• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  డిసెంబరు 4 శుక్రవారం 2019...

డిసెంబరు 4 శుక్రవారం 2019 దినఫలాలు

By - Tupaki Desk
Update: 2019-01-04 01:30 GMT
గమనిక: ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి - గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు.

మేష రాశి: ఆర్థిక పరిస్థితి మందకొడిగా ఉంటుంది. మీ నిర్ణయాలను కుటుంబంలో గౌరవిస్తారు. సన్నిహితులతో విబేధాలు నెలకొంటాయి. దేవాలయాల సందర్శన. కాంట్రాక్టర్లకు నిరుత్సాహం. వ్యాపారాలు అంతగా అనుకూలించవు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. పారిశ్రామికవేత్తలు - కళాకారులకు విదేశీ పర్యటనలు వాయిదా. ఐటీ నిపుణుల అంచనాలు తారామారవుతాయి. విద్యార్థులకు నిరాశాజనకం. మహిళలకు ఇంటాబయటా సమస్యలు. దత్తాత్రేయుడిని పూజించడం మంచిది.

వ‌ృషభ రాశి: ఆలోచనలు కలిసివస్తాయి. ఆర్థికాభివృద్ధి. గృహ - వాహన యోగాలు కలుగుతాయి. రియల్ ఎస్టేట్ వారికి ప్రోత్సాహం. కొత్త వ్యాపారాలు చేపడుతారు. అత్యాశ పనిరాదు. ఉద్యోగులకు ప్రమోషన్లు ఊరిస్తాయి. రాజకీయ, కళారంగాల వారికి సంతోషకరమైన వార్తలు. ఐటీ ఉద్యోగులకు కొత్త ఆశలు. విద్యార్థులకు ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. మహిళలకు శుభ వర్తమానం. శివ స్తోత్రాలు పఠించడం మంచిది.

మిథున రాశి: ఆస్తి వివాదాలు పరిష్కారమై లబ్ది పొందుతారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల సలహాలు స్వీకరిస్తారు. పనులు సమయానికి పూర్తవుతాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు నూతనోత్సాహం. కాంట్రాక్టర్లు - రియల్ ఎస్టేట్ రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. పారిశ్రామిక - రాజకీయరంగాల వారికి ప్రోత్సహాకరంగా ఉంటుంది. ఐటీ ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు సాంకేతిక అవకాశాలు లభిస్తాయి. మహిళలకు సంఘంలో గౌరవం దక్కుతుంది. వేంకటేశ్వరస్వామిని పూజించడం మంచిది.

కర్కాటక రాశి: ఇంటాబయటా సమస్యలు. సోదరులతో కలహాలు. పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. కాంట్రాక్టర్లకు చికాకులు. వ్యాపారులకు పెట్టుబడుల్లో నిరాశ. రాజకీయ - కళారంగాల వారికి అవకాశాలు తప్పిపోతాయి. ఉద్యోగులకు విధి నిర్వహణలో ఒత్తిడులు. ఐటీ నిపుణులకు ఆకస్మిక మార్పులు. విదేశీ పర్యటనలు వాయిదా. విద్యార్థులను నిరాశాజనకం. మహిళలకు కుటుంబ సమస్యలు. గణపతిని పూజించడం మంచిది.

సింహ రాశి: బంధువులతో తగాదాలు. శ్రమాధిక్యం తప్పదు. వాహనాల విషయంలో జాగ్రత్తలు పాటించండి. రియల్ ఎస్టేట్ వారికి చిక్కులు. వ్యాపారాల్లో ఒడిదుడుకులు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఉద్యోగులకు స్థానమార్పు - రాజకీయ - కళారంగాల వారికి పర్యటనలు వాయిదా పడుతాయి. ఐటీ ఉద్యోగులకు కొంత అసంతృప్తి. మహిళలకు కుటుంబ సమస్యలు. విష్ణుసహస్రనామ పారాయణం చేయడం మంచిది.

కన్యారాశి: ఆదాయం పెరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. కుటుంబంలో చికాకులు తొలగుతాయి. మిత్రులను కలుసుకొని సంతోషంగా గడుపుతారు. రియల్ ఎస్టేట్ వారికి సంతోషకరమైన సమాచారం.రాజకీయ, కళారంగాల వారికి సన్మానాలు. ఐటీ ఉద్యోగులకు నూతనోత్సాహం.  వ్యాపారాల్లో చిక్కులు అధిగమిస్తారు. ఉద్యోగులు ఉత్సాహంగా విధులు నిర్వహిస్తారు. విద్యార్థులకు అనుకున్న ఫలితాలు వస్తాయి. మహిళలకు ఆస్తి లాభం. గణపతిని పూజించడం మంచిది.
 
తులారాశి: ఇంటాబయటా ఒత్తిడులు. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహం. ప్రత్యర్థులతో కొత్త సమస్యలు ఎదురవుతాయి. రియల్ ఎస్టేట్ వారికి నిరాశ. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులు విధి నిర్వహాణలో అప్రమత్తంగా ఉండాలి. పారిశ్రామిక, కళారంగాల వారికి ఒత్తిడులు. ఐటీ ఉద్యోగుల అంచనాలు తప్పుతాయి. విద్యార్థులకు పరిశోధనలు సంతృప్తికరంగా సాగవు. మహిళలకు మానసిక ఆందోళన. ఆంజనేయస్వామిని పూజించడం మంచిది.

