• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  జనవరి 27 ఆదివారం 2019...

జనవరి 27 ఆదివారం 2019 దినఫలాలు

By - Tupaki Desk
Update: 2019-01-27 01:30 GMT
గమనిక: ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి, గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు.

మేష రాశి: సంఘంలో గౌరవం పెరుగుతుంది. వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఆర్థికంగా చేయూత లభిస్తుంది. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు. రాజకీయ, కళారంగాల వారికి నూతనోత్సాహం. ఐటీ నిపుణులకు పురస్కారాలు. విద్యార్థులకు అవకాశాలు కలిసివస్తాయి. మహిళలకు కుటుంబం నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. విష్ణుసహస్రనామ పారాయణం చేయడం మంచిది.

వ‌ృషభ రాశి: విలువైన సమాచారం అందుతుంది. వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఆర్థిక ఇబ్బందులు తీరతాయి. మీ లక్ష్యం నెరవేరుతుంది. ఆస్తి వివాదాలు తీరతాయి. వ్యాపారాల్లో అడుగు ముందుకేస్తారు. ఉద్యోగాల్లో ఒత్తిడులు తొలగుతాయి. రాజకీయ, కళారంగాల వారికి విజయాలు తథ్యం. ఐటీ ఉద్యోగులకు ఆహ్వానాలు అందుతాయి. విద్యార్థులు సాంకేతిక విద్యావకాశాలు దక్కించుకుంటారు. మహిళలకు భూలాభాలు ఉంటాయి. వేంకటేశ్వరస్వామిని పూజించడం మంచిది.

మిథున రాశి: ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. శ్రమ తప్ప ఫలితం ఉండదు. ఆదాయం తగ్గుతుంది. కాంట్రాక్టులు చేజారతాయి. బంధువులతో అకారణంగా వివాదాలు నెలకొంటాయి. వ్యాపారాల్లో నిరుత్సాహం. ఉద్యోగులకు బదిలీలు లేదా విధుల్లో మార్పులు. రాజకీయ, కళారంగాల వారికి విదేశీ పర్యటనల్లో మార్పులు. ఐటీ ఉద్యోగులకు నిరుత్సాహం. విద్యార్థులు మరింత శ్రమించాలి. మహిళలకు మానసిక అశాంతి. గణపతికి అభిషేకం చేయడం మంచిది.

కర్కాటక రాశి: బంధువులతో వివాదాలు నెలకొంటాయి. మానసిక ఆందోళనకు గురవుతారు. వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. వ్యాపార లాదేవీల్లో ఒడిదుడుకులు. ఉద్యోగాల్లో నిరుత్సాహం కలుగుతుంది. రాజకీయ, కళారంగాల వారికి నిరాశాజనకం. ఐటీ ఉద్యోగులకు గందరగోళంగా మారుతుంది. విద్యార్థులు మరింత శ్రమించాల్సి ఉంటుంది. మహిళలకు కుటుంబంలో చికాకులు. దత్తాత్రేయుడిని పూజించడం మంచిది.

సింహ రాశి: మీ శ్రమకు ఫలితం లభిస్తుంది. రాబడి అనుహ్యంగా పెరుగుతుంది. ఉద్యోగాల్లో ఒత్తిడులు అధికం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. నూతన ఉద్యోగ అవకాశం ఉంది. ఉద్యోగాల్లో ఒత్తిడులు అధిగమిస్తారు. ఐటీ నిపుణులకు నూతన అవకాశాలు దక్కుతాయి. విద్యార్థులు లక్ష్యాలు సాధిస్తారు. మహిళలకు కుటుంబ సమస్యలు తీరతాయి. లక్ష్మీదేవీ స్తోత్రాలు పఠించడం మంచిది.

కన్యారాశి: ఆలోచనలు స్థిరంగా ఉండవు. కొత్త రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. కాంట్రాక్టులు చేజారతాయి. ఆర్థిక పరమైన హామీలు ఇవ్వద్దు. వ్యాపారాల్లో ఒడిదుడుకులు. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులుంటాయి. రాజకీయ, కళారంగాల వారికి మనశ్శాంతి లోపిస్తుంది. విద్యార్థులు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. మహిళలకు కుటుంబ సమస్యలు. గాయత్రీదేవీ స్తోత్రాలు పఠించడం మంచిది.

తులారాశి: మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆస్తి వివాదాలుతీరి లబ్దిపొందుతారు. సన్నిహితుల నుంచి శుభవర్తమానాలు. నూతన కార్యక్రమాలు చేపడుతారు. వ్యాపారాల్లో ఒత్తిడులు. ఉద్యోగాల్లో పదోన్నతి సూచనలు. పారిశ్రామిక, రాజకీయవర్గాలకు విదేశీయానం. ఐటీ నిపుణులకు పురస్కారాలు. విద్యార్థులకు కొత్త పరిశోధనావకాశాలు. మహిళలకు అనుకోని ఆహ్వానాలు. విష్ణుసహస్రనామ పారాయణం చేయడం మంచిది.

