• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  డిసెంబరు 8 శనివారం 2018...

డిసెంబరు 8 శనివారం 2018 దినఫలాలు

By - Tupaki Desk
Update: 2018-12-08 01:30 GMT
గమనిక: ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి - గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు.

మేష రాశి: ఆలోచనలు స్థిరంగా ఉండవు. మిత్రులతో మాటపట్టింపు. ఆరోగ్యంపట్ల మెలకువలు పాటించండి. పనుల్లో అవాంతరాలు. వ్యాపార లావాదేవీలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు  విధుల్లో పొరపాట్లు. పారిశ్రామిక - రాజకీయ వర్గాలకు పర్యటనలు వాయిదా. రియల్ ఎస్టేట్ వారికి నిరాశాజనకం. ఐటీ నిపుణులు విదేశీ పర్యటనలు వాయిదా వేసుకుంటారు. విద్యార్థులకు సంతృప్తిగా ఉండదు. మహిళకు మానసిక ఆందోళన. విష్ణు సహస్రనామ పారాయణం చేయడం మంచిది.

వృషభ రాశి: భూవివాదాలు నెలకొంటాయి. మిత్రులతో విబేధాలు. రియల్ ఎస్టేట్ వారికి ఇబ్బందులు తప్పవు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఐటీ నిపుణులకు ఇబ్బందులు. ఉద్యోగులు పైస్థాయి నుంచి మాటపడతారు. పారిశ్రామిక వేత్తలకు అంచనాలు తప్పుతాయి. విద్యార్థులకు ఒత్తిడులు. మహిళలకు అనారోగ్యం.  ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి. వేంకటేశ్వరస్వామిని పూజించడం మంచిది.

మిథున రాశి: ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుంది. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తిలాభం. అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. అంచనాలు నిజమవుతాయి. రియల్ ఎస్టేట్ వారికి అనుకూల సమయం. వ్యాపారాల్లో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు. ఐటీ నిపుణులకు ఫలితం దక్కుతుంది. విద్యార్థులకు నూతన అవకాశాలు. మహిళలు ఉత్సాహంగా గడుపుతారు. ఇంటాబయటా ప్రోత్సాహం. ఆదిత్య హృదయం పఠించడం మంచిది.

కర్కాటక రాశి: ఉద్యోగాల్లో అనుకూల మార్పులు. రాజకీయ - పారిశ్రామిక వేత్తలకు ఉత్సాహంగా ఉంటుంది. బంధువుల సలహాలతో వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఆదాయం పెరిగి అప్పులు తీరతాయి. ఐటీ నిపుణులకు చిక్కులు తొలగుతాయి. విద్యార్థులకు పరిశోధనలు కలిసివస్తాయి. రియల్ ఎస్టేట్ ల వారి యత్నాలు ఫలించవు. మహిళలకు మనశ్శాంతి చేకూరుతుంది. నవగ్రహ స్తోత్రాలు పఠించడం మంచిది.

సింహ రాశి: పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. బంధువులు - స్నేహితులతో తగాదాలు. కుటుంబ సమస్యలు వేధిస్తాయి. దూరప్రయాణాలు చేస్తారు. ఉద్యోగులకు ఊహించని బదిలీలు. రాజకీయ వేత్తలు, కళాకారులకు ఉత్సాహం తగ్గి నిరాశకు లోనవుతారు. ఐటీ నిపుణులకు - విద్యార్థులకు నిరాశ. మహిళలకు మానసిక అశాంతి. ఆదిత్య హృదయం పఠించడం మంచిది.

కన్యారాశి: ఉద్యోగ ప్రయత్నాలు ముందుకు సాగవు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరాలు తీరతాయి. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. బంధువులతో విబేధాలు నెలకొంటాయి. రియల్ ఎస్టేట్ వారికి చిక్కులు పెరుగుతాయి. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు మీదపడతాయి. పారిశ్రామిక - రాజకీయ వర్గాలకు ఒత్తిడులు అధికమవుతాయి. విద్యార్థులకు అసంతృప్తి. ఐటీ నిపుణులకు గందరగోళ పరిస్థితి. మహిళలకు ఆరోగ్య సమస్యలు. సత్యనారాయణ స్వామిని పూజించడం మంచిది.

తులారాశి: ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సన్నిహితులతో విబేధాలు తొలగుతాయి. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు. రాజకీయ వేత్తలు - కళాకారులకు ఉత్సాహంగా ఉంటుంది. ఐటీ నిపుణులకు శుభ సమాచారం అందుతుంది. విద్యార్థులకు అరుదైన పురస్కారాలు దక్కుతాయి. మహిళలకు సంతోషకరమైన సమాచారం. గణేశాష్టకం పఠించడం మంచిది.