వృశ్చిక రాశి: ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. జీవిత భాగస్వామి నుంచి ఆస్తి లాభ సూచనలు. వ్యాపారులకు ఆశించిన లాభాలు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. పారిశ్రామిక, కళారంగాల వారికి విదేశీ పర్యటనలు ఉంటాయి. ఐటీ ఉద్యోగులకు ఉత్సాహంగా ఉంటుంది. విద్యార్థులకు అంతా సానుకూలమే. మహిళలకు శుభవార్తలు. విష్ణుసహస్రనామ పారాయణం చేయడం మంచిది.

ధనస్సు రాశి: బంధువుల నుంచి ఒత్తిడులు. వ్యాపారాల్లో ఒడిదుడుకులు. రియల్ ఎస్టేట్ వారికి గందరగోళ పరిస్థితి. రాజకీయ, కళారంగాల వారికి విదేశీ పర్యటనలు వాయిదా. ఉద్యోగులకు మానసిక అశాంతి. ఐటీ నిపుణులకు సామాన్యంగా ఉంటుంది. విద్యార్థులకు కొంత నిరాశాజనకం. పాత సంఘటనలు నెమరువేసుకుంటారు. మహిళలకు కుటుంబ సమస్యలు. నరసింహ స్తోత్రాలు పఠించడం మంచిది.

మకర రాశి: ఆర్థిక లావాదేవీలు ఉత్సాహాన్నిస్తాయి. సోదరుల సలహాలు స్వీకరిస్తారు. ప్రముఖులతో పరిచయాలు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాల్లో పురోగతి. ఉద్యోగులకు పదోన్నతులు. రాజకీయవేత్తలకు సన్మానాలు. కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ వారికి సమస్యలు. ఐటీ నిపుణుల శ్రమకు ఫలితం దక్కుతుంది. విద్యార్థులకు సాంకేతిక విద్యావకాశాలు లాభిస్తాయి. మహిళలకు కుటుంబంలో గౌరవం. శివుడికి అభిషేకం చేయడం మంచిది.

కుంభరాశి: సంఘంలో గౌరవమర్యాదాలు పెరుగుతాయి. నూతన ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. శత్రువులు మిత్రులుగా మారతారు. వ్యాపారాల్లో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు. ఐటీ నిపుణులకు శుభవార్తలు. విద్యార్థులకు సాంకేతిక - వైద్య విద్యావకాశాలు. మహిళలకు ఆస్తి లాభాలు. ఆదిత్య హృదయం పఠించడం మంచిది.

మీనరాశి: బంధుమిత్రుల నుంచి ఒత్తిడులు. పనుల్లో అవాంతరాలు ఎదురవుతాయి. బాల్యమిత్రులను కలుసుకుంటారు. రియల్ ఎస్టేట్ వారికి నిరుత్సాహం. ఆర్థిక లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాల్లో చికాకులు తప్పవు. రాజకీయ వేత్తలకు విదేశీ పర్యటనలు వాయిదా. ఐటీ నిపుణులకు ఇబ్బందులు కలుగవచ్చు. విద్యార్థులకు కొన్ని అవకాశాలు చేజారుతాయి. మహిళలకు మానసిక అశాంతి. హనుమాన్ చాలీసా పఠించడం మంచిది.


Full View

Tags:    
  • Daily Rashi Phalalu 
  • Daily Horoscope 
  • Horoscope 
  • Rashi Phalalu 
  • Telugu News 

Similar News

త‌నిష్క్ కేసు: 31 కోట్ల బంగారం చోరీ కేసులో యూట్యూబ‌ర్ అరెస్ట్!

2026-11-15 07:33 GMT

కోర్టు షాక్‌లు: మైన‌ర్ నేర‌స్తుల వ‌యోప‌రిమితి 18 నుంచి 16 ఏళ్ల‌కు త‌గ్గించాలి!

2026-11-15 07:32 GMT

రాప్తాడు కేసులో బిగ్ అప్డేట్: బాలిక ఆరోగ్యం 75% రికవరీ

2026-11-15 07:31 GMT

బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం : రేపు తుపాను, ఎల్లుండి తీవ్రతుపాను

2026-11-15 06:18 GMT

నో పైలెట్.. నో ఫ్యూయ‌ల్.. విద్యుత్‌తో న‌డిచే విమానాన్ని క‌నిపెట్టిన చైనా!

2026-11-15 06:18 GMT

మృత్యువు ఎంత దూరం !

2026-11-15 05:30 GMT

IPL బాస్‌కి మాఫియా బెదిరింపులు లేక‌పోయినా బ్రిటీష్ పౌర‌స‌త్వం దేనికి?

2026-11-15 05:29 GMT

ICE నియామకాల ప్రచారంపై విమర్శలు.. అమెరికాలో కొత్త వివాదం!

2026-11-15 05:28 GMT

చంద్రబాబు కాన్వాయ్ కోసం ఆరు కొత్త వాహనాలు.. ఖర్చు రూ.1.78 కోట్లు!

2026-11-15 04:29 GMT

జెన్సన్ హువాంగ్‌ను తిరిగి తీసుకోవాలంటూ పిటిషన్.. లక్ష దాటిన సంతకాలు!

2026-11-15 04:29 GMT

భారత్ - అమెరికా ట్రేడ్ డీల్‌పై జైశంకర్ కీలక వ్యాఖ్యలు.. ఇంకా అమెరికా దగ్గరే కొన్ని చిక్కులు!

2026-11-15 04:28 GMT

మంత్రులకు డేంజర్ బెల్స్ ?

2026-11-15 03:43 GMT

Copyright @2026

Powered by Blink CMS