• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  సెప్టెంబర్ 12 బుధవారం...

సెప్టెంబర్ 12 బుధవారం 2018 దినఫలాలు

By - Tupaki Desk
Update: 2018-09-12 01:37 GMT
గమనిక:  ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి - గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు..
   
మేషరాశి:  జనసంబంధాలు విస్తరిస్తాయి. స్నేహానుబంధాలు బలపడతాయి. విందుల్లో కొంచెం పరిమితి అవసరం. భాగస్వామి సహకారంతో వృత్తిపరమైన లక్ష్యాలు సాధిస్తారు. కొత్త అనుబంధాలు ఏర్పడుతాయి. రుణ ప్రయత్నాల్లో ఆటంకాలు కలుగుతాయి. గృహ మరమ్మతులు వాయిదా పడతాయి. పరిచయాలు బలపడతాయి. విద్యార్థినులు ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్త పాటించండి. ప్రయాణాల్లో వస్తువుల పట్ల మెళకువ అవసరం.

వృషభరాశి:  వృత్తి - వ్యాపారాల్లో సృజనాత్మకంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. సహోద్యోగులతో విందు - వినోదాల్లో పాల్గొంటారు. ప్రియమైన వారి ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. కొబ్బరి - పండ్లు పూలు - చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. వైద్యులకు శస్త్రచికిత్స చేయునప్పుడు మెళకువ అవసరం. కపటం లేని మీ ఆలోచనలు - సలహాలు మీకు అభిమానులను పెంచుతాయి.

మిథునరాశి: సంతానం విషయంలో శుభ పరిణామాలు కలుగుతాయి. పొదుపు పథకాలు - చిట్ ఫండ్ లు అనుకూలం. మనసు ఉల్లాసంగా ఉంటుంది. చిన్నారులు - ప్రియమైన వారి కలయిక ఆనందం వెల్లివిరుస్తుంది. చేసే పనుల్లో ఓర్పు - పట్టుదల అవసరం. ఆలయాలను సందర్శిస్తారు. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి గుర్తింపు. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సత్ఫలితాలిస్తాయి. నూతన వ్యాపారులకు పెట్టుబడుల సమస్య ఎదుర్కొంటారు. ఆపద సమయంలో మిత్రులు అండగా నిలుస్తారు.

కర్కటకరాశి: బదిలీలు - మార్పులకు అనుకూలం. ఇంటికి అవసరమైన వస్తువులు రవాణా అవుతాయి. విద్యాసంస్తల్లో ప్రవేశం లభిస్తుంది. ఒక సమాచారం బాధ కలిగిస్తుంది. రియల్ ఎస్టేట్ - నిర్మాణ రంగాల వారు కీలక సమాచారం అందుకుంటారు. ప్రేమికుల మధ్య వాత్సల్యం చిగురిస్తుంది. దానధర్మాలతో కీర్తి వస్తుంది. అసూయపడే వారి సంఖ్య పెరుగుతుంది. స్త్రీల ఏమరపాటుతో నష్టం వాటిల్లుతుంది.

సింహరాశి: బోధన - రవాణా - స్టేషనరీ - కమ్యూనికేషన్ల రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరం. సోదరీ - సోదరీమణులతో ఆర్థికపరమైన లక్ష్యాలు సాధిస్తారు. ప్రయాణాలకు నిధులు సర్దుబాటవుతాయి. ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి. లాయర్లకు చికాకులు తప్పవు. స్త్రీలకు చుట్టుపక్కల వారితో విభేదాలు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. అనుకున్న పనులతో ఆటంకాలు ఎదురైనా మొండి ధైర్యంతో ముందుకుసాగి పూర్తిచేస్తారు. సోదరులకు మీ వంతు సహాయ సహకారాలు లభిస్తాయి.

కన్యారాశి: అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. విలువైన వస్తువులు కొనుగోలు సమయంలో నాణ్యత గమనించాలి. పెట్టుబడులపై దృష్టిసారిస్తారు. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఒడిదుడుకులు అధిగమిస్తారు. రుణాలు - పెట్టుబడుల కోసం ప్రయత్నిస్తారు. ఇతరుల వ్యవహారాలతో సమస్యలు వస్తాయి.  ఏకాగ్రత లోపంతో పనుల్లో చికాకులు వస్తాయి.

తులారాశి: సినీ - రాజకీయ రంగాల వారికి అనుకూలం. కొత్త ప్రాజెక్టుల ప్రారంభానికి తొందర తగదు. స్తబ్దత తొలిగిపొయి ఉత్సాహం నెలకొంటుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. కొంత పొదుపు చేయాలన్న లక్ష్యం నెరవేరదు. హోటల్ - తినుబండారాల వ్యాపారస్థులకు లాభదాయకం. స్త్రీలు టీవీ - చానెల్స్ కార్యక్రమాల్లో రాణిస్తారు. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు.

వృశ్చిక రాశి: సినీ రాజకీయ రంగాల వారు ఆర్థిక విషయాల్లో నిదానం పాటించాలి. దీర్ఘకాలిక పెట్టుబడులకు అనుకూలం. ఆడిటింగ్ - బ్యాంకింగ్ రంగాల వారికి ప్రోత్సాహకరం. అధికారులకు పర్యటనలు - తనిఖీలు అధికమవుతాయి. వ్యాపార రంగాల వారి అంచనాలు తలకిందులవుతాయి. మిత్రుల సలహాలు ఫలిస్తాయి. ఓర్పు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు.

