• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  దాసరి మరణంపై అనుమానాలా?

దాసరి మరణంపై అనుమానాలా?

By - Tupaki Desk
Update: 2017-05-31 08:34 GMT
ఓవైపు దర్శకరత్న దాసరి నారాయణరావు మృతిపై సినీ జనాలతో పాటు ఆయన అభిమానులందరూ శోకసంద్రంలో ఉంటే.. మరోవైపు ఆయన కుటుంబంలోని అంతర్గత కలహాలు ఇదే సమయంలో బయటికి రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. దాసరి చనిపోయిన కొన్ని గంటల్లోనే ఆయన పెద్ద కోడలు సుశీల మీడియా ముందుకొచ్చి సంచలన వ్యాఖ్యలు చేసింది. దాసరి మరణంపై అనుమానాలున్నట్లు ఆమె ఆరోపించడం గమనార్హం. తన మామ తనకు అన్యాయం చేసి వెళ్లిపోయారని ఆమె అంటోంది. తమ కుటుంబంలో ఇంకా ఆస్తి పంపకాలు జరగలేదని.. తనకు అంతా సెటిల్ చేస్తానని చెప్పిన దాసరి అంతలోనే మృతి చెందారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

దాసరి పెద్ద కొడుకు తారక ప్రభు భార్య అయిన సుశీల.. కొన్నేళ్లుగా ఆ కుటుంబానికి దూరంగా ఉంటోంది. పదేళ్ల కిందటే ఆమె భర్తపై వరకట్న వేధింపుల కేసు పెట్టింది. తర్వాత ఆ కేసు ఏమైందో కానీ.. కొడుకు (పేరు దాసరి నారాయణరావు)తో కలిసి ఆమె వేరుగా ఉంటోంది. మే 4న దాసరిని కలిశానని.. ఈ సందర్భంగా ఆస్తి పంపకాల గురించి అడగ్గా.. రెండు వారాల్లో తనకు సర్జరీ జరుగుతుందని.. అదయ్యాక అంతా సెటిల్ చేస్తానని దాసరి అన్నాడని సుశీల చెప్పింది. తన కొడుకు భవిష్యత్తు గురించి కూడా ఆయనతో మాట్లాడానని... ఎంతోమందికి సినీ రంగంలో జీవితాన్నిచ్చిన తాను.. తన మనవడిని పట్టించుకోనా అన్నారని.. కానీ ఇంతలోనే ఆయన తనకు న్యాయం చేయకుండానే వెళ్లిపోయారని ఆమె అంది. తాను ఆసుపత్రిలో దాసరిని చూడ్డానికి వెళ్తే.. లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారని.. అందుకే ఆయన మరణంపై తనకు అనుమానాలున్నాయని ఆమె ఆరోపించింది. సుశీల ఆరోపణలపై దాసరి కుటుంబ సభ్యులు ఏమంటారో చూడాలి.

Full View


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Dasari Daughter in Law 
  • Dasari Narayana Rao Death 
  • Telugu NEws 

Similar News

ఇక రాత్రిపూట కూడా సూర్యుడి వెలుగులు.. ప్రకృతి నియమాలకు విరుద్ధంగా వెళుతున్నామా?

2026-11-03 18:30 GMT

అతి పెద్ద కార్పోరేషన్ కి పిన్న వయసులో మేయర్ గా!

2026-11-03 18:24 GMT

పవన్ పిఠాపురంలో రెబెల్స్ కొత్త రికార్డు !

2026-11-03 18:23 GMT

తమిళనాడుకు ప్రత్యేక జెండా ...ఏం జరుగుతోంది ?

2026-11-03 18:16 GMT

బాబుతో విజయ్ డీకే రేవంత్ : దక్షిణాదిన కొత్త ఐక్యత !

2026-11-03 18:15 GMT

ఒక్క ఓటుతో విజేత‌లు.. ఎన్నెన్నో విచిత్రాలు!

2026-11-03 18:13 GMT

బంగ్లా బార్డర్ లో భారత జవాన్లపై దాడి చేస్తే.. ట్రీట్ మెంట్ వేరేలా ఉంటుంది.. అదే జరిగింది..

2026-11-03 18:09 GMT

ఢిల్లీ హోటల్ గొడవపై స్పందించిన మంత్రి దామోదర.. అసలేం జరిగింది?

2026-11-03 18:06 GMT

వైసీపీని 'ఓటు' బ్యాంకు కాపాడిందా?!

2026-11-03 17:30 GMT

కోయ ప్రవీణ్...వైసీపీకి ఆయన కఠినం కానీ !

2026-11-03 17:00 GMT

పెళ్లి కోసం 7 వేల మంది క్యూ.. ఇంత కరువులో ఉన్నారేంట్రా సామీ

2026-11-03 16:30 GMT

మీరు గెలిచినా, ఓడినా ఎవరికీ పట్టదు.. వైరల్ అవుతున్న బిజినెస్‌మ్యాన్ ట్వీట్!

2026-11-03 15:30 GMT

Copyright @2026

Powered by Blink CMS