• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  సెప్టెంబర్ 14 శుక్రవారం...

సెప్టెంబర్ 14 శుక్రవారం 2018 దినఫలాలు

By - Tupaki Desk
Update: 2018-09-14 02:23 GMT
గమనిక:  ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి - గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు..
   
మేషరాశి:  కొబ్బరి - పండ్లు - పూలు - కూరగాయలు - చిరు  వ్యాపారులకు పురోభివృద్ధి - సాయానికి పోయి సమస్యలు తెచ్చుకోకండి. స్త్రీల ప్రతిభకు - పనితనానికి గుర్తింపు లభిస్తుంది. వివిధ రంగాల్లో రాణిస్తారు. వాహనం నడుపుతున్నడు జాగ్రత్త అవసరం. సాంఘిక - సాంస్కృతిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.

వృషభరాశి: ఉద్యోగస్థులు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో అనురాగం - ఆప్యాయతలు పెరుగుతాయి. ఆర్థిక విషయాల్లో ఒక అడుగు ముందుకువేస్తారు. సమయానికి సహకరించని వ్యక్తుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ రోజు బంధుమిత్రులతో కలిసి విందు - వినోదాల్లో పాల్గొంటారు.

మిథునరాశి:  చేతి వృత్తుల వారికి అననుకూల వాతావరణం ఉంటుంది. పాత మిత్రుల కలయికతో గత అనుభవాలు జ్ఞప్తికి వస్తాయి. ఏ విషయంలోనూ ఎదుటివారిని అతిగా విశ్వసించడం అంత మంచిది కాదు. మిమ్మల్ని పొగిడే వారి పట్ల అప్రమత్తత అవసరం. ఈరోజు రాజకీయ నాయకులు తరచూ సభ - సమావేశాల్లో పాల్గొంటారు.

కర్కాటక రాశి: ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. దంపతుల మధ్య చికాకులు - అభిప్రాయ బేధాలు కలుగుతాయి. మీ ఉన్నతి చాటడానికి ధనం బాగా ఖర్చు చేస్తారు. దైవ సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఈరోజు సంతానంతో ఉల్లాసంగాను - ఉత్సాహంగాను గడుపుతారు.

సింహరాశి:  కంప్యూటర్ రంగంలోని వారికి అభివృద్ధి కానవస్తుంది. సోదరీ - సోదరుల మధ్య తగాదాలు రావచ్చు. దూర ప్రయాణాలతో వస్తువుల పట్ల మెళకువ అవసరం.  ఈరోజు నిరుద్యోగులు భేషజాలకు పోకుండా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం మంచిది. స్త్రీలకు చుట్టుపక్కల వారితో సఖ్యత లోపిస్తుంది.

కన్యరాశి: అదనపు రాబడి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మిత్రులతో కలిసి వేడుకల్లో పాల్గొంటారు. కార్యసాధనలో ఓర్పు - పట్టుదల ముఖ్యం. దేనియందు ఏకాగ్రత అంతగా ఉండదు. స్త్రీలకు పనివాళ్లతో ఒత్తిడి - చికాకులు ఎదుర్కొంటారు. ఈరోజు ఆర్థిక అవసరాలు ఖర్చులు పెరగడంతో అదనపు ఆదాయం కోసం శ్రమిస్తారు.

తులరాశి:  మత్స్య కోళ్ల వ్యాపారస్తులకు లాభదాయకం. మీ వాహనం - విలువైన వస్తువుల విషయంలో మెళకువ అవసరం. ఒక దైవ కార్యం ఘనంగా చేయాలని తలుస్తారు. మీ మాటకు అన్ని చోట్ల మంచి స్పందన వస్తుంది. ఈరోజు ఆర్థిక లావాదేవీలు - అనుకున్న పనులు ప్రశాంతంగా సాగుతాయి.

వృశ్చిక రాశి: వీలైనంత వరకూ మితంగా సంభాషించండి. స్త్రీలకు ఆరోగ్యంలో తగు జాగ్రత్తలు అవసరం. నిరుద్యోగులు వచ్చిన తాత్కాలిక అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ఉత్తమం. నూతన పెట్టుబడులు - స్థిరాస్తి క్రయవిక్రయాల కోసం మరికొంత కాలం ఆగడం మంచిది. ఈరోజు బంధుమిత్రులతో సఖ్యత నెలకొంటుంది.

