• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  నవంబర్ 20 మంగళవారం 2018...

నవంబర్ 20 మంగళవారం 2018 దినఫలాలు

By - Tupaki Desk
Update: 2018-11-20 01:30 GMT
గమనిక: ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారనే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి - గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు..

మేష రాశి: ఆలోచనలు స్థిమితంగా ఉండవు. పనులు ముందుకు సాగవు. ఆర్థిక విషయాల్లో నిరాశ ఎదురైనా అవసరాలకు లోటు ఉండదు. రియల్ ఎస్టేట్ వారికి ఆటుపోట్లు తప్పవు. పారిశ్రామిక వేత్తలు ఆచితూచి ముందుకు సాగాలి. ఐటీ నిపుణులు శ్రమిస్తేనే ఫలితం ఉంటుంది. ఉద్యోగులకు విధి నిర్వహణలో చికాకులు. విద్యార్థులు అంచనాల్లో పొరపాట్లు. మహిళలకు కుటుంబీకులతో వైరం. విష్ణు సహస్రనామ పారాయణం చేయండి.

వృషభరాశి: జీవిత భాగస్వామితో వివాదాలు పరిష్కరించుకుంటారు. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. చేపట్టిన కార్యక్రమాలు పట్టుదలతో పూర్తిచేస్తారు. ఆర్థికంగా ప్రగతి సాధిస్తారు. ఉద్యోగులకు ఇంక్రమెంట్లు. వ్యాపారాలు విస్తరిస్తారు. పారిశ్రామిక - వైద్య రంగాల వారికి విదేశీ పర్యటనలు. మహిళలకు కుటుంబంలో గౌరవం దక్కుతుంది. ఐటీ నిపుణులు లక్ష్యాలను సాధిస్తారు. విద్యార్థులకు సంతోషకరమైన ఫలితాలు లభిస్తాయి. హనుమాన్ పూజలు చేయండి.

మిథున రాశి: శుభకార్యాల్లో పాల్గొంటారు. మిత్రుల నుంచి సహకారం అందుతుంది. బాకీలు వసూలవుతాయి. నూతన పనులు ప్రారంభిస్తారు. రియల్ ఎస్టేట్ వారికి కలిసొచ్చే సమయం. పారిశ్రామిక వర్గాల వారికి విదేశీ పర్యటనలు. వ్యాపారాలలో పురోగతి. ఐటీ నిపుణులు శ్రమిస్తే ఫలితం ఉంటుంది. విద్యార్థులు ఉత్సాహంగా గడుపుతారు. మహిళలు శుభవార్తలు వింటారు. హనుమాన్ చాలీసా పఠించండి.

కర్కాటకం : రాబడి ఆశించిన స్థాయిలో ఉండదు. పనులు శ్రమతో పూర్తి చేస్తారు. దూర ప్రయాణాలు. ఉద్యోగాల్లో ఒత్తిడులు. ఐటీ నిపుణులు కొన్ని నిర్ణయాలు మార్చుకుంటారు. వ్యాపార విస్తరణ యత్నాలు మందగిస్తాయి. మహిళలకు మానసిక ఆందోళన. పారిశ్రామిక, వైద్య రంగాల వారికి చికాకులు. విద్యార్థులు మరింత కృషి చేయాలి. గణపతిని పూజించండి.

సింహరాశి: ఎంత కష్టించినా ఫలితం ఉండదు. ఆలోచనలు కలిసిరావు. కుటుంబ సభ్యులతో సమస్యలు పరిష్కరించుకుంటారు. ఆదాయం నిరుత్సాహ పరుస్తుంది. వ్యాపారాలలో చిక్కులు ఎదురవుతాయి. ఉద్యోగులకు బదిలీలు. రియల్ ఎస్టేట్ వారికి కోర్టు కేసులు ఎదురుకావచ్చు. ఐటీ నిపుణులకు నిరాశ. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలో ఆటంకాలు.  విద్యార్థులకు అసంతృప్తి. మహిళలకు కుటుంబపరంగా చికాకులు. నరసింహ స్తోత్రాలు పఠించండి.

కన్యరాశి: ఆర్థిక సమస్యలు తీరుతాయి. పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడుతాయి. ఐటీ నిపుణులకు కీలక సమాచారం అందుతుంది. రియల్ ఎస్టేట్ వారికి ఇబ్బందులు తొలగుతాయి. వివాహ, ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. విద్యార్థులకు సాంకేతిక విద్యావకాశాలు. పారిశ్రామికవర్గాలకు కొత్త సంస్థల ఏర్పాటుకు అనుకూలం. మహిళలు శుభవార్తలు వింటారు. దుర్గాదేవీని పూజించండి.

తులారాశి: శుభకార్యాల్లో పాల్గొంటారు. ప్రత్యర్థులు అనుకూలంగా మారతారు. సన్నిహితులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. కొత్తపనులకు శ్రీకారం చూడుతారు. ఉద్యోగులకు నూతనోత్సాహం. రియల్టర్లు - కాంట్రాక్టర్లకు చికాకులు తొలగుతాయి. ఐటీ నిపుణుల బదిలీలు నిలిచిపోతాయి. పారిశ్రామిక వర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. విద్యార్థులకు ఊహించని ఫలితాలు. మహిళలకు ఆస్థి లాభం. వేంకటేశ్వర స్వామిని పూజించండి.

