• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  మహారాష్ట్రలో కరోనా...

మహారాష్ట్రలో కరోనా విజృంభణ .. ఒక్కరోజే 16,620 పాజిటివ్ కేసులు !

By - Tupaki Desk
Update: 2021-03-15 07:31 GMT
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి జోరు మాములుగా లేదు. తాజాగా గత 24 గంటల్లో ఈ ఏడాదిలోనే అత్యధిక కేసులు నమోదు అయ్యాయి. ఒక్క రోజులో 16,620 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు మొత్తం కేసులు సంఖ్య 23,14,413  కు చేరుకుంది. ఒక్కరోజే 50 మంది మరణించడంతో మృతుల సంఖ్య 52,861 కు చేరుకుందని ఆరోగ్య శాఖ తెలిపింది.  మహారాష్ట్రలో గత రెండు రోజుల్లో, రాష్ట్రంలో రోజువారీ కేసుల సంఖ్య 15,000 పైన నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఆదివారం 16,000 మార్కును దాటింది. నిన్న ఒక రోజులో 8,861 మంది రోగులు డిశ్చార్జ్ కావడంతో, రాష్ట్రంలో కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 21,34,072 కు పెరిగిందని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

రాష్ట్రంలోని కోవిడ్-19 రికవరీ రేటు 92.21 శాతం, మరణాల రేటు 2.28 శాతంగా ఉందని మహారాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్రంలో ప్రస్తుతం 1,26,231 క్రియాశీల కేసులు ఉన్నాయని ఆరోగ్యశాఖ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం కరోనా బారినపడిన 5,83,713 మంది హోమ్ ఐసోలేషన్ లో ఉండగా, 5,493 మంది క్వారంటైన్ అయ్యారు. ఆదివారం 1,08,381 మందిని పరీక్షించగా, మొత్తం పరీక్షల సంఖ్య 1,75,16,885 కు చేరింది. ముంబై నగరంలో కొత్తగా 1,963, పూణే నగరం లో 1,780 కేసులు, ఔరంగాబాద్ నగరంలో 752, నాందేడ్ లో 351, పింప్రి చిన్చ్వాడ్ లో 806 కేసులు, అమరావతి లో 209, నాగ్‌పూర్లో 1,976 కేసులు నమోదయ్యాయి. అంతేకాదు అహ్మద్‌ నగర్ లో 151, జల్గావ్ సిటీ 246, నాసిక్ సిటీ 946 కేసులు నమోదయ్యాయి.

రాష్ట్రంలో కరోనా మహమ్మారి కేసులు భారీగా పెరుగుతుండటం తో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు . కరోనా నిబంధనలు ఖచ్చితంగా పాటించకపోతే మరొకసారి లాక్ డౌన్ విధిస్తామని, కఠినమైన లాక్ డౌన్ విధించే పరిస్థితి వస్తుందని పేర్కొన్నారు. మహారాష్ట్రలో ప్రస్తుత పరిస్థితి అదుపు తప్పుతుండటంపై ఆయన విచారం వ్యక్తం చేశారు . కరోనా నియమాలు తప్పనిసరిగా పాటించాలని కోరారు.
Tags:    
  • Dangerous Disease In Maharashtra 
  • Maharashtra Marriage 
  • 700 Corona Case 
  • Telugu News 

Similar News

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

విజ‌య‌న‌గ‌రం.. బాబు వ‌రం ఎవ‌రికి?

2026-11-19 09:55 GMT

కష్టజీవులకు భరోసా.. నిర్మాణ రంగానికి ఊతం : ఏపీలో ‘లేబర్ అడ్డా’ల విప్లవం!

2026-11-19 08:05 GMT

రూ.7 కోట్ల ఉద్యోగాల స్కాం : కుట్ర జరిగిందంటున్న జనసేన నేతలు.. అసలు నిజం ఇదే!

2026-11-19 08:02 GMT

ఆకాశంలో అంబానీ 'సిగ్నల్'.. మస్క్‌కు ఇక టెన్షన్ షురూ.. ఇప్పుడు స్పేస్‌లో శాటిలైట్ల జాతర

2026-11-19 06:00 GMT

వాన్స్‌కు షాక్ ఇవ్వనున్న ట్రంప్.. 2028 రేసులో రూబియో పేరు!

2026-11-19 05:37 GMT

Copyright @2026

Powered by Blink CMS