• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  డిసెంబరు 26 బుధవారం 2018...

డిసెంబరు 26 బుధవారం 2018 దినఫలాలు

By - Tupaki Desk
Update: 2018-12-26 01:30 GMT
గమనిక: ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి - గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు.

మేష రాశి: ఉద్యోగులకు స్థాన మార్పు. కొన్ని నిర్ణయాల్లో పొరపాట్లు. బంధువర్గంతో విరోధాలు. వ్యవహారాల్లో ఆటంకాలు. కుటుంబ సభ్యులతో విబేధాలు. కాంట్రాక్టర్ల యత్నాలు ముందుకు సాగవు. వ్యాపార లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. రాజకీయ - కళారంగాల వారికి ఒత్తిడులు. ఐటీ నిపుణులకు సమస్యలు తప్పవు. విద్యార్థులకు అవకాశాలు చేజారతాయి. మహిళలకు ఆస్తి వివాదాలు. గణేశాష్టకం పఠించడం మంచిది.

వ‌ృషభ రాశి: ఆదాయం ఊహించనంతా పెరుగుతుంది. ఉద్యోగాలు పొందుతారు. ఉత్సాహంగా పనులు చేస్తారు. కాంట్రాక్టర్లకు చిక్కులు తొలగుతాయి. వ్యాపారాల్లో ఆటంకాలు అధిగమిస్తారు. ఉద్యోగులకు ఉత్సాహంగా ఉంటుంది. పారిశ్రామిక - కళారంగాల వారికి సన్మానాలు. ఐటీ నిపుణులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. విద్యార్థుల యత్నాలు సానుకూలం. మహిళలకు ఊహించని ఉద్యోగ అవకాశాలు వస్తాయి. లక్ష్మీ స్తుతి మంచిది.

మిథున రాశి: వివాదాలకు దూరంగా ఉండండి. బంధువుల నుంచి ఒత్తిడులు. ఆర్థిక పరిస్థితి నిరాశాజనకంగా ఉంటుంది. కొన్ని ప్రయత్నాలు నత్తనడకన సాగుతాయి. రియల్ ఎస్టేట్ వారికి కోర్టు వివాదాలు. వ్యాపారాల్లో ఆటుపోట్లు. ఉద్యోగులకు శ్రమాధిక్యం. అధిక పనిభారం. రాజకీయ, కళారంగాల వారికి పరీక్షా సమయం. ఐటీ నిపుణులకు విదేశీ పర్యటనలు వాయిదా. విద్యార్థులకు అవకాశాలు చేజారుతాయి. మహిళల అంచనాలు తప్పుతాయి. ఆదిత్య హృదయం పఠించడం మంచిది.

కర్కాటక రాశి: ఆస్తి వివాదాలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. భూ, గృహయోగ సూచనలు. వ్యాపారాల్లో ముందడుగు వేస్తారు. ఉద్యోగాల్లో ఒత్తిడులు తొలగుతాయి. రాజకీయ వేత్తలకు కొన్ని సమస్యలు ఎదురుకావచ్చు. ఐటీ నిపుణులకు ఒత్తిడులు. విద్యార్థుల యత్నాల్లో ఆటంకాలు. మహిళలకు కుటుంబ సభ్యులతో వైరం. శ్రీరామరక్షా స్తోత్రాలు పఠించడం మంచిది.

సింహ రాశి: నిరుద్యోగుల యత్నాలు ఫలించవు. బంధుమిత్రులతో విరోధాలు. కొత్త రుణయత్నాలు కొనసాగిస్తారు. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపారాల్లో ఒడిదుడుకులు. ఉద్యోగులు విధి నిర్వహణలో అప్రమత్తంగా మెలగాలి. రాజకీయ వేత్తలు, కళాకారులకు లేనిపోని సమస్యలు. ఐటీ నిపుణుల శ్రమకు ఫలితం దక్కదు. విద్యార్థుల అంచనాలు తప్పుతాయి. మహిళలకు కుటుంబంలో సమస్యలు. విష్ణుసహస్ర నామ పారాయణం పఠించడం మంచిది.

కన్యారాశి: రావాల్సిన బకాయిలు అందుతాయి. బంధువులతో సఖ్యత ఏర్పడుతుంది. పనుల్లో పురోగతి ఉంటుంది. శ్రమకు ఫలితం దక్కుతుంది. వాహనాలు, స్థలాలు కొంటారు. రియల్ ఎస్టేట్ వారికి మరింత సానుకూలం. వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా సాగుతాయి. ఉద్యోగవర్గాలకు పదోన్నతులు. రాజకీయ, కళారంగాల వారికి సన్మానాలు. ఐటీ నిపుణులు ఆహ్వానాలు అందుకుంటారు. విద్యార్థులకు పరిశోధనల్లో విజయం. మహిళలకు మానసిక ప్రశాంతత. గణేశాష్టకం పఠించడం మంచిది.

తులారాశి: ఆర్థిక పరిస్థితి ఆశాజనకం. పనులు అనుకున్నట్లు జరుగుతాయి. ఇంటిలో విందువినోదాలు. గృహ, వాహన యోగం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు కొన్ని చిక్కులు తొలగుతాయి. రాజకీయ, కళారంగాల వారికి శుభవార్తలు. ఐటీ నిపుణులకు నూతన అవకాశాలు దక్కుతాయి. విద్యార్థులకు శుభవార్తలు. మహిళలకు భూలాభాలు. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించడం మంచిది.

