• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  జనవరి 26 శనివారం 2019...

జనవరి 26 శనివారం 2019 దినఫలాలు

By - Tupaki Desk
Update: 2019-01-26 01:30 GMT
గమనిక: ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారనే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి, గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు.

మేష రాశి: ఆలోచనలు అమలు చేస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. సన్నహితులు అన్నింటా సహకరిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పనుల్లో సానుకూలత. రియల్టర్లు, కాంట్రాక్టర్లకు సమస్యలు తీరతాయి. ఉద్యోగాల్లో ప్రమోషన్లు. వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. పారిశ్రామిక, కళారంగాలవారు ఉత్సాహంగా గడుపుతారు. ఐటీ ఉద్యోగులకు మరింత సంతోషకరంగా ఉంటుంది. విద్యార్థుల అంచనాలు నిజమవుతాయి. మహిళలకు ఆస్తి లాభ సూచనలు. విష్ణుసహస్రనామ పారాయణం చేయడం మంచిది.

వృషభ రాశి: ఆర్థిక లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. ఎంత శ్రమించిన ఫలితం దక్కదు. సన్నిహితులతో వివాదం. పట్టుదల, ధైర్యంతో ముందకు సాగుతారు. వ్యాపారాల్లో కొంతమేర లాభాలుంటాయి. ఉద్యోగులకు అనుకోని మార్పులు. రాజకీయ, కళారంగాలవారు నిదానంగా ఉండటం మంచిది. ఐటీ నిపుణులకు ఒత్తిడులు. విద్యార్థులు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. మహిళలకు మానసిక ప్రశాంతత. సుబ్రహ్మణ్యాష్టకం పఠించడం మంచిది.


మిథున రాశి: రాబడి నిరుత్సాహపరుస్తుంది. మిత్రులు శత్రువులుగా మారే అవకాశం. కొంత సొమ్ము చేతికందుతుంది. శ్రమ పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ వారికి చికాకులు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు మానసిక అశాంతి. పారిశ్రామిక, రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా. ఐటీ నిపుణులకు అవకాశాలు చేజారతాయి. విద్యార్థులకు ఆటుపోట్లు. మహిళలకు కుటుంబంలో ఒత్తిడులు. ఆదిత్య హృదయం పఠించడం మంచిది.

కర్కాటక రాశి: కొన్ని సమస్యలు మందకొడిగా సాగుతాయి. భవిష్యత్ పై కొత్త అంచనాలు. కుటుంబంలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యాపారాల్లో నూతన పెట్టుబడులు. ఉద్యోగులకు ఊహించని విధంగా ఇంక్రిమెంట్లు. రాజకీయ, కళారంగాల వారికి అరుదైన పురస్కారాలు. ఐటీ నిపుణులు ఉత్సాహంగా గడుపుతారు. విద్యార్థులకు సంతోషకరమైన సమాచారం. మహిళలకు మానశ్శాంతి  లభిస్తుంది. వేంకటేశ్వరస్వామి స్తోత్రాలు పఠించడం మంచిది.

సింహ రాశి: వివాదాలకు దూరంగా ఉండండి. ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. ప్రతి వ్యవహారంలోనూ ఆచితూచి వ్యవహరించాలి. ఒక సమాచారం ఊరట కలిగిస్తుంది. రియల్టర్లు, కాంట్రాక్టర్లకు నిరాశాజనకం. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు బదిలీలు, రాజకీయ, పారిశ్రామికవర్గాలకు ఒత్తిడులు. ఐటీ ఉద్యోగలకు గందరగోళం. విద్యార్థులకు అనుకూల సమయం. మహిళలకు నిరుత్సాహం. హయగ్రీవ స్తోత్రాలు పఠించడం మంచిది.


కన్యారాశి: ఆర్థిక విషయాలు ఆశాజకనం. వ్యూహాత్మకంగా పనులు పూర్తి చేస్తారు. అందరిలోనూ గుర్తింపు పొందుతారు. కొన్ని వివాదాలు మాత్రం వేధిస్తాయి. రియల్ ఎస్టేట్ వారికి సమస్యలు తీరతాయి. వ్యాపారాల్లో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు. పారిశ్రామిక, కళారంగాల వారికి నూతనోత్సాహం. ఐటీ నిపుణులకు నూతన అవకాశాలు. విద్యార్థులు కోరుకున్న ఫలితాలు సాధిస్తారు. విష్ణుసహస్రనామ పారాయణం చేయడం మంచిది.

తులారాశి: పనుల్లో ఆటంకాలు. వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది. రియల్టర్లు కొంత నిదానంగా వ్యవహరించాలి. వ్యాపార లావాదేవీలు మందగిస్తాయి. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు. దూరపు బంధువులను కలుసుకుంటారు. రాజకీయ, కళారంగాల వారికి మనశ్శాంతి లోపిస్తుంది. ఐటీ ఉద్యోగులకు నిరాశాజనకం. విద్యార్థులకు అనుకున్న ఫలితాలు రావు. మహిళలకు అంచనాలు తప్పుతాయి. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించడం మంచిది.


వృశ్చిక రాశి: పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతి అవకాశఆలు. రాజకీయ, కళారంగాల వారికి సన్మానాలు. ఐటీ నిపుణులకు బాధ్యతలు పెరుగుతాయి. విద్యార్థులకు ఒక సమాచారం ఊరటనిస్తుంది. దూరపు బంధువులరాక సంతోషకం కలిగిస్తుంది. మహిళలకు మానసిక అశాంతి. సుబ్రహ్మణ్వేశ్వరుడిని పూజించడం మంచిది.


