• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  డిసెంబరు 18 మంగళవారం 2018...

డిసెంబరు 18 మంగళవారం 2018 దినఫలాలు

By - Tupaki Desk
Update: 2018-12-18 01:30 GMT
గమనిక: ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి, గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు.

మేష రాశి: పరిస్థితులు అనుకూలిస్తాయి. పనుల్లో పురోగతి. రాబడి ఊహించిన విధంగా ఉంటుంది. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. రియల్ ఎస్టేట్ వారి సమస్యలు తీరతాయి. ఉద్యోగులకు శుభవార్తలు. వ్యాపారాలు అభివృద్ధి దిశగా సాగుతాయి. రాజకీయ, కళారంగాల వారికి సన్మానాలు. ఐటీ నిపుణులు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. విద్యార్థులకు నూతన విద్యావకాశాలు దక్కుతాయి. మహిళలకు మానసిక ప్రశాంతత చేకూరుతుంది. విష్ణు ధ్యానం చేయడం మంచిది.

వ‌ృషభ రాశి: ఆదాయానికి మించి ఖర్చులు. బంధువులతో వివాదాలు. వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. రియల్ ఎస్టేట్ వారికి చిక్కులు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు స్థానమార్పులు. పారిశ్రామిక, కళారంగాల వారికి మానసిక అశాంతి. ఐటీ నిపుణులు మరింత శ్రమించాలి. విద్యార్థులకు ఒత్తిడులు. మహిళలకు కుటుంబంలో సమస్యలు. కనకధారా స్తోత్రాలు పఠించడం మంచిది.

మిథున రాశి: అంచనాలు నిజమవుతాయి. సంఘంలో గౌరవానికి లోటు ఉండదు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. ప్రత్యర్థులు మిత్రులుగా మారి చేయూతనందిస్తారు. రియల్ ఎస్టేట్ వారి అంచనాలు నిజమవుతాయి. వ్యాపారాల్లో పురోగతి. ఉద్యోగులక పదోన్నతులు. పారిశ్రామిక, రాజకీయ రంగాల వారికి ఉత్సాహంగా ఉంటుంది. ఐటీ ఉద్యోగులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. మహిళలకు కుటుంబంలో అనుకూలత. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించడం మంచిది.

కర్కాటక రాశి: ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉత్సాహంగా పనులు చేపడతారు. పలుకుబడి పెరుగుతుంది. మీ అంచనాలు నిజమై ఊరట చెందుతారు. భూ, గృహప్రాప్తి, కాంట్రాక్టులు దక్కుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు. రాజకీయ, కళారంగాల వారికి సన్మానాలు. ఐటీ నిపుణులు మరిన్ని విజయాలు సాధిస్తారు. విద్యార్థులకు కొత్త ఆశలు. మహిళలకు ఆస్తి లాభం. హనుమాన్ చాలీసా పఠించడం మంచిది.

సింహ రాశి: బంధువర్గంతో విబేధాలు. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. రియల్టర్లు, కాంట్రాక్టర్లకు సమస్యలు పెరుగుతాయి. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులు విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి. పారిశ్రామిక, కళారంగాల వారికి ఒత్తిడులు అధికం. ఐటీ నిపుణులకు ఒక సమాచారం నిరుత్సాహపరుస్తుంది. విద్యార్థులకు గందరగోళంగా ఉంటుంది. మహిళలకు మానసిక ఆందోళన. నవగ్రహ స్తోత్రాలు పఠించడం మంచిది.

కన్యారాశి: బంధువుల నుంచి విమర్శలు. అపవాదులు. వాహనాలు. ఆభరణాలు జాగ్రత్త. కాంట్రాక్టుల కోసం శ్రమించాల్సి ఉంటుంది. వ్యాపారాలు పెట్టుబడుల్లో నిదానంగా వ్యవహరించాలి. ఉద్యోగులు మరింత శ్రమించాల్సి ఉంటుంది. పారిశ్రామిక, కళారంగాల వారికి ఆందోళనకర వాతావరణం నెలకొంటుంది. ఐటీ నిపుణుల యత్నాలు ముందుకు సాగవు. విద్యార్థులకు అవకాశాలు చేజారుతాయి. మహిళలకు కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు. విష్ణుసహస్ర నామ పారాయణం చేయడం మంచిది.

తులారాశి: సన్నిహితులు సహాయపడతారు. శుభవార్తలు వింటారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగయోగం. రాబడి ఆశించిన స్థాయిలో ఉంటుంది. రియల్టర్ల ఆశలు ఫలిస్తాయి. వ్యాపారులకు లాభాలు దక్కుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు దక్కే సూచనలు. రాజకీయ, కళారంగాల వారికి విదేశీయానం. ఐటీ నిపుణులకు కొత్త అవకాశాలు. విద్యార్థులకు అనుకూల ఫలితం దక్కుతుంది. మహిళలకు కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. గణేష్ స్తోత్రాలు పఠించడం మంచిది.

వృశ్చిక రాశి: ఆదాయం పెరుగుతుంది. ఆలోచనలు అమలు చేస్తారు. వాహనాలు, స్థలాలు కొంటారు. దూరపు బంధువుల నుంచి శుభసమాచారం. వ్యాపారాలు అభివృద్ధి దిశగా సాగుతాయి. ఉద్యోగాల్లో ఉన్నత స్థాయి ప్రశంసలు అందుకుంటారు. రాజకీయ, కళారంగాల వారికి సన్మానాలు. ఐటీ నిపుణులు విజయాలవైపు సాగుతారు. విద్యార్థులకు కొత్త అవకాశాలు దక్కుతాయి. మహిళల అంచనాలు నిజమవుతాయి. శివపంచాక్షరి పఠించడం మంచిది.