వృశ్చిక రాశి: ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. బంధువులతో వివాదాలు నెలకొంటాయి. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు పైఅధికారుల నుంచి ఒత్తిడులు. పారిశ్రామిక, కళారంగాల వారికి విదేశీ పర్యటనలు వాయిదా. ఐటీ నిపుణులకు మార్పులు. విద్యార్థులకు నిరాశాజనకం. మహిళలకు మానశ్శాంతి లోపిస్తుంది. లక్ష్మీ గణపతి స్తోత్రాలు పఠించడం మంచిది.

ధనస్సు రాశి: ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. శ్రమాధిక్యంతో వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదురవుతాయి. ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. కాంట్రాక్టులు కొద్దిలో తప్పిపోతాయి. వ్యాపారాల్లో తొందపాటు వద్దు. ఉద్యోగులకు బదిలీ అవకాశాలు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు గందరగోళంగా ఉంటుంది. ఐటీ నిపుణులకు నిర్ణయాల్లో ఆటంకాలు. విద్యార్థులు మరింత కష్టపడాలి. మహిళలకు ఆస్తి వివాదాలు. అష్టలక్ష్మీ స్తోత్రాలు పఠించడం మంచిది.

మకర రాశి: ఆలోచనలు అమలు చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ లాభం. ఉత్సాహంగా గడుపుతారు. ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. రియల్ ఎస్టేట్ వారికి అనుకోని లాభాలు వస్తాయి. వ్యాపారాల్లో ఒడిదుడుకులు తొలగుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు దక్కుతాయి. రాజకీయవర్గాల వారికి అనుహ్యమైన పదవులు లభిస్తాయి. ఐటీ నిపుణులు అనుకున్నది సాధిస్తారు. విద్యార్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి. మహిళలకు శుభ సమాచారం. రాఘవేంద్రస్వామి స్తోత్రాలు పఠించడం మంచిది.

కుంభరాశి: జీవిత భాగస్వామి సలహాలు పాటిస్తారు. ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు. స్థిరాస్థి వివాదాలు తొలగుతాయి. నిరుద్యోగులకు అనుకోని అవకాశాలు. రియల్ ఎస్టేట్ వారికి అనుకూల పరిస్థితులు. వ్యాపార విస్తరణకు సరైన సమయం. ఉద్యోగులు ఉల్లాసంగా గడుపుతారు. బకాయిలు అందుతాయి. పారిశ్రామిక వేత్తలకు ఉత్సాహంగా ఉంటుంది. ఐటీ నిపుణుల యత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు విదేశీ విద్యావకాశాలు దక్కించుకుంటారు. మహిళలకు సోదరుల నుంచి పిలుపు. ఆంజనేయ దండకం పఠించడం మంచిది.

మీనరాశి: ఆర్థిక వ్యవహారాలు మందకొడిగా ఉంటాయి. శ్రమతో పనులు పూర్తి చేస్తారు. కాంట్రాక్టుల్లో నిరుత్సాహం. వ్యాపార లావాదేవీలు కొంత నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు అదనపు భారం. రాజకీయ వేత్తలు, కళాకారులకు చిక్కులు. ఐటీ నిపుణులకు పరిస్థితులు అనుకూలించవు. మహిళలకు ఆస్తి వివాదాలు. శివాష్టకం పఠించడం మంచిది.
   

Tags:    
  • Daily Rashi Phalalu 
  • Daily Horoscope 
  • Horoscope 
  • Rashi Phalalu 
  • Telugu News 

Similar News

తనకంటే శక్తిమంతమైన మరో ఏఐని సృష్టించే స్థాయికి ఏఐ.. ఆందోళనలో టెక్ కంపెనీలు?

2026-11-06 15:30 GMT

టాప్ స్టోరి: యంగ్ అథ్లెట్లు త‌స్మాత్ జాగ్ర‌త్త‌.. కెరీర్‌ను నాశనం చేసే 4 పొరపాట్లు!

2026-11-06 14:30 GMT

టీటీడీకి లేట‌య్యే కొద్దీ.. 'కాంపిటీష‌న్' పెరుగుతోందిగా..!

2026-11-06 12:30 GMT

జీడీపీ పెరిగితేనే అభివృద్ధి చెందినట్టా? అసలైన ప్రగతి అంటే ఇదే!

2026-11-06 11:37 GMT

టీడీపీలో సివంగులు.. వ‌ద‌ల్లేదుగా.. !

2026-11-06 11:30 GMT

భార్య.. తర్వాత ఆమె కుటుంబం.. భర్త చేసిన సీరియల్ కిల్లింగ్ కలకలం

2026-11-06 10:49 GMT

ఫ్యూచర్ సిటీకి కొత్త జిల్లా హోదా? జైపాల్‌రెడ్డి పేరుతో దక్షిణ తెలంగాణలో మరో జిల్లా?

2026-11-06 10:45 GMT

'రాధా-రంగా' మిత్ర‌మండ‌లికి జోష్‌.. !

2026-11-06 10:30 GMT

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

'గ్రేట‌ర్‌' విశాఖ‌లో జ‌న‌సేన సునామీ... !

2026-11-06 09:24 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

జ‌నం ప‌ట్టుబడితే అంతే.. ఏపీలో పోలింగ్ బ‌హిష్క‌ర‌ణ‌!

2026-11-06 09:22 GMT

Copyright @2026

Powered by Blink CMS