ధనురాశి: వృత్తి - వ్యాపారాల్లో ఆర్థికంగా ప్రోత్సహకరం.బృంద కార్యక్రమాల్లో ప్రముఖులను కలుసుకుంటారు. సంకల్ప సిద్దికి అధికంగా శ్రమించాలి. ఆర్థిక విషయాల్లో పెద్దల సహకారం లభిస్తుంది. సమావేశాల్లో గౌరవ - మన్ననలు అందుకుంటారు. ఈరోజు కళ - శాస్త్ర రంగాల వారికి గుర్తింపు. ప్రోత్సాహం లభిస్తాయి. స్త్రీలకు సంపాదన పై ఆసక్తి పెరుగుతుంది. కొబ్బరి - పండ్లు - పూల వ్యాపారులకు లాభదాయకం. భాగస్వామిక వ్యాపారాలు విడిపోతాయి. చేయని ప్రయత్నాల్లో ప్రతిఫలం ఆశించకండి..
 
మకరరాశి: వృత్తి - వ్యాపారాల్లో ప్రణాళికబద్దంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. ఆర్థిక విషయాల్లో లక్ష్యసాధనకు పెద్దల సహకారం లభిస్తుంది. సమావేశాల్లో గౌరవ - మన్ననలు అందుకుంటారు. ఆదాయానికి తగ్గట్టు ఖర్చులు సిద్ధమవుతాయి. నూనె - మిర్చి - మినుము వ్యాపారస్థులకు స్టాకిస్టులకు అభివృద్ధి కానవస్తుంది. ఒక సమావేశానికి సంబంధించి ముఖ్యమైన సమాచారం అందుకుంటారు. పాత సమస్యలు పరిష్కరిస్తారు.

కుంభరాశి: రక్షణ - న్యాయ - బోధన రంగాల వారికి నిధులు సర్ధుబాటవుతాయి. పెట్టుబడులకు సంబంధించిన పత్రాలు అందుకుంటారు. ఆర్థిక వ్యూహాలు ఫలిస్తాయి. ఉద్యోగ - వృత్తుల వారికి ఆశించిన పురోభివృద్ధి ఉండదు. జీవిత భాగస్వామి తీరు చికాకు కలిగిస్తుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్థులకు నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. బ్యాంకింగ్  - ఫైనాన్స్ చిట్స్ రంగాల వారికి ఒత్తిడి - పనిభారం అధికమవుతుంది. స్థిరాస్తి కొనుగోళ్లు వాయిదా పడతాయి.

మీనరాశి: బీమా - గ్రాట్యూటీ - పన్నుల వ్యవహారాలు పూర్తి చేస్తారు. భాగస్వామి కోసం విలువైన వస్తువులు సమకూర్చుకుంటారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. నోటి దురుసుతో చికాకులు. బంధువులను కలుసుకుంటారు. కోర్టు వ్యాజ్యాలు - వివాదాలు కొలిక్కి వస్తాయి. ఎదుటి వారి విషయాలకు దూరంగా ఉండండి. కావలసిన ధనం సర్ధుబాటవుతుంది.
Tags:    
  • Daily Rashi Phalalu 
  • Daily Horoscope 
  • Horoscope 
  • Rashi Phalalu 
  • Telugu NEws 

Similar News

రేవంత్ బయటపెట్టిన ‘ది గ్రేట్ ఫైనాన్షియల్’ మార్వలస్ ఐడియా

2026-11-04 13:15 GMT

రేవంత్ గెలవడని కేటీఆర్ డిసైడ్.. ఆ భూములు కొనొద్దని పారిశ్రామికవేత్తలకు హెచ్చరిక

2026-11-04 13:10 GMT

పాపం ష‌ర్మిల‌.. ఇంత హ‌ర్ట్ అవుతార‌నుకోలేదా ..?

2026-11-04 13:01 GMT

మాజీ ఐపీఎస్‌.. ఓట‌మి స్ఫూర్తి.. !

2026-11-04 13:00 GMT

నాన్న‌గారి ఆశ‌యాలు నెర‌వేరుస్తా: రాధా ఫ‌స్ట్ స్పీచ్‌

2026-11-04 13:00 GMT

నియంతలు ట్రంప్, నెతన్యాహు ఔట్ అట.. ‘సీజేపీ‘ నేతలు హ్యాపీ.. టార్గెట్ మోడీయేనా?

2026-11-04 12:57 GMT

ఓటువేయలేదుగా.. నా డబ్బులు నాకివ్వండి.. వైసీపీ అభ్యర్థి 'రివర్స్ వసూళ్లు' వైరల్

2026-11-04 11:17 GMT

భారతీయులతో పెట్టుకున్నాడు.. ట్రంప్ అనుభవిస్తున్నాడు..

2026-11-04 10:57 GMT

టికెట్ ధ‌ర‌ల‌పై CM విజ‌య్ ముందు చూపు మనవాళ్ల‌కు ఏదీ?

2026-11-04 09:39 GMT

ఏపీలో మ‌రో ఎన్నిక‌ల పోరు..!

2026-11-04 09:22 GMT

రాప్తాడు నిందితుడిపై కాల్పుల కేసులో కీలక పరిణామం

2026-11-04 09:14 GMT

ఎలా గెలవాలో చెప్పారు...జగన్ కంగ్రాట్స్ !

2026-11-04 09:06 GMT

Copyright @2026

Powered by Blink CMS