• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  డిసెంబరు 15 శనివారం 2018...

డిసెంబరు 15 శనివారం 2018 దినఫలాలు

By - Tupaki Desk
Update: 2018-12-15 01:30 GMT
గమనిక: ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి - గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు..

మేష రాశి: ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. పనులు నత్తనడకన సాగుతాయి. కష్టానికి తగిన ఫలితం కనిపించదు. ఇంటాబయటా ఒత్తిడులు. విమర్శలు ఎదురవుతాయి. ఉద్యోగులకు మార్పులు ఉండవచ్చు. వ్యాపార విస్తరణలో అవరోధాలు. పారిశ్రామిక వర్గాలకు అసంతృప్తి. ఐటీ నిపుణులకు కొన్ని సమస్యలు, మార్పులు తప్పవు. విద్యార్థులకు ఒత్తిడులు. రియల్ ఎస్టేట్ వారికి కోర్టు కేసులు. నవగ్రహ స్తోత్రాలు పఠించడం మంచిది.

వ‌ృషభ రాశి:  సన్నిహితులు, శ్రేయోభిలాషుల సలహాలు స్వీకరిస్తారు. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. పనుల్లో ఆటంకాలు అధిగమించి విజయం సాధిస్తారు. నిరుద్యోగుల కల ఫలిస్తుంది. జీవితాశయం నెరవేరుతుంది. రియల్ ఎస్టేట్ వారికి కలిసివచ్చే కాలం. ఉద్యోగులకు కొత్త హోదాలు దక్కుతాయి. పారిశ్రామిక వేత్తలు కొత్త కంపెనీలను ఏర్పాటు చేస్తారు. వ్యాపారాలు విస్తరిస్తాయి. ఐటీ నిపుణనులకు నూతన అవకాశాలు. బాధ్యతలు సమర్థవంతంగా నెరవేరుస్తారు. విద్యార్థులు సాంకేతిక విద్యావకశాలు. మహిళలకు దూర ప్రాంతాల నుంచి శుభ సమాచారం. ఆదిత్య హృదయం పఠించడం మంచిది.

మిథున రాశి: ఒక సమాచారం నిరుద్యోగులు ఊరట కలిగిస్తుంది. ఆస్తి వివాదాలు తీరి లబ్ధిపొందుతారు. ప్రత్యర్థులు సైతం అనుకూలంగా మారతారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకొని ఉత్సాహంగా గడుపుతారు. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు. పారిశ్రామిక వర్గాలవారి అంచనాలు నిజమవుతాయి. విద్యార్థులకు పరిశోధనలపై ఆసక్తి కలుగుతుంది. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. మహిళలకు ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. నృసింహ స్తోత్రాలు పఠించడం మంచిది.

కర్కాటక రాశి: ఒక సమాచారం కొంత గందరగోళం కలిగిస్తుంది. దుబారా ఖర్చులు. వ్యవహారాల్లో ఆటంకాలు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. రియల్ ఎస్టేట్ వారి అంచనాలు నిజమవుతాయి. ఉద్యోగులకు స్థానచలనం. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనల్లో ఆటంకాలు. ఐటీ నిపుణులకు ఆహ్వానాలు అందుతాయి. విద్యార్థులు కోరుకున్న కోర్సులు లభించవు. మహిళలకు కుటుంబ సమస్యలు. విష్ణు సహస్రనామ పారాయణం పఠించడం మంచిది.
 
సింహ రాశి: రావాల్సిన బాకీలు అందుతాయి. కార్యజయం. ఇంటిలో శుభకార్యాల నిర్వహణ. సోదరులు, సోదరీలతో విబేధాలు తొలగుతాయి. చిరకాల ప్రత్యర్థులు అనుకూలంగా మారతారు. పరపతి పెరుగుతుంది. వాహనాలు, భూములు కొంటారు. ఆశయాలు నెరవెరుతాయి. వ్యాపారులకు అధిక లాభాలు. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. పారిశ్రామిక వేత్తలకు విదేశీ పర్యటనలు. రియల్టర్లు అనుకున్నది సాధిస్తారు. విద్యార్థులు పరిశోధనల్లో విజయం సాధిస్తారు. మహిళలకు ఆస్తి లాభం. లక్ష్మీ స్తోత్రాలు పఠించడం మంచిది.