వృశ్చిక రాశి: వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడుతాయి. బంధువులతో తగాదాలు ఏర్పడుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. వివాదాలకు దూరంగా ఉండండి. కొత్త రుణాలు చేస్తారు. ఉద్యోగులకు బదిలీలు సూచనలు. పారిశ్రామిక, రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు రద్దు. ఐటీ నిపుణుల అంచనాలు తప్పుతాయి. విద్యార్థులు శ్రమిస్తే ఫలితం ఉంటుంది. మహిళలకు చికాకులు. గణపతిని పూజించడం మంచిది.

ధనస్సు రాశి: ఆలోచనలు కలిసి వస్తాయి. పనుల్లో విజయం సాధిస్తారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. గృహ నిర్మాణయత్నాలు కలిసివస్తాయి. వ్యాపారాల్లో పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగులకు శుభ సమాచారం. రాజకీయ, పారిశ్రామిక వర్గాలకు వ్యవహారాల్లో అనుకూలత. ఐటీ నిపుణులక సన్మానాలు. విద్యార్థులకు పరిశోధనలు లాభిస్తాయి. మహిళలకు కుటుంబీకులతో వివాదాలు. హనుమాన్ చాలీసా పఠించడం మంచిది.

మకర రాశి: ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. ఆస్తి వివాదాలు తీరతాయి. వ్యవహారాల్లో విజయం. ఉద్యోగులకు శుభ సమాచారం. పారిశ్రామిక, రాజకీయ వర్గాలకు విదేశీ ఆహ్వానాలు అందుతాయి. ఐటీ ఉద్యోగులకు పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆస్తి వివాదాలు తీరతాయి. మహిళలకు కుటుంబీకుల నుంచి ప్రోత్సాహం. ఆదిత్య హృదయం పఠించడం మంచిది.

కుంభరాశి: బంధువుల నుంచి విమర్శలు. ఆదాయం కంటే ఖర్చులు అధికం. కుటుంబంలో వివాదాలు. వ్యాపారాల్లో లాభాలు అంతగా కనిపించవు. ఉద్యోగులకు విధుల్లో అవాంతరాలు. పారిశ్రామిక, రాజకీయవర్గాలవారు పట్టుదలతో ముందుకెళుతారు. ఐటీ ఉద్యోగులకు ఒడిదుడుకులు. విద్యార్థులకు అసంతృప్తి. మహిళలకు నిరుత్సాహం. శివస్తోత్రాలు పఠించడం మంచిది.

మీనరాశి: కొత్తగా రుణాలు చేస్తారు. కుటుంబీకులతో కలహాలు. ఆలోచనలు కలిసిరావు. ప్రతిభకు తగిన గుర్తింపు లభించదు. వ్యాపార లావాదేవీలు మందగిస్తాయి. ఉద్యోగులకు బదిలీ సూచనలు. రాజకీయ, కళారంగాలవారికి విదేశీ పర్యటనల్లో మార్పులుంటాయి. ఐటీ ఉద్యోగులకు సమస్యలు. విద్యార్థుల శ్రమకు ఫలితం దక్కదు. మహిళలకు మానసిక అశాంతి. విష్ణు ధ్యానం చేయడం మంచిది.
    

Tags:    
  • Daily Rashi Phalalu 
  • Daily Horoscope 
  • Horoscope 
  • Rashi Phalalu 
  • Telugu News 

Similar News

విశాఖ మరో గిఫ్ట్... కైలాసగిరికి కొత్త రోప్‌వే

2026-11-19 04:57 GMT

భూమి మీద ఇక నివసించలేమా...భయపెడుతున్న నివేదిక !

2026-11-19 04:57 GMT

గంటా దూకుడు రాజకీయం...బొత్స కూతురు ఏం చేస్తున్నట్లు ?

2026-11-19 03:15 GMT

మోడీ ఇచ్చిన కానుక‌ల వెనుక 'బిజినెస్' యాంగిల్‌!

2026-11-19 03:15 GMT

వైసీపీ వైపు నాన్ ఎన్డీయే వర్గాలు

2026-11-19 03:14 GMT

పవన్ బ్యాలెన్స్ పాలిటిక్స్...చాన్స్ కోసం సైనిక్స్ !

2026-11-19 03:14 GMT

ఈ నెల 23 నుంచి ప్రత్యేక పార్లమెంట్‌ సమావేశాలు ?

2026-11-19 03:13 GMT

జగన్ లండన్ టూర్ ఫిక్స్...ఫుల్ బిజీగానే !

2026-11-19 03:13 GMT

₹50 కోట్ల పెళ్లి.. 4 లక్షల మంది అతిథులు.. విజేతకు థార్ కారు.. ఇలాంటిది చూడలేదప్పుడు?

2026-11-19 03:12 GMT

అందరూ కలిసి ఖైరతాబాద్ ఉప ఎన్నికను ఆపేస్తున్నారన్నట్టు..?!

2026-11-19 03:09 GMT

కూటమిలో భారీ ఉత్కంఠ.. ఎవరికెన్ని జెడ్పీలు ?

2026-11-19 03:09 GMT

మోడీ ఎక్కింది బజాజ్ ఆటో.. క్రెడిట్ మాత్రం పాకిస్తాన్‌కు.. ఫుల్ కామెడీ

2026-11-19 03:07 GMT

Copyright @2026

Powered by Blink CMS