• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  డిసెంబరు 6 గురువారం 2018...

డిసెంబరు 6 గురువారం 2018 దినఫలాలు

By - Tupaki Desk
Update: 2018-12-06 04:16 GMT
గమనిక: ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి, గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు.

మేష రాశి: బంధువులతో విబేధాలు. పనులలో ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో అధిగమిస్తారు. రియల్ ఎస్టేట్ వారికి అనుకోని ఇబ్బందులు. వ్యాపారాల్లో లాభాలు కష్టమే. ఉద్యోగులకు చికాకులు పెరుగుతాయి. పారిశ్రామిక, రాజకీయ వర్గాల వారికి వ్యయప్రయాసలు. ఐటీ నిపుణులకు అసంతృప్తి. రాబడికి మించిన ఖర్చులు. మహిళలకు మనోధైర్యం తగ్గుతుంది. నరసింహ స్తోత్రాలు పఠించడం మంచిది.

వ‌ృషభ రాశి: అప్రయత్న కార్యసిద్ధి. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఊహలు నిజం చేసుకుంటారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థికాభివృద్ధి ఉంటుంది. రుణాలు తీరతాయి. ఉద్యోగాల్లో ఇంక్రిమెంట్లు. రాజకీయ వర్గాలకు ఊహించని పదవులు. విద్యార్థులకు నూతన అవకాశాలు. మహిళలకు ఆస్తి వివాదాలు. రియల్ ఎస్టేట్ వారికి సమస్యల నుంచి విముక్తి. పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు. గణపతిని పూజించడం మంచిది.

మిథున రాశి: పలుకుబడి పెరుగుతుంది. కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేస్తారు. కాంట్రాక్టర్లు, రియల్టర్లకు అనుకూల పరిస్థితులు. వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. ఉద్యోగులకు పదోన్నతులు. రాజకీయ వర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఐటీ నిపుణులకు అనుకూలం. విద్యార్థులు లక్ష్యాలు సాధిస్తారు. సన్నిహితులతో కొన్ని విషయాలపై రాజీకి వస్తారు. మహిళలకు నూతనోత్సాహం. కనకదుర్గాదేవీని పూజించడం మంచిది.

కర్కాటక రాశి: ఉద్యోగ యత్నాల్లో ఆటంకాలు. పనులలో ఆటంకాలు ఎదురవుతాయి. అనుకోని ఖర్చులు. రాబడి తగ్గుతుంది. నిర్ణయాల్లో ఆచితూచి వ్యవహరించండి. ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. వ్యాపారులు నిదానంగా వ్యవహరించాలి. ఉద్యోగులకు బదిలీలు. పారిశ్రామిక, రాజకీయ వర్గాలకు విదేశీ పర్యటనల్లో ఇబ్బందులు. ఐటీ ఉద్యోగులకు సమస్యలు. విద్యార్థులకు అవకాశాలు చేజారుతాయి. మహిళలకు నిరాశ ఎదురవుతుంది. హనుమాన్ చాలీసా పఠించడం మంచిది.

సింహ రాశి: ఆదాయం తగ్గి అప్పులు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు ఉండవచ్చు. మిత్రులతో అకారణంగా తగాదాలు. రియల్ ఎస్టేట్ వారికి ఒడిదుడుకులు పెరుగుతాయి. వ్యాపారాల్లో నిరుత్సాహమే. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. రాజకీయ, పారిశ్రామిక వర్గాలకు నిరాశ. ఐటీ నిపుణులకు అంచనాలు తప్పుతాయి. విద్యార్థులకు నిరాశ. మహిళలకు కుటుంబంలో సమస్యలు. సుబ్రహ్మణ్య అష్టకం పఠించడం మంచిది.

కన్యారాశి: బంధువులతో వివాదాలు కొలిక్కి వస్తాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. కాంట్రాక్టులు చేపడుతారు. రియల్ ఎస్టేట్ వారికి లాభాలు. వ్యాపారాల్లో లాభాలు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు దక్కుతాయి. కుటుంబంలో సౌఖ్యం. ఒక శుభవార్త ఆనందం కలిగిస్తుంది. రాజకీయ వర్గాల వారికి పదవీయోగం. విద్యార్థులకు నూతనోత్సాహం. మహిళలకు ఆస్తి లాభాలు ఉండవచ్చు. విష్ణు సహస్రనామ పారాయణం చేయడం మంచిది.

తులారాశి: ఆస్తి వివాదాలు సతమతమవుతాయి. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తికాగలవు. మానసిక ఆందోళన కలిగిస్తుంది. రియల్ ఎస్టేట్ వారికి గందరగోళం. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు అనుకోని మార్పులు. రాజకీయ, పారిశ్రామిక వేత్తలకు గందరగోళ పరిస్థితి. ఐటీ నిపుణులకు అంచనాలు తారుమారు. విద్యార్థులకు నిరాశ. మహిళలకు ఆరోగ్య సమస్యలు. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించడం మంచిది.

