కరోనా లేటెస్ట్ అప్డేట్ : 8 లక్షలు దాటిన పాజిటివ్ కేసులు .. 22,123 మంది మృతి !

Update: 2020-07-11 07:30 GMT
భారత దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. వైరస్ స్వైరవిహారం చేస్తుంది. ప్రతి రోజు నమోదు అయ్యే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతుంది.  రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతుండటంతో దేశ ప్రజల్లో కూడా ఆందోళన పెరిగిపోతుంది. తాజాగా... ఒకే రోజున ఏకంగా... 27వేలకు పైగా కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో అత్యధికంగా 27,114 కరోనా కేసులు బయటపడ్డాయి.  ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. అదే సమయంలో 519 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు.

తాజా కేసులతో కలిపి మొత్తంగా దేశంలో 8,20,916 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 2,83,407 యాక్టివ్ కేసులు ఉండగా 5,15,385 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అలాగే  ఇప్పటివరకు కరోనాతో మరణించినవారి సంఖ్య 22,123కు చేరింది. అమెరికా, బ్రెజిల్ తర్వాత ఇప్పుడు ఇండియాలోనే రోజువారీ ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. మొత్తం కేసుల్లో కూడా భారత్ మూడోస్థానంలో ఉంది. రోజువారీ మరణాల్లో ఇండియా టాప్ 4లో ఉండగా... మొత్తం మరణాల్లో నెల నుంచి 8వ స్థానంలోనే ఉంది.

ఇక తెలంగాణలో కొత్తగా 1278 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి మొత్తం మృతుల సంఖ్య 339కి చేరింది. తాజాగా జీహెచ్ ఎం సీ పరిధిలో 762 కొత్త కరోనా కేసులు వచ్చాయి. తాజా కేసులతో కలిఫై  రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 32,224కి పెరిగింది. ఇక ఏపీలో 1608 పాజిటివ్ కేసులొచ్చాయి. వీటితోకలిపి ఇప్పటిదాకా 25422 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో ఏపీలో కరోనా వైరస్ సోకి 15 మంది ప్రాణాలు విడిచారు. . రాష్ట్రవ్యాప్తంగా ఏపీలో 13,194 మంది డిశ్చార్జి కాగా, 11,936 మంది పలు ఆస్పత్రుల్లో కరోనా వైరస్ చికిత్స తీసుకుంటున్నారు. ఇకపోతే దేశంలో మహారాష్ట్ర లో అత్యధికంగా 238461 కేసులు నమోదు అయ్యాయి. ఆ తరువాత ఢిల్లీలో  109140 , తమిళనాడు లో  130261, గుజరాత్ లో  40069, ఉత్తరప్రదేశ్ లో  33700 , కర్ణాటక లో  33418 కేసులు నమోదు అయ్యాయి.
Tags:    

Similar News