• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  డిసెంబరు 23 ఆదివారం 2018...

డిసెంబరు 23 ఆదివారం 2018 దినఫలాలు

By - Tupaki Desk
Update: 2018-12-23 01:30 GMT
గమనిక: ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి - గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు.

మేష రాశి: సంఘంలో గౌరవానికి లోటు ఉండదు. వ్యవహారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. సన్నిహితులు మరింత దగ్గరవుతారు. వాహనాలు - ఆభరణాలు కొంటారు. రియల్ ఎస్టేట్ వారికి ఉత్సాహకరంగా ఉంటుంది. వ్యాపారాల్లో లాభాలు తథ్యం. ఉద్యోగులకు పదోన్నతులు. కళాకారులకు యోగదాయకం. ఐటీ నిపుణులకు అవకాశాలు పెరుగుతాయి. విద్యార్థులకు ఫలితాలు ఊరిస్తాయి. మహిళలకు మనశ్శాంతి లోపిస్తుంది. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించడం మంచిది.

వ‌ృషభ రాశి: ఆలోచనలు స్థిరంగా ఉండవు. రుణయత్నాలు చేస్తారు. భార్యాభర్తల మధ్య కలహాలు. కుటుంబ సమస్యలు వేధిస్తాయి. రియల్ ఎస్టేట్ వారికి నిరుత్సాహం. వ్యాపారాల్లో చికాకులు. ఉద్యోగులకు స్థానచలనం. పారిశ్రామికవేత్తలకు గందరగోళంగా ఉంటుంది. ఐటీ నిపుణులకు నిరాశ. విద్యార్థుల యత్నాలు ఫలించవు. మహిళలకు కొన్ని సమస్యలు ఎదురుకావచ్చు. నృసింహ స్తోత్రాలు పఠించడం మంచిది.

మిథున రాశి: ప్రముఖులతో పరిచయాలు. కార్యజయం. వాహనయోగం. కాంట్రాక్టర్లకు అనుకూలం. ఉద్యోగులకు ఉన్నత హోదాలు. కళాకారులకు సన్మానాలు. ఐటీ నిపుణులకు మరింత సానుకూలం. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు సాధిస్తారు. మహిళలకు ప్రోత్సాహం. వ్యాపారాల్లో పురోగతి. అంగారక స్తోత్రాలు పఠించడం మంచిది.

కర్కాటక రాశి: ఆర్థిక వ్యవహరాలు నిరాశ కలిగిస్తాయి. బంధువర్గంతో అనుకోని తగాదాలు. ముఖ్యమైన కార్యక్రమాలు మధ్యలో విరమిస్తారు. రియల్టర్లు, కాంట్రాక్టర్లకు నిరుత్సాహం. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. పారిశ్రామిక వేత్తలకు ఒత్తిడులు. ఉద్యోగులకు మానసిక ఆందోళన. ఐటీ నిపుణులకు అవకాశాలు చేజారుతాయి. విద్యార్థుల శ్రమకు ఫలితం ఉండదు. మహిళలకు మానసిక ఆందోళన. లక్ష్మీ స్తోత్రాలు పఠించండి మంచిది.

సింహ రాశి: దూరమైన ఆఫ్తులు తిరిగి దగ్గరవుతారు. కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. రియల్ ఎస్టేట్ ల వారికి సమస్యలు తీరతాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాలు అందుతాయి. పారిశ్రామిక వేత్తలు. కళాకారులకు కార్యసిద్ధి. ఐటీ నిపుణులు సత్తా చాటుతారు. విద్యార్థులకు విజయాలు దక్కుతాయి. మహిళలకు ఆస్తి లాభం. రాఘవేంద్ర స్తోత్రాలు పఠించడం మంచిది.

కన్యారాశి: నూతనోత్సాహంతో పనులు చక్కదిద్దుతారు. సన్నిహితులు, మిత్రుల చేయూత లభిస్తుంది. వాహనాలు, ఆభరణాలు కొంటారు. రియల్ ఎస్టేట్ వారికి సమస్యలు నుంచి విముక్తి. వ్యాపారాల్లో నూతన పెట్టుబడులు. ఉద్యోగులకు హోదాలు లభిస్తాయి. పారిశ్రామికవేత్తలకు శుభవార్తలు. ఐటీ నిపుణులకు ఆశలు ఫలిస్తారు. విద్యార్థులు అనుకున్న ప్రగతి సాధిస్తారు. మహిళలకు ఉల్లాసంగా ఉంటుంది. అంగారక స్తోత్రాలు పఠించడం మంచిది.

తులారాశి: బంధువులతో వివాదాలు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. భార్యాభర్తల మధ్య వివాదాలు. ఇంటాబయటా సమస్యలు పెరుగుతాయి. కాంట్రాక్టర్లు నిరాశ చెందుతారు. వ్యాపారాల్లో ఒడిదుడుకులు. ఉద్యోగులకు పదోన్నతులు తప్పిపోతాయి. పారిశ్రామిక వేత్తలకు ఒత్తిడులు. ఐటీ నిపుణులకు పరిస్థితులు అనుకూలించవు. విద్యార్థుల యత్నాల్లో ఆటంకాలు. మహిళలకుు మనశ్శాంతి లోపిస్తుంది. దుర్గాదేవీకి కుంకుమార్చన చేయడం మంచిది.