వృశ్చిక రాశి: రాబడి మరింత పెరుగుతుంది. బంధువులతో కుటుంబ విషయాలు చర్చిస్తారు. పనుల్లో పురోగతి సాధిస్తారు. వ్యాపారాలు సంతృప్తికరం. రియల్ ఎస్టేట్ వారికి సమస్యలు తీరతాయి. రాజకీయ వర్గాల వారికి ఆహ్వానాలు అందుతాయి. విద్యార్థులు పరిశోధనలపై దృష్టిసారిస్తారు. మహిళలు కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఆదిత్య హృదయం పఠించడం మంచిది.

ధనస్సు రాశి: ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు ఉండవచ్చు. బంధువులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. కుటుంబంలో సమస్యలు. రియల్ ఎస్టేట్ వారికి సామాన్యంగానే ఉంటుంది. వ్యాపారాలు అంతగా లాభించవు. ఉద్యోగులకు విధుల్లో ప్రతిబంధకాలు. రాజకీయ, పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు వాయిదా పడుతాయి. ఐటీ నిపుణులు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. విద్యార్థులకు నిరాశ. మహిళలకు ఒక సమాచారం ఆందోళన కలిగిస్తుంది. లక్ష్మీదేవీ స్తోత్రాలు పఠించడం మంచిది.

మకర రాశి: పాతబాకీలు అందుతాయి. వ్యాపారాలు విస్తరిస్తాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. శుభకార్యాలకు హాజరవుతారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. వాహనాలు. ఆభరణాలు కొంటారు. పాతబాకీలు కొన్ని అందుతాయి. పారిశ్రామిక వేత్తలు, కళాకారులకు సన్మానాలు. ఐటీ నిపుణులకు నూతన అవకాశాలు దక్కుతాయి. విద్యార్థులకు విదేశీ విద్యావకాశాలు. మహిళలకు కుటుంబంలో గౌరవం లభిస్తుంది. గణపతిని పూజించడం మంచిది.

కుంభరాశి: ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ. భూవివాదాల నుంచి బయటపడతారు. ముఖ్యమైన కార్యక్రమాల్లో పురోగతి. వాహనాలు. స్థలాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్లు. పారిశ్రామిక, రాజకీయ వర్గాల వారికి విదేశీయానం. ఐటీ నిపుణులకు శుభ సమాచారం. విద్యార్థులకు అనుకోని అవకాశాలు దక్కుతాయి. మహిళలకు కుటుంబీకుుల నుంచి సహకారం లభిస్తుంది. వేంకటేశ్వరస్వామిని పూజించడం మంచిది.

మీనరాశి: ఆస్తి వివాదాలు నెలకొంటాయి. ఆలయాలు సందర్శిస్తారు. దూరపు బంధువులను కలుసుకుంటారు. ఉద్యోగులకు అనుకోని మార్పులు తథ్యం. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. రాజకీయ వేత్తలకు ఒడిదుడుకులు. ఐటీ నిపుణులకు లేనిపోని చికాకులు. విద్యార్థులకు అవకాశాలు దూరమవుతాయి. మహిళలకు కుటుంబ సభ్యులతో తగాదాలు. పనుల్లో అవరోధాలు. శారీరక రుగ్మతలు. గణపతిని పూజించడం మంచిది.
Tags:    
  • Daily Rashi Phalalu 
  • Daily Horoscope 
  • Horoscope 
  • Rashi Phalalu 
  • Telugu NEws 

Similar News

తనకంటే శక్తిమంతమైన మరో ఏఐని సృష్టించే స్థాయికి ఏఐ.. ఆందోళనలో టెక్ కంపెనీలు?

2026-11-06 15:30 GMT

టాప్ స్టోరి: యంగ్ అథ్లెట్లు త‌స్మాత్ జాగ్ర‌త్త‌.. కెరీర్‌ను నాశనం చేసే 4 పొరపాట్లు!

2026-11-06 14:30 GMT

టీటీడీకి లేట‌య్యే కొద్దీ.. 'కాంపిటీష‌న్' పెరుగుతోందిగా..!

2026-11-06 12:30 GMT

జీడీపీ పెరిగితేనే అభివృద్ధి చెందినట్టా? అసలైన ప్రగతి అంటే ఇదే!

2026-11-06 11:37 GMT

టీడీపీలో సివంగులు.. వ‌ద‌ల్లేదుగా.. !

2026-11-06 11:30 GMT

భార్య.. తర్వాత ఆమె కుటుంబం.. భర్త చేసిన సీరియల్ కిల్లింగ్ కలకలం

2026-11-06 10:49 GMT

ఫ్యూచర్ సిటీకి కొత్త జిల్లా హోదా? జైపాల్‌రెడ్డి పేరుతో దక్షిణ తెలంగాణలో మరో జిల్లా?

2026-11-06 10:45 GMT

'రాధా-రంగా' మిత్ర‌మండ‌లికి జోష్‌.. !

2026-11-06 10:30 GMT

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

'గ్రేట‌ర్‌' విశాఖ‌లో జ‌న‌సేన సునామీ... !

2026-11-06 09:24 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

జ‌నం ప‌ట్టుబడితే అంతే.. ఏపీలో పోలింగ్ బ‌హిష్క‌ర‌ణ‌!

2026-11-06 09:22 GMT

Copyright @2026

Powered by Blink CMS