• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  డిసెంబరు 19 బుధవారం 2018...

డిసెంబరు 19 బుధవారం 2018 దినఫలాలు

By - Tupaki Desk
Update: 2018-12-19 01:30 GMT
గమనిక: ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి - గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు.

మేష రాశి: పనుల్లో పురోగతి ఉంటుంది. కొత్త కాంట్రాక్టులు పొందుతారు. వ్యాపారులకు అధిక లాభాలు. ఉద్యోగులక పదోన్నతులు. రాజకీయ - కళారంగాల వారికి యత్న కార్యసిద్ధి. ఐటీ నిపుణులకు అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. విద్యార్థులకు కొత్త కోర్సుల్లో అవకాశాలు. మహిళలకు శుభవార్తలు. కనకదుర్గాదేవీని పూజించడం మంచిది.

వ‌ృషభ రాశి: ఇంటాబయటా విమర్శలు ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యులతో వివాదాలు. నిర్ణయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. మిత్రులను కలుసుకొని సహాయం కొరతారు. ఆదాయం కొంత నిరాశ కలిగిస్తుంది. రియట్ ఎస్టేట్ వారికి సామాన్య స్థితి. వ్యాపార లావాదేవీలు మందగిస్తాయి. ఉద్యోగులకు అనుకోని మార్పులు ఉండొచ్చు. రాజకీయ, పారిశ్రామిక వేత్తలకు చికాకులు పెరుగుతాయి. ఐటీ నిపుణులు ఫలితం కోసం శ్రమించాలి. విద్యార్థులను నిరాశాజనకం. మహిళలకు కుటుంబంలో సమస్యలు. విష్ణుసహస్ర నామ పారాయణం చేయడం మంచిది.

మిథున రాశి: ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో విబేధాలు తొలగుతాయి. రియల్ ఎస్టేట్ వారికి ఆస్తి లాభం. వ్యాపారాల్లో ముందడుగు వేస్తారు. ఉద్యోగులక పనిభారం తగ్గుతుంది. రాజకీయవేత్తలు, కళాకారులకు ఆహ్వానాలు అందుతాయి. ఐటీ నిపుణుల యత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు మంచి గుర్తింపు. హనుమాన్ చాలీసా పఠించడం మంచిది.

కర్కాటక రాశి: కుటుంబ సభ్యుల నుంచి పోత్సాహం. ఆర్థిక పరిస్థితి ఆశించిన రీతిలో ఉంటుంది. వివాదాలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. రియల్ ఎస్టేట్ వారి అంచనాలు నిజమవుతాయి. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. వ్యాపారులు లాభాలు. ఉద్యోగులకు ఉత్సాహంగా ఉంటుంది. రాజకీయ, కళారంగాల వారికి సన్మానాలు, సత్కారాలు. ఐటీ నిపుణులకు అవకాశాలు పెరుగుతాయి. విద్యార్థులకు నూతనోత్సాహం. మహిళలకు కుటుంబంలో ఆదరణ. కనకదుర్గాదేవీ స్తోత్రాలు పఠించడం మంచిది.

సింహ రాశి: ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. ఎంత శ్రమించినా ఫలితం ఉండదు. వ్యాపారులకు లాభాలు అంతగా ఉండవు. రియల్ ఎస్టేట్ వారి శ్రమ ఫలించదు. ఉద్యోగులకు ఒత్తిడులు. రాజకీయ వర్గాల వారికి పదవులు చేజారే అవకాశం. ఐటీ నిపుణులకు సమస్యలు తప్పవు. విద్యార్థులకు నిరాశాజకం. మహిళలకు కుటుంబంలో చికాకులు. హయగ్రీవ స్తోత్రాలు పఠించడం మంచిది.

కన్యారాశి: పనులు అర్ధాంతరంగా ముగిస్తారు. నిరుద్యోగులు నిరాశ చెందుతారు. తొందపాటు మాటల వల్ల ఆప్తులు దూరం అవుతారు. రియల్ ఎస్టేట్, కాంట్రాక్టర్లకు చికాకులు. వ్యాపారాల్లో నిదానం అవసరం. ఉద్యోగులకు మార్పులు జరిగే సూచనలు. రాజకీయ, కళారంగాల వారికి మానసిక అశాంతి. ఐటీ నిపుణుల సేవలకు సరైన గుర్తింపు లభించదు. విద్యార్థులకు ఒత్తిడులు. మహిళలకు మానశ్శాంతి లోపిస్తుంది. విష్ణుసహస్ర నామ పారాయణం చేయడం మంచిది.

తులారాశి: శత్రువులు మిత్రులుగా మారతారు. రావాల్సిన బకాయిలు చేతికందుతాయి. అందరిలోనూ విశేష గౌరవ మార్యదలు పొందుతారు. వాహన, కుటుంబ సౌఖ్యం. కాంట్రాక్టర్లకు మరింత లాభదాయకంగా ఉంటుంది. వ్యాపార విస్తరణకు యత్నాలు సాగిస్తారు. ఉద్యోగాల్లో ఆటుపోట్లు తొలగుతాయి. రాజకీయ, పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు ఉండవచ్చు. ఐటీ నిపుణులకు నిరాశ. విద్యార్థులకు గందరగోళంగా ఉంటుంది. మహిళలకు సోదరుల నుంచి సమస్యలు. రాఘవేంద్ర స్తోత్రాలు పఠించడం మంచిది.

