• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  అక్టోబర్ 11 గురువారం 2018...

అక్టోబర్ 11 గురువారం 2018 దినఫలాలు

By - Tupaki Desk
Update: 2018-10-11 01:34 GMT
గమనిక:  ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి - గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు..
   
మేషరాశి: పూర్వ మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. ఆస్పత్రులు - ఔషధ రంగాల వారికి - వైద్యులకు అనుకూలం. చిట్ ఫండ్ లతో లాభం. ఆర్థికవిషయాలు సమీక్షించుకుంటారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.   మానసిక ప్రశాంతత తగ్గుతుంది. ప్రత్యర్థులను సానుకూలంగా మార్చుకుంటారు. ఎదుటివారితో జాగ్రత్త. డబ్బుకు సంబంధించిన విషయాల్లో అలక్ష్యం వహిస్తే ఆర్థికనష్టం.

వృషభరాశి: కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. నూతన భాగస్వామ్యాలకు అనుకూలం. వివాహ విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. పందాలు - పోటీల్లో విజయం సాధిస్తారు. పనుల్లో అసంతృప్తి. మీపై అపవాదులొస్తాయి. ఉద్యోగం ప్రతిభకు లోటు ఉండదు. ఇంటా - వ్యవహారంలో సామాన్యంగా పరిస్థితులుంటాయి.

మిథునరాశి: కొత్త వ్యూహాలతో వృత్తి - వ్యాపారాల్లో లక్ష్యాలు సాధిస్తారు. వైద్యం - పరిశ్రమలు - హోటల్ - కేటరింగ్ రంగాల వారికి ప్రోత్సాహకరం. ఆరోగ్యం మెరుగవుతుంది.  కుటుంబ సమస్యలు ఇబ్బంది పెడతాయి. దీంతో నీరసం - నిరాధారంగా - శక్తి లేనట్టుగా భావం వస్తుంది. గుండె - శ్వాసకు సంబంధించిన విషయాల్లో ఆరోగ్యభంగ సూచనలున్నాయి. స్నేహితులతో సత్సంబంధాలు.

కర్కాటకరాశి: చిట్ ఫండ్ లు - చిన్నమొత్తాల పొదుపు పథకాల గురించి ఆరాతీస్తారు. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవం. విద్యార్థులు పట్టుదలతో లక్ష్యాలు సాధిస్తారు. పరిస్థితులు ప్రశాంతంగా కనిపిస్తాయి. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి శ్రమ పడుతారు.

సింహరాశి: బదిలీలు - మార్పులకు సంబంధించిన సమాచారం లభిస్తుంది. బంధుమిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది.కాంట్రాక్టులు లాభిస్తాయి. గృహనిర్మాణం - స్థలసేకరణకు సంబంధించిన వివరాలు సేకరిస్తారు. ఈరోజు ఆర్థికంగా అభివృద్ధి కనపడుతుంది. ఆభరణాలను కొనుగోలు చేసే అవకాశం ఉంది.  మిమ్మల్ని నమ్మిన వారిని  - మీపై ఆధారపడిన వారిని చక్కగా చూసుకుంటారు. ప్రశాంతంగా కాలాన్ని గడుపుతారు. పాత మొండి బాకీలు - డబ్బు వసూలవుతాయి.

కన్యరాశి: ఆర్థికపరమైన చర్చలు - ప్రయాణాలు లాభిస్తాయి. కాంట్రాక్టులు - అగ్రిమెంట్లకు అనుకూలం. ముఖ్యమైన మెసేజ్ లు - మెయిల్స్ అందుకుంటారు. కమ్యూనికేషన్లు - బోధన రంగాల వారికి అదనపు ఆదాయం. డబ్బుల ఖర్చు పెరుగుతుంది. అనవసరమైన విరోధాలు ఏర్పడే అవకాశం ఉంది.

తులరాశి: వ్యక్తిగత సౌకర్యాల కోసం ఖర్చు చేస్తారు. ఆదాయం పెంపొందించుకోవడంపై నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక లావాదేవీలకు అనుకూలం. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరం. డబ్బుకు సంబంధించిన విషయాల్లో ఎవ్వరిని నమ్మవద్దు. 