ధనస్సు రాశి: ఆదాయం తగ్గుతుంది. రుణ ఒత్తిడులు. బంధువులతో మాటపట్టింపు. వ్యయప్రయాసలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. రియల్ ఎస్టేట్ వారికి చిక్కులు. వ్యాపార లావాదేవీలు నిరాశాజనకంగా ఉంటాయి. ఉద్యోగులకు బదిలీ సూచనలు. రాజకీయ, కళారంగాల వారికి మానసిక ఆందోళన. ఐటీ నిపుణులు తొందరపాటు నిర్ణయాలతో ఇబ్బందిపడుతారు. విద్యార్థలకు ఫలితాలు నిరాశను కలిగిస్తాయి. మహిళలకు సోదరులతో కలహాలు. దుర్గా స్తోత్రాలు పఠించడం మంచిది.

మకర రాశి: కుటుంబ సభ్యులతో విరోధాలు. పనుల్లో అవాంతరాలు చికాకు పరుస్తాయి. ఇంటాబయటా సమస్యలు. ప్రత్యర్థుల నుంచి ఒత్తిడులు. భూసంబంధిత వివాదాలు. ఆదాయం నిరుత్సాహపరుస్తుంది. రియల్ ఎస్టేట్ వారి యత్నాలు ఫలించవు. వ్యాపారాల్లో ఒడిదుడుకులు. ఉద్యోగులకు సామన్యంగా ఉంటుంది. రాజకీయ వేత్తాలు, కళాకారులకు కొంత వ్యతిరేక తప్పదు. ఐటీ నిపుణుల యత్నాలు ముందుకు సాగవు. విద్యార్థులకు అవకాశాలు దూరం కాగలవు. మహిళలు మానసిక ఆందోళన చెందుతారు. గణేశ్ ను పూజించడం మంచిది.

కుంభరాశి:  పాతమిత్రుల నుంచి శుభవార్తలు. ప్రముఖులతో పరిచయాలు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త కాంట్రాక్టు పనులు చేపడతారు. వ్యాపారాల్లో ముందుకు సాగుతారు. ఉద్యోగులకు ప్రమోషన్లు లభించే అవకాశం. పారిశ్రామిక, కళారంగాల వారికి ఉత్సాహంగా గడుస్తుంది. ఐటీ నిపుణులకు అనుకూల సమయం. విద్యార్థులకు సాంకేతిక అవకాశాలు లభిస్తాయి. మహిళలకు శుభవార్తలు. అంగారక స్తోత్రాలు పఠించడం మంచిది.

మీనరాశి: రాబడి నిరాశ పరుస్తుంది. బంధువులు, మిత్రులతో తగాదాలు. పనులు మధ్యలో విరమిస్తారు. కాంట్రాక్టర్ల యత్నాలు మందగిస్తాయి. ఉద్యోగ మార్పులు సంభవం. వ్యాపారాల్ల లాభనష్టాలు సమానం. పారిశ్రామిక, రాజకీయ రంగాల వారికి నిదానంగా వ్యవహరించడం మంచిది. ఐటీ నిపుణులు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. విద్యార్థులకు ఒత్తిడులు. మహిళలకు మానసిక ఆందోళన. సుబ్రహ్మణ్వేశ్వరుడిని పూజించడం మంచిది.
Tags:    
  • Daily Rashi Phalalu 
  • Daily Horoscope 
  • Horoscope 
  • Rashi Phalalu 
  • Telugu NEws 

Similar News

బోస్టన్‌లో తెలుగు విద్యార్థిని అదృశ్యం.. 36 గంటలుగా జాడలేదు.. అసలేమైంది?

2026-11-06 06:33 GMT

వైఫై, ఎమోజీ, క్యూఆర్ కూడా ఇలా దైనందిత జీవితంలో ఉపయోగించే ఈ అద్భుత ఆవిష్కరణల వెనుక ఉన్న దేశాలేవో తెలుసా?

2026-11-06 06:30 GMT

సోషల్ మీడియా స్వేచ్ఛకు కొత్త సవాల్..

2026-11-06 05:47 GMT

సాధారణ ఉప్పుతో గుండెకు ముప్పు.. పొటాషియం ఉప్పుతో లక్షల ప్రాణాలకు రక్షణ!

2026-11-06 05:02 GMT

కేరళ నుంచి అమెరికా వరకు.. లాస్ ఏంజెలెస్ తొలి భారతీయ సంతతి మేయర్‌గా నిత్యా రామన్!

2026-11-06 04:57 GMT

అమెరికాలో డెమోక్రాట్ల విజయం.. భారతీయులకు H-1B, OPT వీసాల విషయంలో ఊరట లభిస్తుందా?

2026-11-06 04:57 GMT

లైఫ్‌లో సెటిల్ అవ్వడమే కాదు.. నచ్చినట్లు బతకడమే ముఖ్యం! జెన్ జీ కొత్త ట్రెండ్ ఇదే!

2026-11-06 04:19 GMT

డెమోక్రాట్లు గెలిచారు కదా.. ట్రంప్ ను దించేయవచ్చా?

2026-11-06 03:56 GMT

పట్టు సాధించిన కొణతాల...బెర్త్ కన్ఫర్మ్ ?

2026-11-06 03:50 GMT

వంగవీటి పట్టాభిషేకానికి మెగాస్టార్...బాలయ్య ?

2026-11-06 03:50 GMT

కూటమి పద్మవ్యూహంలో వైసీపీ విలవిల !

2026-11-06 03:49 GMT

చంద్రబాబు మీద కేసులు.... సీబీఐకి అప్పగించాలి !

2026-11-06 03:47 GMT

Copyright @2026

Powered by Blink CMS