• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  సెప్టెంబర్ 13 గురువారం...

సెప్టెంబర్ 13 గురువారం 2018 దినఫలాలు

By - Tupaki Desk
Update: 2018-09-13 01:37 GMT
గమనిక:  ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి - గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు..
   
మేషరాశి:   శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. పన్నులు - బీమా వ్యవహారాలు లాభిస్తాయి. విందులు - వినోదాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం - యోగ - ఆహార విషయాల పట్ల జాగ్రత్త. సన్నిహితుల విషయాలపై మనసు పెట్టండి. డబ్బులు చేతికి అందుతాయి. కుటుంబ సభ్యుల కోరికలు తీరుస్తారు. చేపట్టిన పనులు సాగవు. వృత్తి - వ్యాపారులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది.

వృషభరాశి: న్యాయ - బోధన - బ్యాంకింగ్ రంగాల వారు నిదానం పాటించాలి. శుభకార్యాల్లో పాల్గొంటారు. పందేలు - పెట్టుబడులు - పోటీలు లాభంగా మారుతాయి.శుభకార్యాల్లో పాల్గొంటారు. ఉద్యోగంలో ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. జీవిత భాగస్వామి సహకారం లభిస్తుంది. మత్స్య, కోళ్ల వ్యాపారస్థులకు లాభదాయకం. ఉద్యోగులు విశ్రాంతి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. స్త్రీలు విలువైన వస్తువులు అమర్చుకుంటారు.

మిథునరాశి: వ్యవసాయం - పరిశ్రమల రంగాల వారికి నిరాశ తప్పకపోవచ్చు. వృత్తి  - వ్యాపారాల్లో దీర్ఘకాలంగా వాయిదా పడుతున్న పనులు కొలిక్కి వస్తాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపుతారు. విందు - వినోదాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రయాణాల్లో జాగ్రత్త. వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి. రుణాలు తీరుస్తారు.

కర్కాటక రాశి: పెట్టుబడులకు సంబంధించిన వివరాలు సేకరిస్తారు. ఖర్చులు అధికమవుతాయి. సంతతి విషయంలో శుభపరిణామాలు కలుగుతాయి. కుటుంబంతో ఉల్లాసంగా గడుపుతారు. డబ్బు - లావాదేవీల్లో బిజీ అవుతారు. సమయానుకూలంగా భోజనం తినడం మంచిది. స్త్రీలు విశ్రాంతి ప్రయత్నాలు ఫలించవు. బంధువుల ఆకస్మిక రాకతో గృహంలో ఖర్చులు పెరుగుతాయి.

సింహరాశి: కుటుంబ సభ్యుల సహకారంతో ఆర్థికపరమైన లక్ష్యాలు సాధిస్తారు. ఆర్థిక విషయాల్లో సమీక్ష అవసరం. రియల్ ఎస్టేట్ రంగంలోని వారు ఆర్థిక విషయాల్లో నిదానం పాటించాలి. గృహనిర్మాణం - స్థల సేకరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉల్లి - బెల్లం - పసుపు - కంది - మిర్చి వ్యాపారులకు కలిసి వస్తుంది. అతి చనువు మంచిది కాదు. పాత స్నేహాలకు సంబంధించి కొన్ని విషయాలు గుర్తువస్తాయి.

కన్యారాశి: కాంట్రాక్టులు - అగ్రిమెంట్లు - మార్కెటింగ్ - వ్యవహారాలపై స్పష్టమైన నిర్ణయానికి వస్తారు. విద్యార్థులకు మంచి రోజు. కీలక సమాచారం అందుకుంటారు. వాహనాల కొనుగోలుకు అనుకూలం. ప్రతిభతో పనులు  చేసి విజయాన్ని అందుకుంటారు.కొత్త పరిచయాలు - అలవాట్లు అధికమవుతాయి. కొబ్బరి - పండ్లు - పూల వ్యాపారులకు లాభదాయకం. వాహనం నడిపినప్పుడు జాగ్రత్తలు అవసరం. అన్నింటిలో పట్టుదలతో సాధిస్తారు.

తులారాశి: సినీ - రాజకీయ - బోధన రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా  ఉంటుంది. నిధులకు సంబంధించి వివరాలు సేకరిస్తారు. ఆర్థిక విషయాల్లో అల్లకల్లోలంగా ఉంటుంది. దీర్ఘకాలిక పెట్టుబడులపై దృష్టిపెడతారు. ఎవరినీ గుడ్డిగా నమ్మడం మంచిది కాదు.ఉమ్మడి - సొంత వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి.

వృశ్చికరాశి: ఆర్థిక సంస్థలతో పనులకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. పెట్టుబడులకు సంబంధించి స్పష్టమైన నిర్ణయానికి వస్తారు. బృంద కార్యక్రమాలకు ఏర్పాట్లు చేస్తారు. మానసిక శారీరక ఒత్తిడిలు ఉంటాయి. విదేశీ వస్తువులు సేకరిస్తారు. తొందరపాటుతో మాటలు పడాల్సి వస్తుంది. ఆత్మీయులను కలుసుకుంటారు.