వృశ్చికరాశి: హాస్టళ్లు - ఆధ్యాత్మిక కేంద్రాల సందర్శన - విహార యాత్రలు మనసుకు ఉల్లాసం కలిగిస్తాయి. ఉన్నత విద్య - విదేశీ వ్యవహారాలకు సంబంధించి స్పష్టమైన నిర్ణయాలు తీసుకుంటారు. రహస్య సమాచారం తెలుసుకుంటారు. ఆర్థికపరమైన లాభాలుంటాయి. ఇల్లు మార్పు సూచనలు. ప్రయాణాలకు అనుకూలం. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. కుటుంబం విషయంలో అశాంతి నెలకొంటుంది.

ధనుస్సురాశి: సినిమా - టెలివిజన్ - వినోద రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సహకరం. మిత్రుల అంతరంగిక విషయంలో జోక్యం చేసుకుంటారు. బంధుమిత్రులకు సంబంధించిన సమాచారం అందుకుంటారు.  పాత పగలు మర్చిపోతారు. వ్యాపారాలు మధ్యస్తంగా సాగుతాయి. మాటపై నిలబడి వ్యవహారం ఉంటుంది. ఇతరుల వ్యవహారంలో జోక్యం చేసుకోకూడదు.

మకరరాశి: బృంద కార్యక్రమాల్లో మీ మాట చెల్లుబాటవుతుంది. సమావేశాల్లో పెద్దల సహకారం లభిస్తుంది. సహకార సంఘాల్లో కీలక పదవులు అందుకుంటారు. ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరం. నమ్మిన వారితో చేదు అనుభవాలు. పనుల్లో ఏకాగ్రతతో శుభఫలితాలు. నూతన కాంట్రాక్ట్ పనులు లభిస్తాయి. అప్పుల్లో కొంత వసూలవుతాయి.

కుంభరాశి: ప్రభుత్వ - కీలక పదవుల్లో ఉన్న వ్యక్తులు లక్ష్యాలు సాధిస్తారు. ఉన్నత పదవులు అందుకుంటారు. లక్ష్యసాధనకు వ్యూహాత్మకంగా ప్రయత్నించి విజయం సాధిస్తారు. పనుల్లో లోతైన అధ్యయనం అవసరం. ఆధ్యాత్మికత పెరుగుతుంది. అశుభవార్తలు వింటారు. కొంత ప్రతికూలత ఎదురవుతుంది. చేసే పనుల్లో జాప్యంతో మాట పడుతారు.

మీనరాశి: ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు. సమావేశాలు - వేడుకలకు అవసరమైన నిధులు చేతికి అందుతాయి. సమావేశాలు - ప్రయాణాలకు అనుకూలం. ఆర్థిక పరిస్థితిని - పెట్టుబడులను సమీక్షించుకుంటారు. అవివాహితులకు కుటుంబంలో వివాహ ప్రస్తావనలుంటాయి. పెద్దల నిర్ణయంతో శుభం కలుగుతుంది. సామాజిక ధార్మిక కార్యక్రమాలపై ఆసక్తి.
   

Tags:    
  • Daily Rashi Phalalu 
  • Daily Horoscope 
  • Horoscope 
  • Rashi Phalalu 
  • Telugu NEws 

Similar News

రోజంతా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూస్తే జీతం ఇచ్చేస్తారంట..!

2026-11-06 01:50 GMT

ఆ రెండు జెడ్పీల మీదనే హాట్ డిస్కషన్ !

2026-11-06 01:50 GMT

విజయ్ జగన్ కేటీఆర్...ఒకే ఫ్రేమ్‌ లో !

2026-11-06 01:43 GMT

ఆధార్ ప్లేసులో ఓటర్ ఐడీ.. కేంద్రం మరో దుమారం?

2026-11-05 16:15 GMT

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఏపీ ఎన్నిక‌ల్లో ఒక విషాదం.. మ‌రిన్ని చిత్ర విచిత్రాలు!

2026-11-05 16:12 GMT

'దేశ ద్రోహం': మోడీ రేపిన 'రాహుల్ మంట‌లు'!

2026-11-05 16:11 GMT

చెవిరెడ్డ‌న్నా.. గొడ‌వ‌లు వ‌ద్దు.. టీడీపీ నేత బిగ్ ఆఫ‌ర్‌!

2026-11-05 16:09 GMT

అనంత‌లో తేడా ఎక్క‌డ కొట్టింది.. బాబు ఆరా.. !

2026-11-05 13:30 GMT

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

Copyright @2026

Powered by Blink CMS