే బాధ్యతను తన మేనల్లుడు, తృణమూల్ పార్టీలో కీలక నేతైన అభిషేన్ బెనర్జీ, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కు అప్పగించారు. వీళ్ళద్దరు ఇదే పనిపై ఈనెల 22వ తేదీనుండి ఢిల్లీలోనే ఉన్నారు.

మొత్తానికి మోడికి వ్యతిరేకంగా బలమైన ఫ్రంట్ ను ఏర్పాటు చేయాలనే పట్టుదల మమతలో రోజురోజుకు పెరిగిపోతోంది. 28వ తేదీన విపక్షాల సమావేశం గనుక సక్సెస్ అయితే ఈ ఏడాదిచివరలో కోలకత్తాలో బ్రహ్మాండమైన బహిరంగసభ నిర్వహించాలని కూడా దీదీ ఇప్పటికే డిసైడ్ అయ్యారట. దీదీ వరసు చూస్తుంటే తొందరలోనే బెంగాల్ ను వదిలేసి జాతీయ రాజకీయాల్లోకి  ప్రవేశించటం ఖాయమన్నట్లే ఉంది.

మోడికి వ్యతిరేకంగా మమత ఇంతగట్టి ప్రయత్నాలు చేయటం వెనుక కీలకమైన కారణమే ఉందంటున్నారు పరిశీలకులు. కాలేజీలో జూనియర్లను సీనియర్లు ర్యాగింగ్ చేసినట్లే బెంగాల్ ఎన్నికలకు ముందు నరేంద్రమోడి, అమిత్ షాలు మమతను బాగా ఇబ్బందిపెట్టారు. ఎన్నికలకు ముందు అడుగడుగునా చాలా అవమానాలకు గురిచేశారు. తృణమూల్ ఎంఎల్ఏలను, సీనియర్ నేతలకు లాగేసుకున్నారు. ఒత్తిళ్ళకు లొంగకుండా మమతతోనే ఉన్న కొందరు నేతలపై కేసులు పెట్టించారు.

ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో మమత ఓడిపోయుంటే పరిస్దితులు ఎలాగుండేదో తెలీదు. అయితే మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టగానే మోడి, అమిత్ పై దీదీలో కసి ఒక్కసారిగా పెరిగిపోయింది. దాంతోనే మోడిని ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో దెబ్బకొట్టాలనే పట్టుదల పెరిగిపోతోంది. అందుకనే విపక్షాల ఐక్యతకు కాలికి బలపం కట్టుకుని మరీ తిరుగుతున్నారు. చివరకు బద్ధ శతృవైన కాంగ్రెస్ తో సైతం చేతులు కలపటానికి సిద్ధమవ్వటంతోనే దీదీలో కసి ఏమిటో తెలిసిపోతోంది. చూద్దాం 28వ తేదీన ఏమి జరుగుతుందో.
Tags:    
  • Mamata Banerjee 
  • Anti Modi politics 
  • Bharatiya Janata Party 
  • Central Government 
  • opposition leaders 

Similar News

రేవంత్ బయటపెట్టిన ‘ది గ్రేట్ ఫైనాన్షియల్’ మార్వలస్ ఐడియా

2026-11-04 13:15 GMT

రేవంత్ గెలవడని కేటీఆర్ డిసైడ్.. ఆ భూములు కొనొద్దని పారిశ్రామికవేత్తలకు హెచ్చరిక

2026-11-04 13:10 GMT

పాపం ష‌ర్మిల‌.. ఇంత హ‌ర్ట్ అవుతార‌నుకోలేదా ..?

2026-11-04 13:01 GMT

మాజీ ఐపీఎస్‌.. ఓట‌మి స్ఫూర్తి.. !

2026-11-04 13:00 GMT

నాన్న‌గారి ఆశ‌యాలు నెర‌వేరుస్తా: రాధా ఫ‌స్ట్ స్పీచ్‌

2026-11-04 13:00 GMT

నియంతలు ట్రంప్, నెతన్యాహు ఔట్ అట.. ‘సీజేపీ‘ నేతలు హ్యాపీ.. టార్గెట్ మోడీయేనా?

2026-11-04 12:57 GMT

ఓటువేయలేదుగా.. నా డబ్బులు నాకివ్వండి.. వైసీపీ అభ్యర్థి 'రివర్స్ వసూళ్లు' వైరల్

2026-11-04 11:17 GMT

భారతీయులతో పెట్టుకున్నాడు.. ట్రంప్ అనుభవిస్తున్నాడు..

2026-11-04 10:57 GMT

టికెట్ ధ‌ర‌ల‌పై CM విజ‌య్ ముందు చూపు మనవాళ్ల‌కు ఏదీ?

2026-11-04 09:39 GMT

ఏపీలో మ‌రో ఎన్నిక‌ల పోరు..!

2026-11-04 09:22 GMT

రాప్తాడు నిందితుడిపై కాల్పుల కేసులో కీలక పరిణామం

2026-11-04 09:14 GMT

ఎలా గెలవాలో చెప్పారు...జగన్ కంగ్రాట్స్ !

2026-11-04 09:06 GMT

Copyright @2026

Powered by Blink CMS