• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  డిసెంబరు 12 బుధవారం 2018...

డిసెంబరు 12 బుధవారం 2018 దినఫలాలు

By - Tupaki Desk
Update: 2018-12-12 01:30 GMT
గమనిక: ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి - గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు.

మేష రాశి: రాబడి పెరిగి అవసరాలు తీరతాయి. రియల్టర్లకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వ్యాపారాల విస్తరణ యత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. రాజకీయ వర్గాలకు సత్కారాలు. ఐటీ నిపుణులకు విజయాలు. విద్యార్థులకు సాంకేతిక విద్యలో ప్రవేశం. మహిళలకు ఉత్సాహంగా గడుస్తుంది. ఆదిత్య హృదయం పఠించడం మంచిది.

వ‌ృషభ రాశి: ఆలోచనలు కలిసిరావు. మిత్రులతో అకారణంగా విరోధాలు. రియల్టర్లకు భూవివాదాలు నెలకొనవచ్చు. వ్యాపార విస్తరణ యత్నాలు ముందుకు సాగవు. ఉద్యోగులకు ఒత్తిడులు ఉంటాయి. ఐటీ నిపుణులకు అంచనాల్లో పొరపాట్లు. విద్యార్థులకు ఒత్తిడులు అధికమవుతాయి. పారిశ్రామిక - కళాకారులకు వ్యవహారాలు ముందుకు సాగవు. మహిళలకు కొంత నిరాశ. సుబ్రహ్మణ్యాష్టకం పఠించడం మంచిది.

మిథున రాశి: బంధుగణంతో విరోధాలు. రియల్టర్లకు లేనిపోని చికాకులు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఆలోచనల స్థిరంగా ఉండవు. ఉద్యోగులకు మార్పులు సంభవం. రాజకీయ వేత్తలు - కళాకారులకు - ఐటీ నిపుణులకు గందరగోళంగా ఉంటుంది. విద్యార్థులు ఒత్తిడులు ఎదుర్కొంటారు. మహిళలకు కుటుంబంలో చికాకులు. వినాయకుడిని పూజించడం మంచిది.

కర్కాటక రాశి: ఆర్థిక విషయాల్లో ప్రగతి కనిపిస్తుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కొత్త విషయాలు గ్రహిస్తారు. బంధువులను కలుసుకొని ఉత్సాహంగా గడుపుతారు. రియల్టర్లు, కాంట్రాక్టర్లకు లాభసాటిగా ఉంటుంది. వ్యాపారాలు లాభాదాయకంగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు. సినీ - టీవీ కళాకారులకు అంచానాలు నిజమవుతాయి. విద్యార్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి. కోర్టు వ్యవహారాలు కొంత నిరాశ పరుస్తాయి. రాజకీయ - పారిశ్రామిక వర్గాలకు సన్మానాలు. మహిళలకు శుభసమాచారం అందుతుంది. హనుమాన్ చాలీసా పఠించడం మంచిది.

సింహ రాశి: ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఉద్యోగ యత్నాల్లో విజయం. మిత్రుల నుంచి శుభవార్తలు వింటారు. రియల్టర్లకు భాగస్వాములతో తగాదాలు తీరతాయి. వ్యాపారులు అందిన పెట్టుబడులతో ఉత్సాహంగా అడుగువేస్తారు. ఉద్యోగులకు పదోన్నతి. రాజకీయవేత్తలు. కళాకారులకు ప్రోత్సాకరంగా ఉంటుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. విద్యార్థులకు ఒక ప్రకటన ఆకట్టుకుంటుంది. మహిళలకు కుటుంబంలో ప్రోత్సాహం. దుర్గాదేవీ స్తోత్రాలు పఠించడం మంచిది.

కన్యారాశి: ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. దూర ప్రయాణాలు ఉంటాయి. వ్యాపారులకు సామాన్యంగా ఉంటుంది. రాజకీయ వేత్తలు, కళాకారుల విదేశీ పర్యటనలు వాయిదా. ఐటీ నిపుణులకు ఒత్తిడులు. విద్యార్థులకు నిరాశ. బంధువర్గంతో విబేధాలు ఏర్పడినా సర్దుబాబు చేసుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు. మహిళలకు కుటుంబ విషయంలో నిరుత్సాహం చెందుతారు. విష్ణుసహస్రనామ పారాయణం చేయడం మంచిది.

తులారాశి: నిర్ణయాల్లో తొందరపాటు వద్దు. కుటుంబంలో చికాకులు. ఆర్థిక వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. రియల్ ఎస్టేట్ వారి యత్నాలు ముందుకు సాగవు. ఉద్యోగులకు ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఐటీ నిపుణులకు శ్రమాధిక్యం. విద్యార్థులకు అవకాశాలు చేజారుతాయి. కుటుంబంలో చికాకులు. మహిళలకు ఆరోగ్య భంగం. అంగారక స్తోత్రం పఠించడం మంచిది.

వృశ్చిక రాశి: పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వివాహా, ఉద్యోగయత్నాలు కలిసి వస్తాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. బంధువుల నుంచి శుభవార్తలు. వ్యాపారాల్లో లాభాలు తథ్యం. ఉద్యోగవర్గాలకు పదోన్నతి సూచనలు. రాజకీయ రంగం వారికి ఆదరణ పెరుగుతుంది. ఐటీ నిపుణులు సహోద్యోగులతో ఉత్సాహంగా గడుపుతారు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. విద్యార్థులకు నూతన అవకాశాలు.  మహిళలకు నూతనోత్సాహం. ఆంజనేయ దండకం పఠించడం మంచిది.

