• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  Andhra Pradesh >  రాప్తాడు కేసులో బిగ్...

రాప్తాడు కేసులో బిగ్ అప్డేట్: బాలిక ఆరోగ్యం 75% రికవరీ

| రాప్తాడులో దాడికి గురైన పదో తరగతి విద్యార్థిని వేగంగా కోలుకుంటోంది. బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలికకు ఇన్ఫెక్షన్, వాపులు తగ్గాయని, 75 శాతం కోలుకున్నట్లు వైద్యులు తెలిపారు. వెంటిలేటర్ సాయం లేకుండానే 99 శాతం ఆక్సిజన్ స్థాయిని కొనసాగిస్తోంది. మరోవైపు దాడి నిందితుడు పల్మనరీ ఎంబాలిజంతో కర్నూలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

By - Tupaki Desk
Update: 2026-11-15 07:31 GMT

రాప్తాడులో ఉన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన పదో తరగతి విద్యార్థిని వేగంగా కోలుకుంటోంది. చికిత్సకు బాలిక శరీరం బాగా సహకరిస్తోందని, రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి పెరగడంతోపాటు ఇన్ఫెక్షన్, వాపులు తగ్గినట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలిక ఆరోగ్య పరిస్థితిపై ప్రభుత్వం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. రక్తహీనత బాగా తగ్గిందని, గతంలో 174గా ఉన్న ఇన్ఫెక్షన్, వాపులు ప్రస్తుతం 46.38 పాయింట్లకు తగ్గినట్లు ప్రకటించింది. సాధారణ ఇన్ఫెక్షన్ కంటే ప్రస్తుతం కొంత ఎక్కువగా ఉన్నప్పటికీ 75 శాతం రికవరీ అయినట్లు వైద్యులు తెలిపారు.

దాడి కారణంగా బాలిక రక్తం తీవ్రంగా నష్టపోయింది. అత్యవసర వైద్యంతో రక్తం తిరిగి సాధారణ స్థితికి చేరుకుంది. అదేవిధంగా వెంటిలేటర్ సాయం లేకుండా 99 శాతం ఆక్సిజన్ స్థాయిని కొనసాగిస్తోంది. కుడి ఛాతీలో ద్రవం తగ్గుముఖం పట్టిందని చెబుతున్నారు. ప్రస్తుతం బాధితురాలి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యుల వెల్లడించారు. వైద్యుల సహాయంతో నెమ్మదిగా నడుస్తున్న బాధితురాలికి నొప్పి, ఆందోళన తగ్గించేందుకు మందులు ఇస్తున్నామని వైద్యులు తెలిపారు. క్రమం తప్పకుండా ఫిజియోథెరపీ చేయిస్తుండటం వల్ల భుజం కదుపుతున్నట్లు వైద్యులు వివరించారు.

మరోవైపు బాధితురాలి ప్రస్తుత దుస్థితికి కారణమైన నిందితుడు కర్నూలు సర్వజన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసు కాల్పుల కారణంగా కుడి కాలు నరాలను తూటాలు చిద్రం చేసిన విషయం తెలిసిందే. దీంతో నిందితుడు పల్మనరీ ఎంబాలిజం బారిన పడినట్లు వైద్యులు గుర్తించారు. ఈ సమస్యతో బాధపడేవారి రక్తం గడ్డ కడుతుందని, దీనివల్ల గుండెకు రక్తం సరఫరా నిలిచిపోయి ప్రాణాపాయం ఎదురయ్యే ప్రమాదం ఉందని చెబుతున్నారు. దీంతో నిందితుడిని మెరుగైన చికిత్స నిమిత్తం అనంతపురం నుంచి కర్నూలు ఆస్పత్రికి తరలించారు. అక్కడ అత్యవసర వైద్య విభాగంలో చికిత్స చేయిస్తున్నారు. ప్రస్తుతం అతడు ఆరోగ్యం మెరుగుపడిందని చెబుతున్నారు.

అయితే, ఆస్పత్రిలో కేవలం వైద్య సహాయం పొందుతున్న నిందితుడు అయినవారు ఎవరూ కనిపించకపోవడంతో మానసికంగా తీవ్ర క్షోభ అనుభవిస్తున్నాడని, దీనికారణంగా అతడు కోలుకునే అవకాశాలపై ఆందోళన వ్యక్తమవుతోందని వైద్యులు చెబుతున్నారు. మరోవైపు నిందితుడు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలతో బతికిన అంత కాలం దుర్భర జీవితమే అనుభవించాల్సివుంటుందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. అభం శుభం తెలియని బాలికపై పాశవికంగా దాడి చేసిన నిందితుడిని విధి క్షమించలేదని తాజా పరిస్థితులు రుజువు చేస్తున్నాయని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు.

Tags:    
  • rapthaduattack 
  • andhrapradesh 
  • studenthealthupdate 
  • rapthaducrime 

Similar News

చంద్రబాబు కాన్వాయ్ కోసం ఆరు కొత్త వాహనాలు.. ఖర్చు రూ.1.78 కోట్లు!

2026-11-15 04:29 GMT

మంత్రులకు డేంజర్ బెల్స్ ?

2026-11-15 03:43 GMT

గుండ ఫ్యామిలీతో ఢీ ... అనుకున్నంత ఈజీ కాదా ?

2026-11-15 03:43 GMT

వైఎస్సార్ కి మంచి ఫ్రెండ్... పదవులకు మాత్రం దూరం

2026-11-15 03:37 GMT

మైండ్ సెట్ మారాలి...జగన్ కి చెప్పానంటున్న బొత్స !

2026-11-15 03:36 GMT

వారికి జగన్ దర్శన భాగ్యం లేదా ?

2026-11-15 02:30 GMT

కూటమి వైసీపీల మధ్య రాజకీయ పంచాయతీ

2026-11-14 17:46 GMT

హీటెక్కిన సిక్కోలు పాలిటిక్స్‌.. జ‌డ్పీ చైర్మ‌న్ పోటాపోటీ ..!

2026-11-14 10:30 GMT

లోకేష్‌పై ఆ 'మ‌చ్చ‌లు' పోతున్నాయ్‌.. !

2026-11-14 09:30 GMT

రాజమండ్రి మరో అనంతపురం అవుతుందా? ఆసక్తికరంగా కార్పొరేషన్ పోరు

2026-11-14 08:30 GMT

చంద్ర‌బాబు సీరియ‌ల్ పారిశ్రామికవేత్త‌: లోకేష్ ఇంట్ర‌స్టింగ్ కామెంట్స్‌

2026-11-14 07:49 GMT

Copyright @2026

Powered by Blink CMS