• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  జనవరి 25 శుక్రవారం 2019...

జనవరి 25 శుక్రవారం 2019 దినఫలాలు

By - Tupaki Desk
Update: 2019-01-25 01:30 GMT
గమనిక: ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి, గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు.

మేష రాశి: పలుకుబడి పెరుగుతుంది. ఆలోచనలు కలిసివస్తాయి. ప్రత్యర్థులపై పట్టు సాధిస్తారు. రాబడి ప్రోత్సాహకరంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ వారికి అనుకూలం. ఉద్యోగులు సమస్యల నుంచి బయటపడుతారు. వ్యాపారాలకు లాభాలు. పారిశ్రామిక, రాజకీయ రంగాల వారికి ప్రభుత్వం నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఐటీ నిపుణులకు నూతనోత్సాహం. విద్యార్థులకు అనుకున్న ఫలితాలు దక్కుతాయి. మహిళల అంచనాలు నిజమవుతాయి. హయగ్రీవ స్తోత్రాలు పఠించడం మంచిది.

వ‌ృషభ రాశి: ఆకస్మిక ప్రయాణాలు. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహం. ఒక సంఘటన ఆశ్చర్యం కలిగిస్తుంది. రియల్ ఎస్టేట్ వారికి ఇబ్బందులు. వ్యాపారులకు పెట్టుబడులు అందవు. ఉద్యోగాల్లో ఉన్నత స్థాయి నుంచి ఒత్తిడులు. కళాకారులు, పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు. ఐటీ నిపుణులకు నిరుత్సాహం. విద్యార్థులకు కొత్త సమస్యలు. మహిళలకు ఆస్తి తగాదాలు. గణేశ్ స్తోత్రాలు పఠించడం మంచిది.

మిథున రాశి: ఆలోచనలు నిలకడగా ఉండవు. కోపతాపాలకు దూరంగా ఉండండి. రియల్ ఎస్టేట్ వారికి ఆచితూచి వ్యవహరించాలి. వ్యాపారాలు లాభాలుండవు. దీర్ఘకాలిక సమస్యలు వేధిస్తాయి. పారిశ్రామిక, కళారంగాల వారు నిదానం పాటించాలి. ఐటీ నిపుణులకు తొందరపాటు నిర్ణయాలు తగదు. విద్యార్థులకు నిరుత్సాహం. ఉద్యోగులకు ఒత్తిడులు. మహిళలకు మానసిక ఆందోళన. ఆదిత్య హృదయం పఠించడం మంచిది.

కర్కాటక రాశి: ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరం. కొన్ని వివాదాల నుంచి బయటపడుతారు. వ్యాపారులు కొత్త పనులకు శ్రీకారం చుడుతారు. రియల్ ఎస్టేట్ వారికి కొత్త ఆశలు చిగురిస్తాయి. ఉద్యోగాల్లో ప్రమోషన్లు దక్కే అవకాశం ఉంది. పారిశ్రామిక, వ్యవసాయ రంగాల వారికి నూతనోత్సాహం. ఐటీ నిపుణులకు విదేశీ పర్యటనలు. విద్యార్థులకు సంతోషకరమైన సమాచారం. మహిళలకు ఆస్తి లాభసూచనలు. విష్ణుసహస్రనామ పారాయణం చేయడం మంచిది.

సింహ రాశి: రాబడికి మించి ఖర్చులు. ఆస్తి తగాదాలు చికాకు పరుస్తాయి. నిర్ణయాల్లో తొందరపాటు వద్దు. రియల్ ఎస్టేట్ వారికి అంచనాలు నిజమవుతాయి. వ్యాపారాలు అతి సామన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు చికాకులు. రాజకీయ, కళారంగాల వారికి వృథాప్రయసలు. ఐటీ ఉద్యోగుల యత్నాలు విఫలమవుతాయి. మహిళలకు కుటుంబంలో చికాకులు. గణేశాష్టకం పఠించడం మంచిది.

కన్యారాశి: పరిచయాలు పెరుగుతాయి. కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. నూతనోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగులకు పదోన్నతి సూచనలు. కళాకారులు, రాజకీయవర్గాలకు సన్మానాలు. ఐటీ ఉద్యోగులకు కొత్త ఆశలు. విద్యార్థులకు అనుకూల సమయం. మహిళలకు ఆస్తి లాభాలు కలుగుతాయి. రాఘవేంద్రస్వామిని పూజించడం మంచిది.

తులారాశి: రాబడి నిరుత్సాహపరుస్తుంది. వివాదాలకు దూరంగా ఉండండి. బంధువుల నుంచి ఒత్తిడులు. రియల్ ఎస్టేట్ వారికి చికాకులు. వ్యాపారాల్లో ఒడిదుడుకులు. ఉద్యోగులకు కోరుకున్న బదిలీలు. పారిశ్రామిక, కళారంగాల వారికి విదేశీ పర్యటనలు. ఐటీ నిపుణులకు విదేశీ పర్యటనలు వాయిదా. విద్యార్థుల కృషి ఫలించదు. మహిళలకు కుటుంబ సభ్యులతో తగాదాలు. కుజ గ్రహ స్తోత్రాలు పఠించడం మంచిది.