ధనురాశి:   ఆధ్యాత్మిక - సేవా రంగాల్లో మీ కృషికి ప్రశంసలు లభిస్తాయి. టెక్స్ టైల్ - గ్రానైట్స్ - సినీ - రాజకీయ రంగాలకు చెందిన వారు గౌరవ - మన్ననలు అందుకుంటారు. ఒక సమాచారం కలవరపెడుతుంది. ప్రముఖులతో సమాలోచనలు చేస్తారు. వ్యాపారాల్లో అనుకూలతలు కనపడుతాయి. కుటుంబంలో అనురాగం - అప్యాయతలు పెరుగుతాయి. ప్రేమకుల ఆలోచన పెడదోవకు దారితీస్తుంది.

మకరరాశి: ఆడిటింగ్ - అడ్వటైజ్ మెంట్ రంగాల వారికి ప్రోత్సాహకరం. స్నేహ బంధాలు బలపడతాయి. ఆర్థిక విషయాల్లో వ్యూహాలు ఫలించకపోవచ్చు. సమావేశాలు - బృంద కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషిస్తారు. ప్రదర్శనల్లో పాల్గొంటారు. మంచి కాంట్రాక్ట్ లభిస్తుంది. తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా నెమ్మదిగా సమసిపోగలవు. సంతానానికి వివాహ విషయాల పట్ల శ్రద్ధ వహిస్తారు. ఫ్యాన్సీ - కిరాణ రంగాల్లో వారికి అనుకూలంగా ఉంది.

కుంభరాశి: వృత్తి వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. మెడికల్ క్లైములు మంజూరవుతాయి. పెద్దల ఆరోగ్యంపై ఆందోళన  కలిగిస్తుంది. ఖర్చులు అధికమవుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు. సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది.

మీనరాశి: రక్షణ - బోధన రంగాల వారికి కొంత నిరుత్సాహకరంగా ఉంటుంది.  కోర్టు వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. సమావేశాల్లో ప్రముఖులను కలుసుకుంటారు. భాగస్వామి వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది. వేడుకలు చేస్తారు. ఇతరులతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. జీవిత భాగస్వామితో సఖ్యత అవసరం. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయకూడదు. ఒక ప్రణాళికతో వ్యవహరించండి. 
Tags:    
  • Daily Rashi Phalalu 
  • Daily Horoscope 
  • Horoscope 
  • Rashi Phalalu 
  • Telugu NEws 

Similar News

రేవంత్ బయటపెట్టిన ‘ది గ్రేట్ ఫైనాన్షియల్’ మార్వలస్ ఐడియా

2026-11-04 13:15 GMT

రేవంత్ గెలవడని కేటీఆర్ డిసైడ్.. ఆ భూములు కొనొద్దని పారిశ్రామికవేత్తలకు హెచ్చరిక

2026-11-04 13:10 GMT

పాపం ష‌ర్మిల‌.. ఇంత హ‌ర్ట్ అవుతార‌నుకోలేదా ..?

2026-11-04 13:01 GMT

మాజీ ఐపీఎస్‌.. ఓట‌మి స్ఫూర్తి.. !

2026-11-04 13:00 GMT

నాన్న‌గారి ఆశ‌యాలు నెర‌వేరుస్తా: రాధా ఫ‌స్ట్ స్పీచ్‌

2026-11-04 13:00 GMT

నియంతలు ట్రంప్, నెతన్యాహు ఔట్ అట.. ‘సీజేపీ‘ నేతలు హ్యాపీ.. టార్గెట్ మోడీయేనా?

2026-11-04 12:57 GMT

ఓటువేయలేదుగా.. నా డబ్బులు నాకివ్వండి.. వైసీపీ అభ్యర్థి 'రివర్స్ వసూళ్లు' వైరల్

2026-11-04 11:17 GMT

భారతీయులతో పెట్టుకున్నాడు.. ట్రంప్ అనుభవిస్తున్నాడు..

2026-11-04 10:57 GMT

టికెట్ ధ‌ర‌ల‌పై CM విజ‌య్ ముందు చూపు మనవాళ్ల‌కు ఏదీ?

2026-11-04 09:39 GMT

ఏపీలో మ‌రో ఎన్నిక‌ల పోరు..!

2026-11-04 09:22 GMT

రాప్తాడు నిందితుడిపై కాల్పుల కేసులో కీలక పరిణామం

2026-11-04 09:14 GMT

ఎలా గెలవాలో చెప్పారు...జగన్ కంగ్రాట్స్ !

2026-11-04 09:06 GMT

Copyright @2026

Powered by Blink CMS