కేజ్రీవాల్ కి హైకోర్టులో చుక్కెదురు!

Update: 2016-10-19 12:43 GMT
రాజకీయాల్లో విమర్శలూ ప్రతి విమర్శలూ అత్యంత సహజం.. ఇది కొందరి మాట. రాజకీయాల్లో విమర్శలకు ఒక క్రెడిబిలిటీ ఉండాలి - చేసిన విమర్శలపై అవసరమైతే న్యాయపోరాటానికైనా వెళ్లి ఆ విమర్శల్లో వాస్తవాన్ని నిరూపించాలి.. ఇది మరికొందరి మాట. ఈ విషయంలో తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి - ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఇబ్బందుల్లో పడ్డారు. కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ దాఖలు చేసిన పరువునష్టం కేసులో కేజ్రీవాల్ కు స్థానిక కోర్టులో చుక్కెదురైంది.

2013 వరకూ దాదాపు 13 ఏళ్లపాటు ఢిల్లీ క్రికెట్ బోర్డు (డీడీసీఏ)లో ఉన్నత పదవిలో ఉన్న సమయంలో నేటి కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ అవినీతికి పాల్పడ్డాడని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తో పాటు మరికొందరు ఆప్ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. అయితే ఇవికూడా అన్ని రాజకీయ పార్టీల - నేతల మధ్య విమర్శలుగానే తీసుకోని అరుణ్ జైట్లీ కోర్టుకెళ్లారు. ఈ విషయంలో కేవలం రాజకీయ మైలేజీ కోసం - తనపైనా తన కుటుంబంపైనా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఢిల్లీ హీకోర్టులో పరువు నష్టం దావా వేశారు. అయితే ఈ కేసుకు సంబందించి బెయిల్ మంజూరు చేయాలని కోరిన కేజ్రీవాల్ కు నిరాశ తప్పలేదు. తాజాగా ఈ కేసును విచారించిన ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసే ప్రసక్తిలేదని తీర్పు వెల్లడించింది.
Read more!

కాగా తనపై తప్పుడు ఆరోపణలు చేయడంవల్ల ఆప్ నేతలకే నష్టం చేకురుతుందని జైట్లీ పేర్కొన్నారు. ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన నేతల్లో అరవింద్ కేజ్రీవాల్ తో పాటు ఆప్ నేతలు అశుతోష్ - కుమార్ వివ్వాస్ - సంజయ్ సింగ్ - రాఘవ్ చద్ధా - దీపక్ బాజ్ పాయ్ ఉన్నారు. ఈ విషయాలపై స్పందించిన ఆప్ నేతలు... రాజకీయంగా తమపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే అరుణ్ జైట్లీ పరువునష్టం దావా వేశారని మండిపడుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News