వృశ్చిక రాశి: ఆదాయానికి మించి ఖర్చులు. ఇంటిలో చికాకులు. ఎంత కష్టించినా ఫలితం ఉండదు. రియల్టర్ల యత్నాల్లో ఆటంకాలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు స్థానమార్పు ఉండవచ్చు. రాజకీయవేత్తలకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఐటీ నిపుణులు అనుకున్నది సాధించడంలో విఫలమవుతారు. విద్యార్థులకు నిరాశజనకం. మహిళల అంచనాలు తప్పుతాయి. బుధగ్రహ స్తోత్రాలు పఠించడం మంచిది.

ధనస్సు రాశి: ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. ఆప్తులతో ఆనందంగా గడుపుతారు. గృహం, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు విస్తరిస్తాయి. రియల్ ఎస్టేట్ వారికి చికాకులు. ఉద్యోగులకు పదోన్నతులు. పారిశ్రామిక వేత్తలు. రియల్టర్లకు ఊహించని పిలుపు రావచ్చు. ఐటీ నిపుణుల అంచనాలు నిజమవుతాయి. విద్యార్థులకు ప్రోత్సాహకరం. మహిళలకు ఆస్తి లాభ సూచనలు. శ్రీరామరక్షా స్తోత్రాలు పఠించడం మంచిది.

మకర రాశి: బాకీలు వసూలై అవసరాలు తీరతాయి. ప్రత్యర్థులు  అనుకూలంగా మారి సహాయపడుతారు. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు దక్కుతాయి. ఆస్తి వ్యవహరాల్లో ఒప్పందాలు చేసుకుంటారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. రాజకీయ వర్గాలకు పదవులు దక్కే సూచనలు. ఐటీ నిపుణులు సంతోషకంగా గడుపుతారు. విద్యార్థులకు అనుకూల సమయం. మహిళలకు బంధువుల నుంచి పిలుపు. అష్టలక్ష్మీ స్తోత్రాలు పఠించడం మంచిది.

కుంభరాశి: వివాదాలు దూరంగా ఉండండి.ఇంటాబయటా సమస్యలు వేధిస్తాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు.  రియల్ ఎస్టేట్ వారి అంచనాల్లో పొరపాటు. వ్యాపారాల్లో ఒడిదుడుకులు. ఉద్యోగులకు స్థాన మార్పు. పారిశ్రామిక వేత్తలకు కొన్నిఇబ్బందులు ఎదురవుతాయి. ఐటీ నిపుణులకు అవకాశాలు అనుకూలించవు. విద్యార్థులకు గందరగోళ పరిస్థితి. మహిళలకు మానసిక ఆందోళన. ఆంజనేయ దండకం పఠించడం మంచిది.

మీనరాశి: భూవివాదాలు నెలకొంటాయి. ఆదాయంలేక ఇబ్బందులు పడుతారు. దూర ప్రయాణాలు చేస్తారు. ఆలయాలు సందరిస్తారు. రియల్ ఎస్టేట్ వారికి చిక్కులు. ఉద్యోగులకు ఒత్తిడులు. కళాకారుల యత్నాలు ముందుకు సాగవు. ఐటీ నిపుణులకు నిరాశ. విద్యార్థులకు ఆశించిన ఫలితాలుండవు. మహిళలకు కుటుంబ సమస్యలు. కనకధారా స్తోత్రాలు పఠించడం మంచిది. 
   

Tags:    
  • Daily Rashi Phalalu 
  • Daily Horoscope 
  • Horoscope 
  • Rashi Phalalu 
  • Telugu NEws 

Similar News

తనకంటే శక్తిమంతమైన మరో ఏఐని సృష్టించే స్థాయికి ఏఐ.. ఆందోళనలో టెక్ కంపెనీలు?

2026-11-06 15:30 GMT

టాప్ స్టోరి: యంగ్ అథ్లెట్లు త‌స్మాత్ జాగ్ర‌త్త‌.. కెరీర్‌ను నాశనం చేసే 4 పొరపాట్లు!

2026-11-06 14:30 GMT

టీటీడీకి లేట‌య్యే కొద్దీ.. 'కాంపిటీష‌న్' పెరుగుతోందిగా..!

2026-11-06 12:30 GMT

జీడీపీ పెరిగితేనే అభివృద్ధి చెందినట్టా? అసలైన ప్రగతి అంటే ఇదే!

2026-11-06 11:37 GMT

టీడీపీలో సివంగులు.. వ‌ద‌ల్లేదుగా.. !

2026-11-06 11:30 GMT

భార్య.. తర్వాత ఆమె కుటుంబం.. భర్త చేసిన సీరియల్ కిల్లింగ్ కలకలం

2026-11-06 10:49 GMT

ఫ్యూచర్ సిటీకి కొత్త జిల్లా హోదా? జైపాల్‌రెడ్డి పేరుతో దక్షిణ తెలంగాణలో మరో జిల్లా?

2026-11-06 10:45 GMT

'రాధా-రంగా' మిత్ర‌మండ‌లికి జోష్‌.. !

2026-11-06 10:30 GMT

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

'గ్రేట‌ర్‌' విశాఖ‌లో జ‌న‌సేన సునామీ... !

2026-11-06 09:24 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

జ‌నం ప‌ట్టుబడితే అంతే.. ఏపీలో పోలింగ్ బ‌హిష్క‌ర‌ణ‌!

2026-11-06 09:22 GMT

Copyright @2026

Powered by Blink CMS