కన్యారాశి: వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. రావాల్సిన బాకీలు అందుతాయి. పరపతి పెరుగుతుంది. సన్నిహితులు మరింత దగ్గరవుతారు. ఇంతకాలం పడిన కష్టం ఫలిస్తుంది. రియల్టర్లు, కాంట్రాక్టర్లకు ఆశించిన లాభాలు తథ్యం. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ ఆహ్వానాలు అందుతాయి. ఐటీ నిపుణుల యత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు అవకాశాలు లభిస్తాయి. శ్రేయోభిలాషుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. మహిళలకు భూ, గృహ యోగాలు. ఆదిత్య హృదయం పఠించడం మంచిది.

తులారాశి: ఆలోచనలు నిలకడగా ఉండవు. రియల్ ఎస్టేట్ వారికి నిరాశ. వాహనాల విషయంలో అప్రమత్తత పాటించండి. మీ ప్రతిపాదనలకు కుటుంబ సభ్యులు వ్యతిరేకత చూపుతారు. దూర ప్రయాణాలు ఉంటాయి. బంధువులతో విబేధాలు. ఆదాయం అంతగా కనిపించదు. వ్యాపారాల్లో నష్టం. ఉద్యోగులక ఆకస్మిక మార్పులు ఉంటాయి. ఐటీ నిపుణులకు అవకాశాలు చేజారుతాయి. పారిశ్రామిక, రాజకీయ వర్గాల వారికి శ్రమకు ఫలితం దక్కదు. విద్యార్థులకు నిరాశ. హనుమాన్ కు గంధ సింధూరం పూజ చేయడం మంచిది.

వృశ్చిక రాశి: ఆస్తి వివాదాలు నెలకొంటాయి. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కాంట్రాక్టులు తప్పిపోయి నిరాశ చెందుతారు. వ్యాపార లావాదేవీలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు మార్పు జరిగే అవకాశం. ఐటీ నిపుణుల అంచనాలు తప్పుతాయి. విద్యార్థులకు గందరగోళంగా ఉంటుంది. పారిశ్రామిక, పరిశోధన రంగాల వారికి నిరాశ ఎదురవుతుంది పనుల్లో ఆటంకాలు. మహిళలకు కుటుంబ సభ్యులతో వైరం. విష్ణుసహస్రనామ పారాయణం చేయడం మంచిది.

ధనస్సు రాశి: సంఘంలో విశేష గౌరవం. ప్రతిభాపాటవాలకు తగిన గుర్తింపు, ప్రోత్సాహం. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. వాహనాలు, స్థలాలు కొంటారు. మిత్రులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. రియల్టర్ల యత్నాలు సఫలం. భాగస్వామ్య వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. పారిశ్రామిక వేత్తలకు కొత్త సంస్థల ఏర్పాటుకు అనుకూలం. జీవితాశయం నెరవేరుతుంది. ఐటీ నిపుణులు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. ఆదిత్య హృదయం పఠించడం మంచిది.

మకర రాశి: ఆరోగ్యం మందగిస్తుంది. వాహనాల విషయంలో నిర్లక్ష్యం తగదు. కాంట్రాక్టులు చేజారుతాయి. బాధ్యతలు పెరుగుతాయి. పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు నిరాశాజనకం. ఉద్యోగులక స్థానచలనం. పారిశ్రామిక, సాంకేతిక వర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా. ఐటీ నిపుణులకు ఒక సమాచారం గందరగోళ పరుస్తుంది. కాంట్రాక్టర్లకు నిరాశ. విద్యార్థులకు నిరుత్సాహం. మహిళలకు మానసిక అశాంతి. విష్ణుసహస్రనామ పారాయణం పఠించడం మంచిది.

