• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ప్రయాణికుడు మృతితో...

ప్రయాణికుడు మృతితో వెనక్కి మళ్లిన ఢిల్లీ-అమెరికా విమానం

By - Tupaki Desk
Update: 2021-12-04 12:56 GMT
అమెరికాకు బయలుదేరిన విమానంలోని ఒక ప్రయాణికుడు మరణించాడు. దీంతో మూడు గంటలు ప్రయాణించిన ఆ విమానాన్ని వెనక్కి మళ్లించారు. దేశ రాజధాని ఢిల్లీ అంతర్జాతీయ ఎయిర్ పోర్టులో ఈ ఘటన జరిగింది. శనివారం ఎయిర్ ఇండియాకు చెందిన ఏఐ-105 విమానం ఢిల్లీ నుంచి నెవార్క్ కు టేకాఫ్ అయ్యి మూడు గంటలకు పైగా ప్రయాణించింది.

అయితే భార్యతోపాటు అందులో ప్రయాణించిన అమెరికా జాతీయుడు విమానం ఆకాశంలో ఉండగా చనిపోయాడు. దీంతో ఆ విమానాన్ని వెంటనే వెనక్కి మళ్లించి ఢిల్లీ ఎయిర్ పోర్టులో ల్యాండ్ చేశారు.

ఎయిర్ ఇండియా సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. ‘ఎయిర్ ఇండియా ఢిల్లీ-నెవార్క్ (యూఎస్) విమానం మూడు గంటలకు పైగా ప్రయాణించిన తర్వాత అత్యవసర వైద్య పరిస్థితి కారణంగా ఢిల్లీకి తిరిగి వచ్చింది అని ఎయిర్ ఇండియా అధికారి ఒకరు తెలిపారు.

ఎయిర్ పోర్టులోని వైద్యులు విమానంలోకి వచ్చి ఆ వ్యక్తి చనిపోయినట్లు నిర్ధారించారని చెప్పారు. ఈ విషయాన్ని ఎయిర్ పోర్టు పోలీసులకు చెప్పినట్లు వెల్లడించారు.

కాగా.. విమాన టైమ్ డ్యూటీ లిమిటేషన్ (ఎఫ్.డీ.టీఎల్) నిబంధనల ప్రకారం విమాన కార్యకలాపాల కోసం మరొక బ్యాచ్ సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు ఎయిర్ ఇండియా అధికారి తెలిపారు. కొత్త సిబ్బందితో అదే విమానం సాయంత్రం 4 గంటలకు అమెరికాకు బయలుదేరుతుందని పేర్కొన్నారు.
Tags:    
  • Delhi International Airport 
  • Air India 
  • Flight Time 
  • Political parties 
  • Political news 
  • Political Updates 

Similar News

బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం : రేపు తుపాను, ఎల్లుండి తీవ్రతుపాను

2026-11-15 06:18 GMT

నో పైలెట్.. నో ఫ్యూయ‌ల్.. విద్యుత్‌తో న‌డిచే విమానాన్ని క‌నిపెట్టిన చైనా!

2026-11-15 06:18 GMT

మృత్యువు ఎంత దూరం !

2026-11-15 05:30 GMT

IPL బాస్‌కి మాఫియా బెదిరింపులు లేక‌పోయినా బ్రిటీష్ పౌర‌స‌త్వం దేనికి?

2026-11-15 05:29 GMT

ICE నియామకాల ప్రచారంపై విమర్శలు.. అమెరికాలో కొత్త వివాదం!

2026-11-15 05:28 GMT

చంద్రబాబు కాన్వాయ్ కోసం ఆరు కొత్త వాహనాలు.. ఖర్చు రూ.1.78 కోట్లు!

2026-11-15 04:29 GMT

జెన్సన్ హువాంగ్‌ను తిరిగి తీసుకోవాలంటూ పిటిషన్.. లక్ష దాటిన సంతకాలు!

2026-11-15 04:29 GMT

భారత్ - అమెరికా ట్రేడ్ డీల్‌పై జైశంకర్ కీలక వ్యాఖ్యలు.. ఇంకా అమెరికా దగ్గరే కొన్ని చిక్కులు!

2026-11-15 04:28 GMT

మంత్రులకు డేంజర్ బెల్స్ ?

2026-11-15 03:43 GMT

గుండ ఫ్యామిలీతో ఢీ ... అనుకున్నంత ఈజీ కాదా ?

2026-11-15 03:43 GMT

మోడీనే తలచుకుంటూ...రాహుల్ ఎదిగిపోయారా ?

2026-11-15 03:42 GMT

మోడీతో డీకే ...కోపరేషన్ కోసమేనా ?

2026-11-15 03:42 GMT

Copyright @2026

Powered by Blink CMS