వృశ్చిక రాశి: రాబడి పెరిగి రుణ బాధలు తొలగుతాయి. రియల్ ఎస్టేట్ వారికి ప్రోత్సాహం. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాల్లో ప్రమోషన్లు దక్కుతాయి. పారిశ్రామిక, కళారంగాల వారికి ఉత్సాహంగా ఉంటుంది. ఐటీ నిపుణులకు అవార్డులు. విద్యార్థులకు అనుకూల పరిస్థితులు. ప్రయత్నాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. మహిళలకు కుటుంబంలో గౌరవం దక్కుతుంది. ఆదిహ్య హృదయం పఠించడం మంచిది.

 
ధనస్సు రాశి: ఆలోచనలు అమలు చేస్తారు. ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. వివాహా యత్నాలు అనుకూలిస్తాయి. ధనలాభం. రియల్ ఎస్టేట్ వారికి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగాల్లో చికాకులు తొలగుతాయి. రాజకీయ, కళారంగాల వారికి సన్మానాలు. ఐటీ ఉద్యోగులకు విశేష గౌరవం. విద్యార్థులకు ఫలితాలు సంతృప్తినిస్తాయి. మహిళలకు భూలాభాలు. గణేశ్ ను పూజించడం మంచిది.

మకర రాశి: వివాదాలకు దూరంగా ఉండండి. సన్నిహితుల సాయం కోరతారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. దూర ప్రయాణాలు ఉంటాయి. రియల్ ఎస్టేట్ వారికి సామాన్యంగా ఉంుటంది. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. ఉద్యోగులకు చికాకులు. పారిశ్రామిక, సాంకేతిక రంగాల వారికి ఒత్తిడులు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించడం మంచిది.

కుంభరాశి: ఆర్థిక పరిస్థితి నిరుత్సాహంగా ఉంటుంది. ఇంటాబయటా ఒత్తిడులు. ప్రత్యర్థుల నుంచి సమస్యలు ఎదుర్కొంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. భాగస్వామ్య వ్యాపారాలు మందకొడిగా ఉంటాయి. ఉద్యోగాల్లో మార్పులు, చేర్పులు. రాజకీయ, కళారంగాల వారికి విదేశీ పర్యటనల్లో ఆటంకాలు. ఐటీ నిపుణులకు చికాకులు. విద్యార్థులకు అవకాశాలు చేజారతాయి. మహిళలకు మానసిక ఆందోళన. హయగ్రీవ స్తోత్రాలు పఠించడం మంచిది.

మీనరాశి: రాబడి ఆశించిన విధంగా ఉంటుంది. వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. దైవదర్శనాలు చేసుకుంటారు. జీవితాశయం నెరవేరుతుంది. రియల్ ఎస్టేట్ వారికి ఆకస్మిక ధనలబ్ధి. వ్యాపారాలు విస్తరిస్తాయి. ఉద్యోగాల్లో పదోన్నతి. రాజకీయ, పారిశ్రామిక రంగాల వారికి పురస్కారాలు. ఐటీ నిపుణుల వివాదాలు తీరతాయి. విద్యార్థులకు శుభ సమాచారం. మహిళలకు భూలాభాలు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించడం మంచిది.
    
    
    

Tags:    
  • Daily Rashi Phalalu 
  • Daily Horoscope 
  • Horoscope 
  • Rashi Phalalu 
  • Telugu News 

Similar News

రేవంత్ బయటపెట్టిన ‘ది గ్రేట్ ఫైనాన్షియల్’ మార్వలస్ ఐడియా

2026-11-04 13:15 GMT

రేవంత్ గెలవడని కేటీఆర్ డిసైడ్.. ఆ భూములు కొనొద్దని పారిశ్రామికవేత్తలకు హెచ్చరిక

2026-11-04 13:10 GMT

పాపం ష‌ర్మిల‌.. ఇంత హ‌ర్ట్ అవుతార‌నుకోలేదా ..?

2026-11-04 13:01 GMT

మాజీ ఐపీఎస్‌.. ఓట‌మి స్ఫూర్తి.. !

2026-11-04 13:00 GMT

నాన్న‌గారి ఆశ‌యాలు నెర‌వేరుస్తా: రాధా ఫ‌స్ట్ స్పీచ్‌

2026-11-04 13:00 GMT

నియంతలు ట్రంప్, నెతన్యాహు ఔట్ అట.. ‘సీజేపీ‘ నేతలు హ్యాపీ.. టార్గెట్ మోడీయేనా?

2026-11-04 12:57 GMT

ఓటువేయలేదుగా.. నా డబ్బులు నాకివ్వండి.. వైసీపీ అభ్యర్థి 'రివర్స్ వసూళ్లు' వైరల్

2026-11-04 11:17 GMT

భారతీయులతో పెట్టుకున్నాడు.. ట్రంప్ అనుభవిస్తున్నాడు..

2026-11-04 10:57 GMT

టికెట్ ధ‌ర‌ల‌పై CM విజ‌య్ ముందు చూపు మనవాళ్ల‌కు ఏదీ?

2026-11-04 09:39 GMT

ఏపీలో మ‌రో ఎన్నిక‌ల పోరు..!

2026-11-04 09:22 GMT

రాప్తాడు నిందితుడిపై కాల్పుల కేసులో కీలక పరిణామం

2026-11-04 09:14 GMT

ఎలా గెలవాలో చెప్పారు...జగన్ కంగ్రాట్స్ !

2026-11-04 09:06 GMT

Copyright @2026

Powered by Blink CMS