ధనస్సు రాశి: ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆర్థిక లావాదేవీల్లో ఒడిదుడుకులు. కుటుంబంలో చికాకులు. రియల్టర్లు, కాంట్రాక్టర్లకు కొన్ని వివాదాలు. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగవర్గాలకు బాధ్యతలు మీదపడతాయి. ఐటీ నిపుణులకు సమస్యలు. పారిశ్రామిక, కళాకారులకు లేనిపోని సమస్యలు ఎదురుకావచ్చు. అప్రమత్తంగా ఉండండి. విద్యార్థులకు నిరాశాజనకం. మహిళలకు ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. విష్ణుసహస్ర నామ పారాయణం చేయడం మంచిది.

మకర రాశి: ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఆప్తుల నుంచి సలహాలు స్వీకరిస్తారు. సన్నిహితుల నుంచి శుభవార్తలు వింటారు. ఆకస్మిక ప్రయాణాలు సంభవం. విలువైన వస్తువులు, వాహనాలు కొంటారు. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వ్యాపార విస్తరణ యత్నాలు ముమ్మరం చేస్తారు. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు. రాజకీయ వర్గాల వారికి కలిసొచ్చే కాలం. ఐటీ నిపుణులు కార్యసాధన దిశగా సాగుతారు. విద్యార్థులకు సాంకేతిక అవకాశాలు దక్కుతాయి. మహిళలకు ఆనందంగా గడుపుతారు. శివాష్టకం పఠించడం మంచిది.

కుంభరాశి: ఇంటాబయటా ఒత్తిడులు. రాబడి తగ్గి నిరుత్సాహపడుతారు. బంధుమిత్రుల నుంచి అపవాదులు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు. పారిశ్రామిక, రాజకీయ వర్గాలకు బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. విద్యార్థులకు నిరాశ తప్పదు. ఐటీ నిపుణులకు శ్రమ తగిన ఫలితం దక్కదు. కొన్ని కాంట్రాక్టులు చేజారుతాయి. మహిళలకు ఆరోగ్యభంగం . దుర్గామాతకు కుంకుమార్చన చేయించడం మంచిది.

మీనరాశి: రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. సోదరీలతో ఉత్సాహంగా గడుపుతారు. ఉద్యోగ యత్నాలు సానుకూలం. ఆలయాలు సందర్శిస్తారు. రియల్లర్లకు విశేష లాభాదాయకం. భాగస్వామ్య వ్యాపారాల్లో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు. పారిశ్రామిక - రాజకీయ వర్గాలకు విదేశీయానం. ఐటీ నిపుణులకు పని ఒత్తిడులు తొలగుతాయి. విద్యార్థులకు అనుకూలమైన కాలం. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. మహిళల అంచనాలు నిజమవుతాయి. వేంకటేశ్వరస్వామికి అర్చన చేయడం మంచిది.

   

Tags:    
  • Daily Rashi Phalalu 
  • Daily Horoscope 
  • Horoscope 
  • Rashi Phalalu 
  • Telugu NEws 

Similar News

బోస్టన్‌లో తెలుగు విద్యార్థిని అదృశ్యం.. 36 గంటలుగా జాడలేదు.. అసలేమైంది?

2026-11-06 06:33 GMT

వైఫై, ఎమోజీ, క్యూఆర్ కూడా ఇలా దైనందిత జీవితంలో ఉపయోగించే ఈ అద్భుత ఆవిష్కరణల వెనుక ఉన్న దేశాలేవో తెలుసా?

2026-11-06 06:30 GMT

సోషల్ మీడియా స్వేచ్ఛకు కొత్త సవాల్..

2026-11-06 05:47 GMT

సాధారణ ఉప్పుతో గుండెకు ముప్పు.. పొటాషియం ఉప్పుతో లక్షల ప్రాణాలకు రక్షణ!

2026-11-06 05:02 GMT

కేరళ నుంచి అమెరికా వరకు.. లాస్ ఏంజెలెస్ తొలి భారతీయ సంతతి మేయర్‌గా నిత్యా రామన్!

2026-11-06 04:57 GMT

అమెరికాలో డెమోక్రాట్ల విజయం.. భారతీయులకు H-1B, OPT వీసాల విషయంలో ఊరట లభిస్తుందా?

2026-11-06 04:57 GMT

లైఫ్‌లో సెటిల్ అవ్వడమే కాదు.. నచ్చినట్లు బతకడమే ముఖ్యం! జెన్ జీ కొత్త ట్రెండ్ ఇదే!

2026-11-06 04:19 GMT

డెమోక్రాట్లు గెలిచారు కదా.. ట్రంప్ ను దించేయవచ్చా?

2026-11-06 03:56 GMT

పట్టు సాధించిన కొణతాల...బెర్త్ కన్ఫర్మ్ ?

2026-11-06 03:50 GMT

వంగవీటి పట్టాభిషేకానికి మెగాస్టార్...బాలయ్య ?

2026-11-06 03:50 GMT

కూటమి పద్మవ్యూహంలో వైసీపీ విలవిల !

2026-11-06 03:49 GMT

చంద్రబాబు మీద కేసులు.... సీబీఐకి అప్పగించాలి !

2026-11-06 03:47 GMT

Copyright @2026

Powered by Blink CMS