• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  అక్టోబర్ 20 శనివారం ...

అక్టోబర్ 20 శనివారం 2018 దినఫలాలు

By - Tupaki Desk
Update: 2018-10-20 01:31 GMT
గమనిక:  ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి - గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు..
   
మేషరాశి: పనులు సామరస్యంగా పూర్తవుతాయి. శత్రువులపై విజయం.  ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.  నిరుద్యోగులు ఉద్యోగావకాశాలు దక్కించుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి చిక్కులు తొలుగుతాయి. వ్యాపారాల్లో లాభాలొస్తాయి. ఉద్యోగులకు విధి నిర్వహణలో ఉత్సాహంగా ఉంటుంది. పారిశ్రామిక వర్గాల వారికి విదేశీ పర్యటనలు. ఐటీ నిపుణులకు కార్యసాధనలో ముందడుగు. విద్యార్థులు కొత్త విద్యావకాశాలను సాధిస్తారు. మహిళలకు కుటుంబంలో ఆదరణ. గణపతిని పూజిస్తే మంచిది.

వృషభరాశి: ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. వ్యాపారాల్లో లాభాలు. ఉద్యోగులు పాత బకాయిలు అందుతాయి. పారిశ్రామిక వర్గాల వారికి నూతనోత్సాహం. ఐటీ నిపుణులు సత్తా చాటుతారు. విద్యార్థులకు పరిశోధనల్లో విజయం. మహిళలకు నూతనోత్సాహం. శివాష్టకం పఠిస్తే మంచిది.

మిథునరాశి: ఆలయాల సందర్శన, చిన్ననాటి మిత్రులను కలుస్తారు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి సమస్యలు పెరుగుతాయి. వ్యాపారులకు నష్టాలు. ఉద్యోగులకు ఒత్తిడి పెరుగుతుంది. పారిశ్రామిక - రాజకీయ వర్గాలకు విదేశీ పర్యటనల్లో ఆటంకాలు. ఐటీ నిపుణులకు కొంత నిరాశగానే ఉంటుంది. విద్యార్థులకు అనుకున్న ఫలితాలు రావు. విష్ణు ధ్యానం చేస్తే మంచిది.

కర్కాటకరాశి: పనుల్లో ఆటంకాలు. ఆదాయానికి మించి ఖర్చులు. ఆకస్మిక ప్రయాణాలు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి వివాదాలు. వ్యాపారాల్లో ఒడిదొడుకులు. ఉద్యోగులకు అదనపు భారం. పారిశ్రామిక వర్గాలకు గందరగోళ పరిస్థితి. ఐటీ నిపుణులకు శ్రమ తప్పదు. విద్యార్థులకు అధిక శ్రమతోనే విజయం. మహిళలకు ఆరోగ్య సమస్యలు. వేంకటేశ్వరస్వామిని పూజిస్తే మంచిది.

సింహరాశి: ఆప్తుల నుంచి కీలక సమాచారం. రియల్ ఎస్టేల్ రంగాల వారికి ఆస్తిలాభం. వ్యాపారాల్లో పెట్టుబడులు సమకూరుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. పారిశ్రామిక - రాజకీయ వర్గాలకు ఊహించని అవకాశాలు. ఐటీ నిపుణులు శ్రమ ఫలించి ముందడుగు వేస్తారు. విద్యార్థులకు కొత్త అవకాశాలతో ఉత్సాహంగా గడుపుతారు. మహిళలకు పరిస్థితులు అనుకూలిస్తాయి. అంగారక స్తోత్రం పఠిస్తే మంచిది.

కన్యరాశి:  ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. సన్నిహితుల నుంచి ఆహ్వానాలు. భూములు - వాహనాలు కొంటారు. రియల్ ఎస్టేట్ రంగాల వారు వివాదాల నుంచి బయటపడుతారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు. పారిశ్రామిక వర్గాలకు విదేశీ ఆహ్వానాలు. ఐటీ నిపుణులు లక్ష్యాల వైపు సాగుతారు. విద్యార్థులకు పురస్కారాలు. మహిళలకు సంతోషకరమై విషయాలు తెలుస్తాయి. సత్యనారాయణ స్వామిని పూజిస్తే మంచిది.

తులరాశి: ఆస్తి విసయాలు చికాకుపరుస్తాయి. ఆరోగ్యంలో చికాకులు. రియల్ ఎస్టేట్ వారికి పొరపాటు నిర్ణయాలతో నష్టం. వ్యాపారాలు మందగమనం. ఉద్యోగులకు స్థాన చలనం. పారిశ్రామిక వర్గాలకు నష్టాలు. ఐటీ నిపుణులకు శ్రమ ఫలించదు. విద్యార్థుల అంచనాలు తప్పుతాయి. మహిళలకు కుటుంబ సభ్యుల నుంచి విమర్శలు. శివస్త్రోత్రాలు పఠిస్తే మంచిది.

వృశ్చికరాశి: ఆర్థిక పరిస్థితి మందకొడి. ఆకస్మిక ప్రయాణాలు. శారీరక రుగ్మతలు. పనుల్లో ఆటంకాలు. రియల్ ఎస్టేట్ వారికి కలిసిరాదు. వ్యాపారులకు నష్టాలు. ఉద్యోగుల్లో పని ఒత్తిడి. పారిశ్రామిక - వైద్యరంగాల వారికి పర్యటనలు వాయిదా. ఐటీ నిపుణులకు మానసిక అశాంతి. విద్యార్థులకు కొన్ని అవకాశాలు నిరాశ కలిగిస్తాయి. మహిళలకు చికాకులు. హనుమాన్ చాలీసా పఠిస్తే మంచిది.

