• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  డిసెంబరు 11 మంగళవారం 2018...

డిసెంబరు 11 మంగళవారం 2018 దినఫలాలు

By - Tupaki Desk
Update: 2018-12-11 02:23 GMT
గమనిక: ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి, గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు.

మేష రాశి: ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. ఉద్యోగాల్లో పదోన్నతులు. వ్యాపారాల్లో పెట్టుబడులు అందుతాయి. ఐటీ నిపుణులు ఉల్లాసంగా గడుపుతారు. పారిశ్రామిక, రాజకీయవర్గాలకు అనుకోని ఆహ్వానాలు. విద్యార్థులకు నూతనోత్సాహం. మహిళలకు సంతోషకరమైన వార్తలు. ఆదిత్య హృదయం పఠించడం మంచిది.

వ‌ృషభ రాశి: బంధువులతో విరోధాలు నెలకొంటాయి. ఉద్యోగులకు స్థానచలనం. వ్యాపారాలు అంతగా లాభించవు. రాజకీయ, వైద్య రంగాల వారికి ఒత్తిడులు. కుటుంబ సమస్యలు చికాకు పరుస్తాయి. ఐటీ నిపుణులు అనుకున్న లక్ష్యాలు చేజారుతాయి. విద్యార్థులు శ్రమించాలి. రియల్ ఎస్టేట్ వారు భూవివాదాల నుంచి బయటపడతారు. రుణ యత్నాలు ముమ్మరం చేస్తారు. మహిళలకు నిరుత్సాహం. శివ పంచాక్షరి పఠించడం మంచిది.

మిథున రాశి: ఆస్తి వివాదాలు చికాకు కలిగిస్తాయి. రాబడి తగ్గి అప్పులు చేస్తారు. రియల్ ఎస్టేట్ వారికి నిరాశజనకం. ఉద్యోగాల్లో మార్పులు ఉంటాయి. పారిశ్రామిక, రాజకీయ వర్గాలకు ఒత్తిడులు. ఐటీ నిపుణులకు మానసిక అశాంతి. విద్యార్థులు ప్రతిభ నిరూపించుకునేందుకు మరింత శ్రమించాలి. కుటుంబ, ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి. విద్యార్థులు ప్రతిభను చాటుకునేందుకు శ్రమించాలి. మహిళలకు మానసిక ఆందోళన. సత్యనారాయణస్వామిని పూజించడం మంచిది.

కర్కాటక రాశి: రావాల్సిన బాకీలు అందుతాయి. ప్రముఖులతో పరిచయాలు. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. రియల్ ఎస్టేట్ వారు వివాదాల నుంచి బయటపడతారు. వ్యాపారాల్లో అభివృద్ధి. ఉద్యోగులకు పదోన్నతి. ఐటీ నిపుణులకు ఉత్సాహంగా ఉంటుంది. విద్యార్థులకు సాంకేతిక విద్యావకాశాలు. మహిళలకు కుటుంబంలో ప్రోత్సాహం. గణపతికి అభిషేకం చేయించడం మంచిది.

సింహ రాశి: ఆప్తుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తారు. మిత్రులను కలుసుకొని సంతోషంగా గడుపుతారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. కొన్ని పాత సంఘటనలు గుర్తుకువస్తాయి.  ఐటీ నిపుణులకు విజయాలు చేకూరుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. పారిశ్రామిక, రాజకీయ వర్గాలకు పురస్కారాలు. విద్యార్థులు అనుకున్న కోర్సులు సాధిస్తారు. మహిళలకు విదేశీ పర్యటనలు. హయగ్రీవ స్తోత్రాలు పఠించడం మంచిది.

కన్యారాశి: ప్రయాణాలు వాయిదా పడతాయి. పనుల్లో కొంత జాప్యం జరిగినా ఎట్టకేలకు పూర్తి చేస్తారు. ప్రత్యర్థుల నుంచి ఒత్తిడులు ఎదురైనా పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు అంతగా లాభించవు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. పారిశ్రామిక, రాజకీయ వర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా. ఐటీ నిపుణులకు మందకొడిగా ఉంటుంది. విద్యార్థులకు అవకాశాలు చేజారుతాయి. మహిళలకు ఒడిదుడుకులు. షిర్డీసాయి స్తోత్రాలు పఠించడం మంచిది.

తులారాశి: భూసంబంధిత వివాదాలు నెలకొంటాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. బంధుగణంతో విబేధాలు నెలకొంటాయి. రియల్ ఎస్టేట్ వారి ప్రయత్నాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు విధుల్లో అవరోధాలు. పారిశ్రామిక, రాజకీయ వర్గాలకు విదేశీ పర్యటనలో అవాంతరాలు. ఐటీ నిపుణులకు నిరుత్సాహం. విద్యార్థులు కొన్ని అవకాశాలు పొందలేరు. వ్యాపారులు పెట్టుబడుల్లో తొందరపడొద్దు. మహిళలకు కుటుంబంలో సమస్యలు. గణేష్ స్తోత్రాలు పఠించడం మంచిది.

వృశ్చిక రాశి: బంధువర్గంతో విభేదాలు తొలగుతాయి. ఆప్తులతో ఉల్లాసంగా గడుపుతారు. ప్రముఖులతో పరిచయాలు మరింత ఉత్సాహాన్ని ఇస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపార లావాదేవీలు పుంజుకుంటాయి. ఉద్యోగ వర్గాలకు తగిన గుర్తింపు రాగలదు. పారిశ్రామిక, రాజకీయ వేత్తలకు విశేష యోగదాయకమైన కాలం. ఐటీ నిపుణులకు అనుకోని అవకాశాలు దక్కుతాయి. విద్యార్థులకు చేజారిన అవకాశాలు దక్కుతాయి. మహిళలకు కుటుంబంలో ఆదరణ పెరుగుతుంది. సుబ్రహ్మణ్వేశ్వరుడిని పూజించడం మంచిది.

