• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  నవంబర్ 25 ఆదివారం 2018...

నవంబర్ 25 ఆదివారం 2018 దినఫలాలు

By - Tupaki Desk
Update: 2018-11-25 01:30 GMT
గమనిక: ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారనే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి, గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు..

మేష రాశి: ఆర్థిక లావాదేవీలు ఊపందుకుంటాయి. కొత్తమిత్రుల పరిచయం. శుభవార్తలు వింటారు. బాకీలు వసూలవుతాయి. స్థలాలు, గృహం కొనుగోలు చేస్తారు. రియల్ ఎస్టేట్ వారికి అన్నింటా విజయమే. ఉద్యోగులకు ఉన్నతస్థాయి నుంచి పిలుపు. వ్యాపారాలలో ముందడుగు. ఐటీ నిపుణులకు విజయాలు. రాజకీయవర్గాల వారికి ఊహించని పదవులు దక్కే అవకాశం.  విద్యార్థులకు నూతన అవకాశాలు. మహిళలకు ఆస్తి లాభం. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

వృషభ రాశి: ఆర్థిక ఇబ్బందులు తలెత్తే సూచనలు.  దూర ప్రయాణాలు ఉంటాయి. బంధువుల నుంచి విమర్శలు ఎదుర్కొంటారు. ఆలయాలు సందర్శిస్తారు. పలుకుబడిన వ్యక్తులను కలుసుకుంటారు. వ్యాపారాలలో ఆచితూచి అడుగువేయండి. ఉద్యోగులకు అనుకోని మార్పులు. పారిశ్రామిక, కళారంగాల వారికి అవకాశాలు చేజారుతాయి. ఐటీ నిపుణుల యత్నాలు  ముందుకు సాగవు. విద్యార్థులకు నిరాశాజనకం. మహిళలకు సోదరుల నుంచి పిలుపు. ఆదిత్య హృదయం పఠించండి.

మిథున రాశి: ఆలోచనలను కార్యరూపంలో పెడతారు. సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుతుంది. పరపతి పెరుగుతుంది. భవిష్యత్ పై నూతన ఆశలు చిగురిస్తాయి. ప్రతిభకు పదును పెడతారు. ఆఫ్తులు మరింత దగ్గరవుతారు. వ్యాపారాలలో పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగులకు పదోన్నతి. రాజకీయ, కళారంగాల వారికి సన్మానయోగం. ఐటీ నిపుణులకు ముఖ్య సమాచారం. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. మహిళలకు ఆస్తి లాభం. విష్ణు ధ్యానం చేయండి.

కర్కాటక రాశి: ఆదాయం తగ్గి రుణయత్నాలు చేస్తారు. వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. ఎంత కష్టించినా ఆశించిన ఫలితం ఉండదు. ఆకస్మిక ప్రయాణాలు. నిర్ణయాల్లో తొందరపడొద్దు. వాహనాల విషయంలో జాగ్రత్త వహించండి. వ్యాపారులకు నిరాశ. రియల్ ఎస్టేట్ వారికి అంతగా అనుకూలించదు. ఉద్యోగులకు చికాకులు. పారిశ్రామిక, రాజకీయ వర్గాల వారికి ఒత్తిడులు. ఐటీ నిపుణులు మరింత శ్రమించాలి. మహిళలకు మానసిక అశాంతి. వేంకటేశ్వరస్వామిని పూజించండి.

సింహ రాశి: ఆర్థిక విషయాలు ఆశాజనకం. సన్నిహితులు, మిత్రులు అన్నింటా సహాయపడతారు. అనుకున్న రీతిలో పనులు పూర్తి చేస్తారు. కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు ఊరటనిచ్చే మార్పులు జరుగుతాయి. ఐటీ నిపుణులకు కొత్త అవకాశాలు వస్తాయి. రాజకీయ, కళారంగాల వారికి సన్మానాలు. విద్యార్థులకు మరింత కలిసివస్తుంది. మహిళలకు ఆస్తిలాభం. హయగ్రీవ స్తోత్రాలు పఠించండి.

కన్యారాశి: బాకీలు వసూలవుతాయి.  దూరప్రాంతాల నుంచి శుభవార్తలు వింటారు. వివాహా యత్నాలు సానుకూలమవుతుంది. మీ సత్తా పదిమంది గుర్తిస్తారు. క్లిష్టమైన పనులు కూడా అవలీలగా పూర్తి చేస్తారు. వివాహా యత్నాలు సానుకూలమవుతాయి. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. రియల్ ఎస్టేట్, కాంట్రాక్టర్లకు లాభాలు. రాజకీయ, పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. ఐటీ నిపుణులకు సంతోషకరమైన సమాచారం. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. మహిళలకు శుభవార్తలు. శివాష్టకం పఠించండి.

తులారాశి: ఊహించని ప్రయాణాలు. రావాల్సిన సొమ్ము సకాలంలో అందక ఇబ్బందులు పడుతారు. కొన్ని పనులు మధ్యలోనే నిలిపివేస్తారు. విలువైన వస్తువులు, వాహనాలు జాగ్రత్త. వ్యాపారాలలో లాభాలు అంతగా ఉండవు. పారిశ్రామిక, రాజకీయ వర్గాల వారి విదేశీ పర్యటనలు వాయిదా. ఐటీ నిపుణులకు నిరుత్సాహం. ఉద్యోగులు విధి నిర్వహణలో్ అప్రమత్తంగా ఉండాలి. విద్యార్థులకు గందోరగోళ పరిస్థితి. మహిళలకు మానసిక అశాంతి.  దక్షిణమూర్తి స్తోత్రాలు పఠించండి.

