• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  డిసెంబరు 5 బుధవారం 2018...

డిసెంబరు 5 బుధవారం 2018 దినఫలాలు

By - Tupaki Desk
Update: 2018-12-05 01:30 GMT
గమనిక: ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి, గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు.

మేష రాశి: సన్నిహితుల సాయంతో పనులు పూర్తి చేస్తారు. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. జీవిత భాగస్వామి సలహాలు స్వీకరిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. రియల్టర్లు, కాంట్రాక్టర్లకు అంచనాలు నిజమవుతాయి. వ్యాపారాల్లో లాభాలు. కళాకారులకు, రాజకీయ వర్గాల వారికి సన్మానాలు. ఉద్యోగులకు పదోన్నతులు. ఐటీ నిపుణులకు సంతోషకరమైన సమాచారం. కుటుంబంలో శుభకార్యాలు. మహిళలకు మానసిక ప్రశాంతత. విష్ణు ధాన్యం చేయడం మంచిది.

వ‌ృషభ రాశి: ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. పలుకుబడి పెరుగుతుంది. పాత సంఘటనలు గుర్తుకువస్తాయి. సన్నిహితులతో చర్చలు జరుపుతారు. ఆస్తి విషయాల్లో అగ్రిమెంట్లు. వ్యాపారాల్లో నూతన పెట్టుబడులు. ఉద్యోగులకు పదోన్నతులు. కళాకారులు, రాజకీయ రంగాల వారికి అరుదైన పురస్కారాలు. ఐటీ నిపుణులు అనుకున్నది సాధిస్తారు. మహిళలకు సంతోషకరమైన విషయాలు తెలుస్తాయి. ఆస్తి విషయాల్లో అగ్రిమెంట్లు. ఆదాయం ఆశించిన స్థాయిలో ఉంటుంది. మహిళలకు శుభసమాచారం. శ్రీ దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.

మిథున రాశి: శ్రమకు ఫలితం ఉండదు. దూర ప్రయాణాలు సంభవం. దూరప్రయాణాలు సంభవం. కొన్ని సమస్యలు చికాకు పరుస్తాయి. ఒక సంఘటన ఆకట్టుకుంటుంది. రియల్ఎస్టేట్ వారికి ఒత్తిడులు. వ్యాపారాల్లో ఆటుపోట్లు. ఉద్యోగులకు స్థాన మార్పు. కళాకారులు, రాజకీయ వర్గాలకు నిరాశ తప్పదు. ఐటీ నిపుణులు కొన్ని విషయాల్లో ఆందోళన చెందుతారు. మహిళలకు మానసిక అశాంతి. హనుమాన్ చాలీసా పఠిస్తే మంచిది.

కర్కాటక రాశి: నిర్ణయాల్లో తొందరపాటు తగదు. సన్నిహితులు, బంధువులతో విరోధాలు. ఆర్థిక విషయాల్లో నిరాశ. శ్రమాధిక్యం. ఆకస్మిక ప్రయాణాలు. రియల్ ఎస్టేట్ వారికి సమస్యలు వేధిస్తాయి. ఉద్యోగాల్లో చికాకులు. ఒత్తిడులు. కళాకారులు, పారిశ్రామికవర్గాల వారికి మానసిక ఆందోళన. ఐటీ నిపుణులకు శ్రమ మరింత పెరుగుతుంది. మహిళలకు కుటుంబంలో చికాకులు. ఆదిత్య హృదయం పఠించడం మంచిది.

సింహ రాశి: ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. దూరప్రాంతాల నుంచి శుభవర్తమానాలు. అనుకున్న రీతిలో పనులు పూర్తి చేస్తారు. ఆదాయ వనరులు పెరుగుతాయి. కాంట్రాక్టర్లకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాల్లో పదోన్నతులు. పారిశ్రామిక, రాజకీయవర్గాలకు ప్రోత్సాహకరం. ఐటీ నిపుణులకు సంతోషకరంగా ఉంటుంది. మహిళలకు శుభ సమాచారం అందుతుంది. శివాష్టకం పఠించండి మంచిది.

కన్యారాశి: పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. బంధువులతో విభేదాలు. కుటుంబంలో మీ ప్రతిపాదనలకు తిరస్కారం. ఆదాయం తగ్గి అప్పులు చేస్తారు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు నిలిచిపోయే అవకాశం. రాజకీయ, కళారంగాల వారికి ఒత్తిడులు. ఐటీ నిపుణులకు కొన్ని సమస్యలు వేధిస్తాయి. మహిళలకు కుటుంబ సభ్యులతో తగాదాలు. శివాష్టకం పఠించడం మంచిది.

తులారాశి: చిరకాల కోరిక నెరవేరుతుంది. ప్రత్యర్థుల నుంచి సైతం సాయం అందుతుంది. ఆదాయం మరింత పెరుగుతుంది. ఉన్నత వర్గాల వారికి పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. రియల్ ఎస్టేట్ వారికి సమస్యలు తీరతాయి. వ్యాపార లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. ఐటీ నిపుణులకు విజయాలు. పారిశ్రామిక, కళారంగాల వారికి యోగదాయకం. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడుతాయి. మహిళలకు సోదరుల నుంచి ధనలాభం. హనుమాన్ చాలీసా పఠించడం మంచిది.