ధనురాశి: వేతనం తక్కువైనా వచ్చిన అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవడం శ్రేయస్కరం. రుణాలు తీరుస్తారు. మీ కదలికలపై నిఘా ఉందన్న విషయాన్ని గమనించండి.  ప్రతి విషయం మీ జీవిత భాగస్వామికి తెలియజేయడం మంచిది. ఈరోజు ఆర్థిక లావాదేవీలు - ఉమ్మడి వ్యవహారాలు సమర్థంగా నిర్వహిస్తారు.

మకరరాశి: ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. రాజకీయ నాయకులు సభాసమావేశాల్లో పాల్గొంటారు. దైవ - పుణ్య కార్యాల్లో పాల్గొంటారు. ఒక వ్యవహారం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేయాల్సి వస్తుంది.ఉద్యోగుల విశ్రాంతి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈరోజు మీ అభిప్రాయాలకు మంచి స్పందన వస్తుంది.

కుంభరాశి: సొంత నిర్ణయాల వల్ల కలహాలు, చికాకులు తప్పవు. పెద్దల ఆరోగ్యంలో మెళకువల అవసరం. విలువైన వస్తువులు - వస్త్రాలు కొనుగోలు చేస్తారు. స్త్రీలకు పొరుగువారి నుంచి ఆహ్వానాలు అందుతాయి. విద్యార్థులు ఉన్నత విద్యల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈరోజు సన్నిహితుల నుంచి అందే సలహా - హితవులు మీపై బాగా పనిచేస్తాయి.

మీనరాశి:  దంపతుల మధ్య కలహాలు తలెత్తే అవకాశాలున్నాయి. కొన్ని విషయాలు అంతగా పట్టించుకోవడం మంచిది కాదు. ఫ్యాన్సీ - పచారి - మందుల వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ట్రాన్స్ పోర్ట్ - ట్రావెలింగ్ రంగాల వారికి పురోభివృద్ధి. ఈరోజు బంధువుల వైకరి నిరుత్సాహపరుస్తుంది. విద్యార్థులు క్రీడా రంగాల్లో బాగా రాణిస్తారు.
Tags:    
  • Daily Rashi Phalalu 
  • Daily Horoscope 
  • Horoscope 
  • Rashi Phalalu 
  • Telugu NEws 

Similar News

రేవంత్ బయటపెట్టిన ‘ది గ్రేట్ ఫైనాన్షియల్’ మార్వలస్ ఐడియా

2026-11-04 13:15 GMT

రేవంత్ గెలవడని కేటీఆర్ డిసైడ్.. ఆ భూములు కొనొద్దని పారిశ్రామికవేత్తలకు హెచ్చరిక

2026-11-04 13:10 GMT

పాపం ష‌ర్మిల‌.. ఇంత హ‌ర్ట్ అవుతార‌నుకోలేదా ..?

2026-11-04 13:01 GMT

మాజీ ఐపీఎస్‌.. ఓట‌మి స్ఫూర్తి.. !

2026-11-04 13:00 GMT

నాన్న‌గారి ఆశ‌యాలు నెర‌వేరుస్తా: రాధా ఫ‌స్ట్ స్పీచ్‌

2026-11-04 13:00 GMT

నియంతలు ట్రంప్, నెతన్యాహు ఔట్ అట.. ‘సీజేపీ‘ నేతలు హ్యాపీ.. టార్గెట్ మోడీయేనా?

2026-11-04 12:57 GMT

ఓటువేయలేదుగా.. నా డబ్బులు నాకివ్వండి.. వైసీపీ అభ్యర్థి 'రివర్స్ వసూళ్లు' వైరల్

2026-11-04 11:17 GMT

భారతీయులతో పెట్టుకున్నాడు.. ట్రంప్ అనుభవిస్తున్నాడు..

2026-11-04 10:57 GMT

టికెట్ ధ‌ర‌ల‌పై CM విజ‌య్ ముందు చూపు మనవాళ్ల‌కు ఏదీ?

2026-11-04 09:39 GMT

ఏపీలో మ‌రో ఎన్నిక‌ల పోరు..!

2026-11-04 09:22 GMT

రాప్తాడు నిందితుడిపై కాల్పుల కేసులో కీలక పరిణామం

2026-11-04 09:14 GMT

ఎలా గెలవాలో చెప్పారు...జగన్ కంగ్రాట్స్ !

2026-11-04 09:06 GMT

Copyright @2026

Powered by Blink CMS