వృశ్చిక రాశి: రాబడి తగ్గి రుణాలు చేస్తారు. శ్రమాధిక్యం తప్ప పనులు ముందుకు సాగవు. గొంతు సంబంధిత రుగ్మతలు  వేధిస్తాయి. వివాదాలకు దూరంగా మెలగండి. రియల్ ఎస్టేట్ వారికి కొద్దిపాటి చికాకులు. వ్యాపార విస్తరణలో ఆటంకాలు. ఉద్యోగులకు పనిభారం. పారిశ్రామిక, కళారంగాల వారికి నిరాశ. కోర్టు వ్యవహారాలు చికాకుల పరుస్తాయి. ఐటీ నిపుణులకు సామాన్యంగా ఉంటుంది. విద్యార్థులకు ఒత్తిడులు. మహిళలకు సోదరులతో తగాదాలు. నవగ్రహ స్తోత్రాలు పఠించండి.

ధనస్సు రాశి: విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సన్నిహితులు, మిత్రుల సహకారంతో కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఉద్యోగులకు ఊరించే ప్రకటన రావచ్చు. పారిశ్రామిక, కళారంగాల వారికి సన్మానయోగం. ఐటీ నిపుణులకు కొత్త అవకాశాలు. రియల్ ఎస్టేట్ వారికి అనూహ్యమైన లాభాలు. విద్యార్థులకు విజయాలు. మహిళలకు భూలాభాలు. అంగారక స్తోత్రాలు పఠించండి.

మకర రాశి: భవిష్యత్ అంచనాలు రూపొందిస్తారు. అందరిలో గౌరవం పెరుగుతుంది. వాహనాలు, బంగారు ఆభరణాలు కొంటారు. విమర్శించినవారే ప్రశంసిస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు. ఉద్యోగులకు పదోన్నతులు ఊరిస్తాయి. వ్యాపారాలలో అడుగు ముందుకు వేస్తారు. పారిశ్రామిక, కళారంగాల వారికి పురస్కారాలు. ఐటీ నిపుణులకు ఉత్సాహం. విద్యార్థుల యత్నాలు ఫలిస్తాయి. మహిళలకు మానసిక ప్రశాంతత. ఆంజనేయ దండకం పఠించండి.

కుంభరాశి: మిత్రులతో కలహాలు ఏర్పడవచ్చు. ప్రయాణాలు రద్దు చేసుకుంటారు. ఇంటాబయటా ఒత్తిడులు పెరుగుతాయి. ఆరోగ్య, కుటుంబ సమస్యలు వేధించవచ్చు. రియల్ ఎస్టేట్ వారికి నిరుత్సాహం. ఉద్యోగులకు ఒడిదుడుకులు. పారిశ్రామిక, వ్యవసాయ రంగాల వారికి ప్రశాంత లోపిస్తుంది. విద్యార్థులకు నిరాశ. మహిళలకు మనోవేదన. కనకధారా స్తోత్రాలు పఠించండి.

మీనరాశి: వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. రియల్ ఎస్టేట్ వారికి గందరగోళం. అదనపు రాబడి తగ్గి నిరాశ కలిగిస్తుంది. కొన్ని వ్యవహారాల్లో అంచనాలు తప్పుతాయి. ఉద్యోగులకు అనుకోని బదిలీలు. రాజకీయ వర్గాల వారికి ప్రజాదరణ అంతంత మాత్రంగా ఉంటుంది. ఐటీ నిపుణులు ఫలితాలు పొందలేరు. విద్యార్థులకు అవకాశాలు చేజారుతాయి. భవిష్యత్ పై కొంత ఆందోళన నెలకొంటుంది. మహిళలకు కుటుంబంలో సమస్యలు. హనుమాన్ చాలీసా పఠించండి. 
Tags:    
  • Daily Rashi Phalalu 
  • Daily Horoscope 
  • Horoscope 
  • Rashi Phalalu 
  • Telugu NEws 

Similar News

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

టీటీడీకి లేట‌య్యే కొద్దీ.. 'కాంపిటీష‌న్' పెరుగుతోందిగా..!

2026-11-06 12:30 GMT

జీడీపీ పెరిగితేనే అభివృద్ధి చెందినట్టా? అసలైన ప్రగతి అంటే ఇదే!

2026-11-06 11:37 GMT

టీడీపీలో సివంగులు.. వ‌ద‌ల్లేదుగా.. !

2026-11-06 11:30 GMT

భార్య.. తర్వాత ఆమె కుటుంబం.. భర్త చేసిన సీరియల్ కిల్లింగ్ కలకలం

2026-11-06 10:49 GMT

ఫ్యూచర్ సిటీకి కొత్త జిల్లా హోదా? జైపాల్‌రెడ్డి పేరుతో దక్షిణ తెలంగాణలో మరో జిల్లా?

2026-11-06 10:45 GMT

'రాధా-రంగా' మిత్ర‌మండ‌లికి జోష్‌.. !

2026-11-06 10:30 GMT

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

'గ్రేట‌ర్‌' విశాఖ‌లో జ‌న‌సేన సునామీ... !

2026-11-06 09:24 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

జ‌నం ప‌ట్టుబడితే అంతే.. ఏపీలో పోలింగ్ బ‌హిష్క‌ర‌ణ‌!

2026-11-06 09:22 GMT

రూ. 40 కోట్లా? ఐపీఎల్ వేలానికి ముందే ఆటగాళ్ల డిమాండ్లు వైరల్

2026-11-06 07:49 GMT

Copyright @2026

Powered by Blink CMS