వృశ్చిక రాశి: ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. దూర ప్రయాణాలు ఉంటాయి. ఆలయాలు సందర్శిస్తారు. రియల్ ఎస్టేట్ వారికి కొద్దిపాటి సమస్యలు. ప్రత్యర్థుల నుంచి ఒత్తిడులు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు కొంత ఆందోళన కలిగిస్తుంది. పారిశ్రామిక, రాజకీయ వర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా. ఐటీ నిపుణులు కొంత నిరాశకు లోనవుతారు. మహిళలకు కుటుంబంలో సమస్యలు. హయగ్రీవ స్తోత్రాలు పఠించండి.

ధనస్సు రాశి: రాబడి పెరుగుతుంది. ఆలోచనలు అమలు చేస్తారు. కుటుంబంలో శుభకార్యాలపై చర్చిస్తారు. వ్యవహారాల్లో విజయం. ఆప్తుల సలహాల మేరకు నిర్ణయాలు. వ్యాపారాల్లో పురోగతి. పారిశ్రామిక, రాజకీయ వర్గాలకు ప్రభుత్వం నుంచి ఆహ్వానాలు. ఐటీ నిపుణులు కొన్ని విజయాలు సాధిస్తారు. మహిళలకు మానసిక ప్రశాంతత. విష్ణు సహస్రనామ పారాయణ చేయడం మంచిది.

మకర రాశి: ఆలోచనలు కార్యరూపం దాల్చుతారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. వస్తు లాభాలు. బంధువుల తోడ్పాటుతో ముందుకు వెళతారు. ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. రియల్ ఎస్టేట్ వారికి శ్రమ ఫలిస్తుంది. వ్యాపారాలు అభివృద్ధిదాయకంగా సాగుతాయి. ఉద్యోగాల్లో అనుకూలత ఉంటుంది. పారిశ్రామిక వేత్తలు. కళాకారుల నూతనోత్సాహం. ఐటీ నిపుణులు ఊహించని అవకాశాలు పొందుతారు. మహిళలకు ఆప్తులతో వివాదాలు సర్ధుబాటు అవుతాయి. శివ స్తోత్రాలు పఠించదదం మంచిది.

కుంభరాశి: ఇంటాబయటా ఒత్తిడులు. బంధువులు, మిత్రులతో కలహాలు. రియల్ ఎస్టేట్ వారికి ఒడిదుడుకులు. వ్యాపారాల్లో చిక్కులు. ఉద్యోగులు మరింత శ్రమించాలి. కళాకారులు, రాజకీయ వర్గాల వారికి సమస్యలు. ఐటీ నిపుణులకు మానసిక ఆందోళన. ఆకస్మిక ప్రయాణాలు. అనుకోని ఖర్చులు ఎదురవుతాయి. మహిళలకు చికాకులు. దుర్గాదేవీ స్తోత్రాలు పఠించండి.

మీనరాశి: ఒక సంఘటన ఆశ్చర్యపరుస్తుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలం కాదు. ఆస్తి విషయాల్లో సోదరులతో తగాదాలు. రియల్ ఎస్టేట్ వారికి అంతగా అనుకూలించదు. వ్యాపారులకు పెట్టుబడులు అందవు. ఉద్యోగాల్లో ఉన్నతోద్యోగుల నుంచి ఒత్తిడులు. కళాకారులు, పారిశ్రామిక వర్గాల వారికి విదేశీ పర్యటనలు వాయిదా. ఐటీ నిపుణులకు విధులో అవాంతరాలు. మహిళలకు కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు. వివాదాలు చికాకు పరుస్తాయి. నృసింహ స్తోత్రాలు పఠించడం మంచిది.
Tags:    
  • Daily Rashi Phalalu 
  • Daily Horoscope 
  • Horoscope 
  • Rashi Phalalu 
  • Telugu NEws 

Similar News

జీడీపీ పెరిగితేనే అభివృద్ధి చెందినట్టా? అసలైన ప్రగతి అంటే ఇదే!

2026-11-06 11:37 GMT

టీడీపీలో సివంగులు.. వ‌ద‌ల్లేదుగా.. !

2026-11-06 11:30 GMT

భార్య.. తర్వాత ఆమె కుటుంబం.. భర్త చేసిన సీరియల్ కిల్లింగ్ కలకలం

2026-11-06 10:49 GMT

ఫ్యూచర్ సిటీకి కొత్త జిల్లా హోదా? జైపాల్‌రెడ్డి పేరుతో దక్షిణ తెలంగాణలో మరో జిల్లా?

2026-11-06 10:45 GMT

'రాధా-రంగా' మిత్ర‌మండ‌లికి జోష్‌.. !

2026-11-06 10:30 GMT

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

'గ్రేట‌ర్‌' విశాఖ‌లో జ‌న‌సేన సునామీ... !

2026-11-06 09:24 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

జ‌నం ప‌ట్టుబడితే అంతే.. ఏపీలో పోలింగ్ బ‌హిష్క‌ర‌ణ‌!

2026-11-06 09:22 GMT

రూ. 40 కోట్లా? ఐపీఎల్ వేలానికి ముందే ఆటగాళ్ల డిమాండ్లు వైరల్

2026-11-06 07:49 GMT

బోస్టన్‌లో తెలుగు విద్యార్థిని అదృశ్యం.. 36 గంటలుగా జాడలేదు.. అసలేమైంది?

2026-11-06 06:33 GMT

వైఫై, ఎమోజీ, క్యూఆర్ కూడా ఇలా దైనందిత జీవితంలో ఉపయోగించే ఈ అద్భుత ఆవిష్కరణల వెనుక ఉన్న దేశాలేవో తెలుసా?

2026-11-06 06:30 GMT

Copyright @2026

Powered by Blink CMS