ధనుస్సురాశి: ఆర్థిక పరిస్థితి ఆశాజనకం. నిరుద్యోగులకు శుభవార్తలు. రియల్టర్లు, కాంట్రాక్టర్లు లాభాలు. వ్యాపార విస్తరణ యత్నాలు చేస్తే మంచిది. ఉద్యోగుల్లో ఊహించని అవకాశాలు. రాజకీయ వర్గాల వారు ఉత్సాహంగా ముందుకుసాగుతారు. ఐటీ నిపుణులకు అనుకున్న లక్ష్యాలు. విద్యార్థులకు కోరుకున్న అవకాశాలు దక్కుతాయి. మహిళలకు మానసిక ప్రశాంతత. వేంకటేశ్వరస్వామిని పూజిస్తే మంచిది.

మకరరాశి: దూర ప్రయాణాలు, పనులు ముందుకు సాగవు. ఆదాయానికి మించి ఖర్చులు. అంచనాలు తప్పి నిరాశ. రియల్ ఎస్టేట్ వారు ఆచితూచి సాగాలి. వ్యాపారాల్లో వెనుకబాటు. ఉద్యోగులకు స్థానచలనం. రాజకీయ వేత్తలు - కళాకారులకు చికాకులు. ఐటీ నిపుణులు కష్టపడ్డా ఫలితం కనిపించదు. విద్యార్థులకు ఫలితాలు అంతగా అనుకూలించవు. మహిళలు ఆందోళన చెందుతారు. శివాష్టకం పఠిస్తే మంచిది.

కుంభరాశి: ఆర్థిక పరిస్థితి ఆశాజనకం. ఆకస్మిక ధన, వస్తులాభాలు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. భాగస్వామ్య వ్యాపారాల్లో పురోగతి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు లభిస్తాయి. పారిశ్రామిక వర్గాలకు ఉత్సాహవంగా ఉంటుంది. ఐటీ నిపుణులకు విశేష గుర్తింపు. విద్యార్థులు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. మహిళలు కుటుంబ సభ్యుల నుంచి బయటపడుతారు. నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయండి.

మీనరాశి: శారీరక రుగ్మతలు. ఆదాయానికి మించి ఖర్చులు. ఇంటాబయటా ఇబ్బందులు. రియల్ ఎస్టేట్ ల వారు పట్టుదలతో సాగాలి. వ్యాపారాల్లో నష్టాలు. ఉద్యోగాలలో ఒడిదొడుకులు. పారిశ్రామిక వర్గాలకు నిరుత్సాహమే. ఐటీ నిపుణులు అనుకున్నది సాధించడంలో విఫలమవుతారు. విద్యార్థుల ప్రయత్నాలు ముందుకుసాగవు. మహిళలకు బాధ్యతలు పెరుగుతాయి.  విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.
Tags:    
  • Daily Rashi Phalalu 
  • Daily Horoscope 
  • Horoscope 
  • Rashi Phalalu 
  • Telugu NEws 

Similar News

బోస్టన్‌లో తెలుగు విద్యార్థిని అదృశ్యం.. 36 గంటలుగా జాడలేదు.. అసలేమైంది?

2026-11-06 06:33 GMT

వైఫై, ఎమోజీ, క్యూఆర్ కూడా ఇలా దైనందిత జీవితంలో ఉపయోగించే ఈ అద్భుత ఆవిష్కరణల వెనుక ఉన్న దేశాలేవో తెలుసా?

2026-11-06 06:30 GMT

సోషల్ మీడియా స్వేచ్ఛకు కొత్త సవాల్..

2026-11-06 05:47 GMT

సాధారణ ఉప్పుతో గుండెకు ముప్పు.. పొటాషియం ఉప్పుతో లక్షల ప్రాణాలకు రక్షణ!

2026-11-06 05:02 GMT

కేరళ నుంచి అమెరికా వరకు.. లాస్ ఏంజెలెస్ తొలి భారతీయ సంతతి మేయర్‌గా నిత్యా రామన్!

2026-11-06 04:57 GMT

అమెరికాలో డెమోక్రాట్ల విజయం.. భారతీయులకు H-1B, OPT వీసాల విషయంలో ఊరట లభిస్తుందా?

2026-11-06 04:57 GMT

లైఫ్‌లో సెటిల్ అవ్వడమే కాదు.. నచ్చినట్లు బతకడమే ముఖ్యం! జెన్ జీ కొత్త ట్రెండ్ ఇదే!

2026-11-06 04:19 GMT

డెమోక్రాట్లు గెలిచారు కదా.. ట్రంప్ ను దించేయవచ్చా?

2026-11-06 03:56 GMT

పట్టు సాధించిన కొణతాల...బెర్త్ కన్ఫర్మ్ ?

2026-11-06 03:50 GMT

వంగవీటి పట్టాభిషేకానికి మెగాస్టార్...బాలయ్య ?

2026-11-06 03:50 GMT

కూటమి పద్మవ్యూహంలో వైసీపీ విలవిల !

2026-11-06 03:49 GMT

చంద్రబాబు మీద కేసులు.... సీబీఐకి అప్పగించాలి !

2026-11-06 03:47 GMT

Copyright @2026

Powered by Blink CMS