వృశ్చిక రాశి: సోదరులు, మిత్రులతో కలహాలు. ఆర్థిక ఇబ్బందులు, రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆలయాలు సందర్శిస్తారు. కొన్ని కాంట్రాక్టులు చేజారుతాయి. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. పారిశ్రామిక - రాజకీయ వర్గాలకు విదేశీ పర్యటనల్లో ఆటంకాలు. ఉద్యోగులకు బదిలీలు. విద్యార్థులకు నిరాశ. మహిళలకు కుటుంబ సమస్యలు. దత్తాత్రేయుడిని పూజించడం మంచిది.

ధనస్సు రాశి: పరిస్థితులు అనుకూలిస్తాయి. ఉద్యోగయత్నాలకు అనుకూలం. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ వారి అంచనాలు నిజమవుతాయి. వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు. రాజకీయ - పారిశ్రామిక వర్గాలకు విదేశీయానం. ఐటీ నిపుణులకు మరింత ఉత్సాహం. విద్యార్థులకు అనుకోని ఫలితాలు. మహిళలకు శుభ సమాచారం అందుతుంది. దుర్గాదేవీకి కుంకుమార్చన చేయించడం మంచిది.

మకర రాశి: ఇంటా బయట సమస్యలు వేధిస్తాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువులతో తగాదాలు. ఒక సమాచారం కొంత ఇబ్బంది కలిగిస్తుంది. కాంట్రాక్టర్లు - రియల్టర్లకు సమస్యలు పెరుగుతాయి. వ్యాపారాల్లో ఒడిదుడుకులు. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు. పారిశ్రామిక - రాజకీయ వర్గాలకు నిరాశాజనకం. ఐటీ నిపుణుల యత్నాలు ముందుకుసాగవు. విద్యార్థులకు అంచనాలు తప్పుతాయి. మహిళలకు కుటుంబ సమస్యలు. అంగారక స్తోత్రం పఠించడం మంచిది.

కుంభరాశి: రాబడి పెరుగుతుంది. ఇంటాబయటా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. రియల్ ఎస్టేట్  వారికి కొంత అనుకూలత. ఉద్యోగాల్లో ఒత్తిడులు. పారిశ్రామిక - రాజకీయ వర్గాలకు అనుకోని అవకాశాలు. ఐటీ నిపుణులకు నూతనోత్సాహం. విద్యార్థులు సాంకేతిక అవకాశాలు దక్కించుకుంటారు. మహిళలకు ఆస్తిలాభం. సుబ్రహ్మణ్యేశ్వర పూజలు చేయడం మంచిది.

మీనరాశి: ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. కాంట్రాక్టర్లకు టెండర్లు దక్కుతాయి. పారిశ్రామిక వర్గాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఐటీ నిపుణులు అనుకున్న విజయాలు సాధిస్తారు. విద్యార్థుల పరిశోధనలకు గుర్తింపు లభిస్తుంది. మహిళలకు కుటుంబ సమస్యలు పరిష్కారం. విష్ణుసహస్రనామ పారాయణం చేయడం మంచిది.
    

Tags:    
  • Daily Rashi Phalalu 
  • Daily Horoscope 
  • Horoscope 
  • Rashi Phalalu 
  • Telugu NEws 

Similar News

తనకంటే శక్తిమంతమైన మరో ఏఐని సృష్టించే స్థాయికి ఏఐ.. ఆందోళనలో టెక్ కంపెనీలు?

2026-11-06 15:30 GMT

టాప్ స్టోరి: యంగ్ అథ్లెట్లు త‌స్మాత్ జాగ్ర‌త్త‌.. కెరీర్‌ను నాశనం చేసే 4 పొరపాట్లు!

2026-11-06 14:30 GMT

టీటీడీకి లేట‌య్యే కొద్దీ.. 'కాంపిటీష‌న్' పెరుగుతోందిగా..!

2026-11-06 12:30 GMT

జీడీపీ పెరిగితేనే అభివృద్ధి చెందినట్టా? అసలైన ప్రగతి అంటే ఇదే!

2026-11-06 11:37 GMT

టీడీపీలో సివంగులు.. వ‌ద‌ల్లేదుగా.. !

2026-11-06 11:30 GMT

భార్య.. తర్వాత ఆమె కుటుంబం.. భర్త చేసిన సీరియల్ కిల్లింగ్ కలకలం

2026-11-06 10:49 GMT

ఫ్యూచర్ సిటీకి కొత్త జిల్లా హోదా? జైపాల్‌రెడ్డి పేరుతో దక్షిణ తెలంగాణలో మరో జిల్లా?

2026-11-06 10:45 GMT

'రాధా-రంగా' మిత్ర‌మండ‌లికి జోష్‌.. !

2026-11-06 10:30 GMT

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

'గ్రేట‌ర్‌' విశాఖ‌లో జ‌న‌సేన సునామీ... !

2026-11-06 09:24 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

జ‌నం ప‌ట్టుబడితే అంతే.. ఏపీలో పోలింగ్ బ‌హిష్క‌ర‌ణ‌!

2026-11-06 09:22 GMT

Copyright @2026

Powered by Blink CMS