కుంభరాశి: సంఘంలో గౌరవం పెరుగుతుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. భవిష్యత్ పై ఆలోచనలు చిగురిస్తాయి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. రియల్ ఎస్టేట్ వారి అంచనాలు నిజమవుతాయి. ఉద్యోగులకు పదోన్నతి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. పారిశ్రామిక వర్గాలకు ఉత్సాహంగా ఉంటుంది. ఐటీ నిపుణులకు కొత్త ఆశలు. విద్యార్థులకు నూతన అవకాశాలు దక్కుతాయి. శివాలయంలో అభిషేకం చేయించుకుంటే మంచిది.

మీనరాశి: ఆలోచనలు స్థిరంగా ఉండవు. రావాల్సిన బకాయిలు సకాలంలో అందక ఇబ్బంది పడుతారు. సోదరులతో కలహాలు. ఉద్యోగులకు అదనపు పనిభారం. కాంట్రాక్టులు చేజారుతాయి. వ్యాపారాల విస్తరణలో అవరోధాలు. ఐటీ నిపుణుల యత్నాలు అనుకూలించవు. విద్యార్థులకు అవకాశాల ఎంపికలో తొందరపడొద్దు. పారిశ్రామిక, వైద్య రంగాలవారు వ్యవహారాల్లో ఆచితూచి పాటించాలి. మహిళలకు మానసిన అశాంతి.
   

Tags:    
  • Daily Rashi Phalalu 
  • Daily Horoscope 
  • Horoscope 
  • Rashi Phalalu 
  • Telugu NEws 

Similar News

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

జ‌నం ప‌ట్టుబడితే అంతే.. ఏపీలో పోలింగ్ బ‌హిష్క‌ర‌ణ‌!

2026-11-06 09:22 GMT

రూ. 40 కోట్లా? ఐపీఎల్ వేలానికి ముందే ఆటగాళ్ల డిమాండ్లు వైరల్

2026-11-06 07:49 GMT

బోస్టన్‌లో తెలుగు విద్యార్థిని అదృశ్యం.. 36 గంటలుగా జాడలేదు.. అసలేమైంది?

2026-11-06 06:33 GMT

వైఫై, ఎమోజీ, క్యూఆర్ కూడా ఇలా దైనందిత జీవితంలో ఉపయోగించే ఈ అద్భుత ఆవిష్కరణల వెనుక ఉన్న దేశాలేవో తెలుసా?

2026-11-06 06:30 GMT

సోషల్ మీడియా స్వేచ్ఛకు కొత్త సవాల్..

2026-11-06 05:47 GMT

సాధారణ ఉప్పుతో గుండెకు ముప్పు.. పొటాషియం ఉప్పుతో లక్షల ప్రాణాలకు రక్షణ!

2026-11-06 05:02 GMT

కేరళ నుంచి అమెరికా వరకు.. లాస్ ఏంజెలెస్ తొలి భారతీయ సంతతి మేయర్‌గా నిత్యా రామన్!

2026-11-06 04:57 GMT

అమెరికాలో డెమోక్రాట్ల విజయం.. భారతీయులకు H-1B, OPT వీసాల విషయంలో ఊరట లభిస్తుందా?

2026-11-06 04:57 GMT

లైఫ్‌లో సెటిల్ అవ్వడమే కాదు.. నచ్చినట్లు బతకడమే ముఖ్యం! జెన్ జీ కొత్త ట్రెండ్ ఇదే!

2026-11-06 04:19 GMT

డెమోక్రాట్లు గెలిచారు కదా.. ట్రంప్ ను దించేయవచ్చా?

2026-11-06 03:56 GMT

పట్టు సాధించిన కొణతాల...బెర్త్ కన్ఫర్మ్ ?

2026-11-06 03:50 GMT

Copyright @2026

Powered by Blink CMS