వృశ్చిక రాశి: దూర ప్రయాణాలు ఉంటాయి. శ్రమించినా ఫలితం ఉండదు. రుణాలు చేస్తారు. సన్నిహితుల నుంచి ధన, మాట సాయం కోరతారు. రియల్ ఎస్టేట్ వారికి శ్రమ పెరుగుతుంది. వ్యాపారాలలో ఆశించిన లాభాలు కష్టమే. పారిశ్రామిక, రాజకీయ వేత్తలకు ఉత్సాహం కలుగుతుంది. విద్యార్థుల పరిశోధనలు సాగవు. ఐటీ నిపుణులకు లేనిపోని వివాదాలు. మహిళలకు నిరాశ. ఆదిత్య హృదయం పఠించండి.

ధనస్సు రాశి: రుణాలు చేస్తారు. కష్టించినా ఫలితం ఉండదు. కొత్త పెట్టుబడులు అందుతాయి. కొన్ని సమస్యలు అధిగమిస్తారు. ఆకస్మిక ప్రయణాలు. ఉద్యోగులకు బదిలీలు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఐటీ నిపుణులు ఉత్సాహంతో ముందడుగు వేస్తారు. రియల్ ఎస్టేట్ వారికి కొన్ని సమస్యలు. పారిశ్రామిక వర్గాల వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. విద్యార్థులకు ముఖ్య సమాచారం అందుతుంది. మహిళలకు కుటుంబంలో చికాకులు. శివాలయంలో అభిషేకం చేయించండి.

మకర రాశి: ప్రయాణాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగయత్నాలు కలిసివస్తాయి. కొత్త వ్యక్తుల పరిచయం. కుటుంబంలో శుభకార్యాలపై చర్చిస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు కలిసివస్తాయి. పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు. రియల్ ఎస్టేట్ వారికి అనుకున్న పనులు  అవుతాయి. ఐటీ నిపుణులకు ఆహ్వానాలు. ఉద్యోగులకు ఒత్తిడి నుంచి విముక్తి. విద్యార్థులకు శుభవార్తలు. మహిళలకు ఆస్థిలాభం. ఆంజనేయ దండకం పఠించండి.

కుంభ రాశి: ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆదాయానికి మించి ఖర్చులు. వివాదాలకు దూరంగా ఉండండి. వ్యాపార లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. పారిశ్రామిక, రాజకీయ రంగాల వారికి ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు. విద్యార్థులు శ్రమించాలి. మహిళలకు కుటుంబంలో చికాకులు. శ్రీలక్ష్మీగణపతి స్తోత్రాలు పఠించండి.

మీన రాశి: ఆకస్మిక ధనలాభం. ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. పనుల్లో అనూకూలత. సన్నిహితులతో ఉల్లాసంగా గడుపుతారు. పారిశ్రామిక వర్గాలకు విదేశీ ఆహ్వానాలు. ఉద్యోగులకు పదోన్నతి. వ్యాపారులకు లాభాలు. ఐటీ నిపుణులకు సన్మానాలు. విద్యార్థులకు విజయం. మహిళలు శుభవార్తలు వింటారు. నృసింహ స్తోత్రాలు పఠించండి.



Tags:    
  • Daily Rashi Phalalu 
  • Daily Horoscope 
  • Horoscope 
  • Rashi Phalalu 
  • Telugu NEws 

Similar News

బోస్టన్‌లో తెలుగు విద్యార్థిని అదృశ్యం.. 36 గంటలుగా జాడలేదు.. అసలేమైంది?

2026-11-06 06:33 GMT

వైఫై, ఎమోజీ, క్యూఆర్ కూడా ఇలా దైనందిత జీవితంలో ఉపయోగించే ఈ అద్భుత ఆవిష్కరణల వెనుక ఉన్న దేశాలేవో తెలుసా?

2026-11-06 06:30 GMT

సోషల్ మీడియా స్వేచ్ఛకు కొత్త సవాల్..

2026-11-06 05:47 GMT

సాధారణ ఉప్పుతో గుండెకు ముప్పు.. పొటాషియం ఉప్పుతో లక్షల ప్రాణాలకు రక్షణ!

2026-11-06 05:02 GMT

కేరళ నుంచి అమెరికా వరకు.. లాస్ ఏంజెలెస్ తొలి భారతీయ సంతతి మేయర్‌గా నిత్యా రామన్!

2026-11-06 04:57 GMT

అమెరికాలో డెమోక్రాట్ల విజయం.. భారతీయులకు H-1B, OPT వీసాల విషయంలో ఊరట లభిస్తుందా?

2026-11-06 04:57 GMT

లైఫ్‌లో సెటిల్ అవ్వడమే కాదు.. నచ్చినట్లు బతకడమే ముఖ్యం! జెన్ జీ కొత్త ట్రెండ్ ఇదే!

2026-11-06 04:19 GMT

డెమోక్రాట్లు గెలిచారు కదా.. ట్రంప్ ను దించేయవచ్చా?

2026-11-06 03:56 GMT

పట్టు సాధించిన కొణతాల...బెర్త్ కన్ఫర్మ్ ?

2026-11-06 03:50 GMT

వంగవీటి పట్టాభిషేకానికి మెగాస్టార్...బాలయ్య ?

2026-11-06 03:50 GMT

కూటమి పద్మవ్యూహంలో వైసీపీ విలవిల !

2026-11-06 03:49 GMT

చంద్రబాబు మీద కేసులు.... సీబీఐకి అప్పగించాలి !

2026-11-06 03:47 GMT

Copyright @2026

Powered by Blink CMS