వృశ్చిక రాశి: నేర్పుగా సమస్యల నుంచి బయటపడతారు. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ నిర్ణయాలు అందరి ప్రశంసలు పొందుతాయి. కాంట్రాక్టులు దక్కుతాయి. వ్యాపార వృద్ధి. నూతన పెట్టుబడులకు అవకాశం. ఉద్యోగాల్లో చికాకులు తొలగి ఊరట చెందుతారు. పారిశ్రామిక, రాజకీయ వర్గాలకు ఉత్సాహంగా ఉంటుంది. ఐటీ నిపుణుల యత్నాలు సానుకూలం. విద్యార్థులకు అవకాశాలు పెరుగుతాయి. మహిళలకు ఆస్తి లాభం. గణేశాష్టకం పఠించడం మంచిది.

ధనస్సు రాశి: పనులు నత్తనడకన సాగుతాయి. కుటుంబంలో చికాకులు. ఆర్థిక ఇబ్బందులు. ఉద్యోగులకు స్థాన మార్పు సూచనలు. వ్యాపార లావాదేవీలు సామాన్యంగా ఉంటాయి. రాజకీయ, కళారంగాల వారికి ఒత్తిడులు. ఐటీ నిపుణులకు అదనపు బాధ్యతలు. విద్యార్థులకు చిక్కులు. మహిళలకు కుటుంబ సభ్యులతో వైరం. లక్ష్మీ స్తోత్రాలు పఠించడం మంచిది.

మకర రాశి: సన్నిహితులతో అకారణ వైరం. వ్యవహారాలు మందగిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. కొన్ని విషయాల్లో అంచనాలు తప్పుతాయి. కాంట్రాక్టర్ల యత్నాలు సఫలం కావు. వ్యాపారులకు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగులకు శ్రమకు ఫలితం కనిపించదు. విద్యార్థుల అంచనాలు తప్పుతాయి. దుర్గామాతకు అర్చనలు చేయడం మంచిది.

కుంభరాశి: ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వివాహ యత్నాలు సానుకూలం. బంధువులతో ఆనందంగా గడుపుతారు. రియల్ ఎస్టేట్ వారికి శ్రమ ఫలిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగుల సేవలకు తగిన గుర్తింపు. పారిశ్రామిక, రాజకీయ వేత్తలకు అనుకోని ఆహ్వానాలు. ఐటీ నిపుణులకు మరింత గుర్తింపు దక్కుతుంది. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు దక్కుతాయి. మహిళలకు సోదరుల ద్వారా లాభం కలుగుతుంది. విష్ణు ధ్యానం చేయడం మంచిది.

మీనరాశి: ఉద్యోగులకు కొన్ని మార్పులు ఉండవచ్చు. కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడులు. ప్రయాణాలు వాయిదా. ఆరోగ్య పరమైన చికాకులు. బంధువులతో విరోధాలు. రియల్ ఎస్టేట్ వారికి సమస్యలు ఎదురుకావచ్చు. వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగులకు కొన్ని మార్పులు ఉండొచ్చు. రాజకీయ, కళారంగాల వారికి అవకాశాలు చేజారుతారు. ఐటీ నిపుణులకు కొత్త సమస్యలు. విద్యార్థులకు అవకాశాలు కొన్ని చేజారతారు. మహిళలకు కుటుంబంలో పనిభారం. శ్రీరామ స్తోత్రాలు పఠించడం మంచిది.
Tags:    
  • Daily Rashi Phalalu 
  • Daily Horoscope 
  • Horoscope 
  • Rashi Phalalu 
  • Telugu NEws 

Similar News

బోస్టన్‌లో తెలుగు విద్యార్థిని అదృశ్యం.. 36 గంటలుగా జాడలేదు.. అసలేమైంది?

2026-11-06 06:33 GMT

వైఫై, ఎమోజీ, క్యూఆర్ కూడా ఇలా దైనందిత జీవితంలో ఉపయోగించే ఈ అద్భుత ఆవిష్కరణల వెనుక ఉన్న దేశాలేవో తెలుసా?

2026-11-06 06:30 GMT

సోషల్ మీడియా స్వేచ్ఛకు కొత్త సవాల్..

2026-11-06 05:47 GMT

సాధారణ ఉప్పుతో గుండెకు ముప్పు.. పొటాషియం ఉప్పుతో లక్షల ప్రాణాలకు రక్షణ!

2026-11-06 05:02 GMT

కేరళ నుంచి అమెరికా వరకు.. లాస్ ఏంజెలెస్ తొలి భారతీయ సంతతి మేయర్‌గా నిత్యా రామన్!

2026-11-06 04:57 GMT

అమెరికాలో డెమోక్రాట్ల విజయం.. భారతీయులకు H-1B, OPT వీసాల విషయంలో ఊరట లభిస్తుందా?

2026-11-06 04:57 GMT

లైఫ్‌లో సెటిల్ అవ్వడమే కాదు.. నచ్చినట్లు బతకడమే ముఖ్యం! జెన్ జీ కొత్త ట్రెండ్ ఇదే!

2026-11-06 04:19 GMT

డెమోక్రాట్లు గెలిచారు కదా.. ట్రంప్ ను దించేయవచ్చా?

2026-11-06 03:56 GMT

పట్టు సాధించిన కొణతాల...బెర్త్ కన్ఫర్మ్ ?

2026-11-06 03:50 GMT

వంగవీటి పట్టాభిషేకానికి మెగాస్టార్...బాలయ్య ?

2026-11-06 03:50 GMT

కూటమి పద్మవ్యూహంలో వైసీపీ విలవిల !

2026-11-06 03:49 GMT

చంద్రబాబు మీద కేసులు.... సీబీఐకి అప్పగించాలి !

2026-11-06 03:47 GMT

Copyright @2026

Powered by Blink CMS