ధనస్సు రాశి: ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబ సభ్యుల నుంచి విమర్శలు. రియల్ ఎస్టేట్ వారికి చిక్కులు తప్పకపోవచ్చు. వ్యాపారాల్లో ఒడిదుడుకులు. ఉద్యోగులకు ఒత్తిడులు. పారిశ్రామిక, రాజకీయ వర్గాల వారికి ఒత్తిడులు మరింత పెరుగుతాయి. ఐటీ నిపుణులకు కొన్ని ఇబ్బందులు ఎదురుకావచ్చు. విద్యార్థులు కొన్ని అవకాశాలు చేజార్చుకుంటారు. రావాల్సిన సొమ్ము అందక ఇబ్బందులు ఎదుర్కొంటారు. మహిళలకు మానసిక అశాంతి. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించడం మంచిది.

మకర రాశి: ఆలోచనలు అమలు చేస్తారు. కార్య జయం. నిరుద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. సంబంధ బాంధవ్యాలు మెరుగ్గా ఉంటాయి. చాకచాక్యంగా సమస్యలు పరిష్కరించుకుంటారు. ఉద్యోగస్థులకు సంతోషకరమైన సమాచారం. రాజకీయ వేత్తలు, కళాకారులకు సన్మానాలు. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. ఐటీ నిపుణుల ఆశలు ఫలిస్తాయి. విద్యార్థులకు సాంకేతిక విద్యావకాశాలు పొందుతారు. మహిళలు ప్రతిభాపాటవాలను చాటుకుంటారు. ఆంజనేయ దండకం పఠించడం మంచిది.

కుంభరాశి: ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ముఖ్య నిర్ణయాల్లో తొందరపాటు వద్దు. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. బంధువుల తాకిడి పెరుగుతుంది. పనుల్లో అవాంతరాలు కొంత చికాకు పరుస్తాయి. రియల్ ఎస్టేట్ వారికి అంతగా అనుకూలించదు. వ్యాపార లావాదేవీలు లాభిస్తాయి. ఉద్యోగులకు విధుల్లో ఆచితూచి వ్యవహరించాలి. రాజకీయ, పారిశ్రామిక వేత్తలకు కొన్ని ఇబ్బందులు ఎదురుకావచ్చు. విద్యార్థులు మరింత శ్రమించాలి. మహిళలకు కుటుంబంలో వివాదాలు. కనకదుర్గా స్తోత్రాలు పఠించడం మంచిది.

మీనరాశి: ఆర్థిక వ్యవహారాల్లో పురోగతి సాధిస్తారు. కుటుంబంలో శుభకార్యాలపై చర్చలు. కొత్త పనులు చేపడతారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆస్తులు సమకూర్చుకుంటారు. వ్యాపారాల్లో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు శుభ సమాచారం. కాంట్రాక్టర్లు, రియల్టర్లకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఐటీ నిపుణుల అంచనాలు నిజమవుతాయి. విద్యార్థులకు చికాకు తొలగి ముందుకు సాగుతారు. మహిళలు అనుకున్నతి సాధిస్తారు. గాయత్రీదేవీ ధ్యానం మంచిది.
Tags:    
  • Daily Rashi Phalalu 
  • Daily Horoscope 
  • Horoscope 
  • Rashi Phalalu 
  • Telugu NEws 

Similar News

తనకంటే శక్తిమంతమైన మరో ఏఐని సృష్టించే స్థాయికి ఏఐ.. ఆందోళనలో టెక్ కంపెనీలు?

2026-11-06 15:30 GMT

టాప్ స్టోరి: యంగ్ అథ్లెట్లు త‌స్మాత్ జాగ్ర‌త్త‌.. కెరీర్‌ను నాశనం చేసే 4 పొరపాట్లు!

2026-11-06 14:30 GMT

టీటీడీకి లేట‌య్యే కొద్దీ.. 'కాంపిటీష‌న్' పెరుగుతోందిగా..!

2026-11-06 12:30 GMT

జీడీపీ పెరిగితేనే అభివృద్ధి చెందినట్టా? అసలైన ప్రగతి అంటే ఇదే!

2026-11-06 11:37 GMT

టీడీపీలో సివంగులు.. వ‌ద‌ల్లేదుగా.. !

2026-11-06 11:30 GMT

భార్య.. తర్వాత ఆమె కుటుంబం.. భర్త చేసిన సీరియల్ కిల్లింగ్ కలకలం

2026-11-06 10:49 GMT

ఫ్యూచర్ సిటీకి కొత్త జిల్లా హోదా? జైపాల్‌రెడ్డి పేరుతో దక్షిణ తెలంగాణలో మరో జిల్లా?

2026-11-06 10:45 GMT

'రాధా-రంగా' మిత్ర‌మండ‌లికి జోష్‌.. !

2026-11-06 10:30 GMT

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

'గ్రేట‌ర్‌' విశాఖ‌లో జ‌న‌సేన సునామీ... !

2026-11-06 09:24 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

జ‌నం ప‌ట్టుబడితే అంతే.. ఏపీలో పోలింగ్ బ‌హిష్క‌ర‌ణ‌!

2026-11-06 09:22 GMT

Copyright @2026

Powered by Blink CMS