ఏపీలోని వలంటీర్ల వ్యవస్థ ఏపీ సీఎం జగన్ కలల ప్రాజెక్టుగా చెప్పుకుంటారు. దేశమంతా దీనిపై చర్చ జరిగింది. గ్రామ సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థను కొత్త ఐఏఎస్, ఐపీఎస్ లకు కూడా వివరించారు.అయితే తాజాగా వాలంటీర్లపై డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొందరు వాలంటీర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని కామెంట్స్ చేశారు.
90శాతం వాలంటీర్లు అనుకులంగా ఉంటే.. 10శాతం మంది వ్యతిరేకంగా ఉన్నారని డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి విమర్శించారు. కొందరి వల్ల అందరికీ చెడ్డ పేరు వస్తుందని విమర్శించారు.వాలంటీర్ల వ్యవస్థను ప్రధాని మోడీ సైతం కొనియాడారని గుర్తు చేశారు. రాష్ట్రంలో వాలంటీర్లకు గుర్తింపు వచ్చిందంటే కేవలం సీఎం జగన్ వల్లేనని శ్రీవాణి చెప్పుకొచ్చారు. వలంటీర్లు బాధ్యతగా పనిచేయాలని సూచించారు.