ధనస్సు రాశి: కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికాభివృద్ధి. పోటీపరీక్షల్లో అనుకూల ఫలితాలు సాధిస్తారు. రియల్ ఎస్టేట్ వారికి వివాదాల పరిష్కారం. వ్యాపారాల్లో నూతన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు ఉన్నతస్థాయి నుంచి ప్రశంసలు. రాజకీయ, కళారంగాల వారికి యోగదాయకం. ఐటీ నిపుణులకు ముఖ్య సమాచారం అందుతుంది. విద్యార్థులకు విదేశీ విద్యావకాశాలున్నాయి. మహిళలకు నూతనోత్సాహం. అంగారక స్తోత్రాలు పఠించడం మంచిది.

మకర రాశి:  పనులు నిదానంగా సాగుతాయి. కీలక నిర్ణయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. కాంట్రాక్టులు చేజారి నిరాశ చెందుతారు. బంధువులతో విబేధాలు తీరతాయి. ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. రియల్టర్లు, కాంట్రాక్టర్లకు భూముల విషయంలో చికాకులు. వ్యాపారాల్లో ఆటుపొట్లు తప్పవు. ఉద్యోగులకు ఒత్తిడులు పెరుగుతాయి. రాజకీయవేత్తలు. కళాకారులకు విదేశీ పర్యటనలు. ఐటీ నిపుణుల అంచనాలు నిజమవుతాయి. విద్యార్థుల పరిశోధనలు ముందుకెళ్లవు. మహిళలకు కుటుంబంలో సమస్యలు. కనకధార స్తోత్రాలు పఠించడం మంచిది.

కుంభరాశి: కొన్ని నిర్ణయాలు వాయిదా వేస్తారు. వ్యవహారాలు మందగిస్తాయి. ఉద్యోగయత్నాలు నెమ్మెదిగా సాగుతాయి. శత్రవులను ఆకట్టుకొని ముందుకెళుతారు. కొత్త వ్యాపారాల ఆలోచనలు కలిసిరావు. ఉద్యోగులకు ఊహించని మార్పులు. రాజకీయ,  కళారంగాల వారికి విమర్శలు తప్పవు. మహిళలకు సోదరులతో విబేధాలు. విద్యార్థుల యత్నాలు ముందుకు సాగవు. విష్ణుసహస్రనామ పారాయణం చేయడం మంచిది.

మీనరాశి: వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. మిత్రులతో వివాదాలు తీరతాయి. ఉద్యోగావకాశాలు కలిసివస్తాయి. ఒక ప్రకటన నిరుద్యోగులకు ఆకట్టుకుంటుంది. వ్యాపారాల్లో ఉత్సాహంగా గడుస్తుంది. ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. పారిశ్రామిక, కళారంగాల వారికి విదేశీ పర్యటనలు. ఐటీ నిపుణులు మరింత శ్రమించాలి. విద్యార్థుల అంచనాలు తప్పుతాయి. మహిళలకు మనశ్శాంతి లోపిస్తుంది. శ్రీరామ రక్షా స్తోత్రాలు పఠించడం మంచిది.



Tags:    
  • Daily Rashi Phalalu 
  • Daily Horoscope 
  • Horoscope 
  • Rashi Phalalu 
  • Telugu News 

Similar News

జీడీపీ పెరిగితేనే అభివృద్ధి చెందినట్టా? అసలైన ప్రగతి అంటే ఇదే!

2026-11-06 11:37 GMT

టీడీపీలో సివంగులు.. వ‌ద‌ల్లేదుగా.. !

2026-11-06 11:30 GMT

భార్య.. తర్వాత ఆమె కుటుంబం.. భర్త చేసిన సీరియల్ కిల్లింగ్ కలకలం

2026-11-06 10:49 GMT

ఫ్యూచర్ సిటీకి కొత్త జిల్లా హోదా? జైపాల్‌రెడ్డి పేరుతో దక్షిణ తెలంగాణలో మరో జిల్లా?

2026-11-06 10:45 GMT

'రాధా-రంగా' మిత్ర‌మండ‌లికి జోష్‌.. !

2026-11-06 10:30 GMT

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

'గ్రేట‌ర్‌' విశాఖ‌లో జ‌న‌సేన సునామీ... !

2026-11-06 09:24 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

జ‌నం ప‌ట్టుబడితే అంతే.. ఏపీలో పోలింగ్ బ‌హిష్క‌ర‌ణ‌!

2026-11-06 09:22 GMT

రూ. 40 కోట్లా? ఐపీఎల్ వేలానికి ముందే ఆటగాళ్ల డిమాండ్లు వైరల్

2026-11-06 07:49 GMT

బోస్టన్‌లో తెలుగు విద్యార్థిని అదృశ్యం.. 36 గంటలుగా జాడలేదు.. అసలేమైంది?

2026-11-06 06:33 GMT

వైఫై, ఎమోజీ, క్యూఆర్ కూడా ఇలా దైనందిత జీవితంలో ఉపయోగించే ఈ అద్భుత ఆవిష్కరణల వెనుక ఉన్న దేశాలేవో తెలుసా?

2026-11-06 06:30 GMT

Copyright @2026

Powered by Blink CMS