• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  సెప్టెంబర్ 10 సోమవారం...

సెప్టెంబర్ 10 సోమవారం 2018 దినఫలాలు

By - Tupaki Desk
Update: 2018-09-10 01:36 GMT
గమనిక:  ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి - గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు..
  
మేషరాశి:  వ్యవసాయం - ఆస్పత్రులు - పరిశ్రమలు - హోటల్ - కేటరింగ్ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. సహోద్యోగుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. విందు - వినోదాల్లో పాల్గొంటారు. రావాలసిన డబ్బులు చేతికి అందుతాయి. కుటుంబ సభ్యుల కోరిక తీరుస్తారు. వృత్తి వ్యాపారులకు అన్ని విధాలా అనుకూలం.

వృషభరాశి: పొదుపు పథకాల గురించి ఆరాతీస్తారు.  ప్రేమానుబంధాలు బలపడతాయి. ప్రియమైన వారు - చిన్నారుల వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది. షాపింగ్ కు అనుకూలం. వేడుకల్లో పాల్గొంటారు. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. మత్స్య, కోళ్ల వ్యాపారుస్థులకు లాభదాయకం. స్త్రీలు విలువైన వస్తువులు అమర్చుకుంటారు.

మిథునరాశి: మాతృ వర్గీయులకు సంబంధించిన వ్యవహారాలపై దృష్టి పెడతారు. రియల్ ఎస్టేట్ - నిర్మాణ రంగాల వారికి ప్రోత్సాహకరం. బదిలీలు - మార్పుల గురించి ఆలోచిస్తారు. ప్రయాణాల్లో కాస్త జాగ్రత్త. వ్యాపారినికి సంబంధించిన ప్రయత్నాలు ఫలిస్తాయి. రుణం తీర్చి తాకట్టు వస్తువులు విడిపించుకుంటారు.

కర్కాటక రాశి: వాహనాలు కొనుగోలు చేస్తారు. ప్రయాణాలతో ఉల్లాసం. చర్చలు - సమావేశాల్లో లక్ష్యాలు సాధిస్తారు. సన్నిహితుల నుంచి ముఖ్యమైన మెయిల్స్ - ఫోన్లు సందేశాలు అందుకుంటారు. భోజనం సకాలంలో తింటే మేలు. స్త్రీలు విశ్రాంతి ప్రయత్నాలు ఫలించవు. బంధువుల ఆకస్మిక రాకతో గృహంలో ఖర్చులు పెరుగుతాయి.

సింహరాశి: షాపింగ్ లో ఖర్చులు అధికం. విలువైన వస్తువుల కొనుగోలు  విషయంలో జాగ్రత్త అవసరం. ఆర్థిక విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. అదనపు సౌకర్యాలు సమకూర్చుకుంటారు. ఉల్లి - బెల్లం - పసుపు - కంది - మిర్చి వ్యాపారస్థులకు కలిసివస్తుంది.  ఏ వ్యక్తితో అతి చనువు అంతమంచిది కాదు.

కన్యారాశి: వ్యక్తిగత వ్యవహారాలకు సంబంధించిన ఆలోచనలు కొలిక్కి వస్తాయి. ఆలోచనలను సమీక్షించుకుంటారు. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. సంకల్పం నెరవేరుతుంది. స్తబ్ధత తొలిగిపోయి ఉత్సాహం నెలకొంటుంది. కొబ్బరి - పండ్లు - పూల వ్యాపారులకు లాభదాయకం. వాహనం నడిపినప్పుడు జాగ్రత్తలు అవసరం.

తులారాశి: న్యాయ - భోధన రంగాల వారు లక్ష్యాలు సాధిస్తారు. ఒక సమాచారం ఉల్లాసం కలిగిస్తుంది. వినోదం - ఫొటో గ్రఫీ - రచనా రంగాల వారికి అనుకూలం. సినీ - రాజకీయ - న్యాయ బోధన రంగాల వారు లక్ష్యాలు సాధిస్తారు. క్రీడల పట్ల ఆసక్తి పెరుగుతుంది. స్త్రీలు టీవీ చానెల్స్ కార్యక్రమాల్లో రాణిస్తారు. ఉమ్మడి - సొంత వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి.

వృశ్చికరాశి: ఆర్థిక విషయాల్లో సన్నిహితుల సహకారం లభిస్తుంది. సమావేశాల్లో బంధుమిత్రులతో వేడుకల్లో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరం. సహకార సంఘాలు - యూనియన్ కార్యకలాపాలకు అనుకూలం. మానసిక శారీరక ఒత్తిడిలు  ఉంటాయి. విదేశీ వస్తువులు సేకరిస్తారు. తొందరపాటు వల్ల కుటుంబీకులు - ఎదుటివారితో మాటపడాల్సి వస్తుంది.

ధనురాశి: పెద్దలు - ప్రముఖులను కలుసుకుంటారు. గౌరవ - మన్ననలు అందుకుంటారు. పెద్దల సహకారంతో వృత్తిపరమైన లక్ష్యాలు సాధిస్తారు. పేరు ప్రఖ్యాతలు గడిస్తారు.  వ్యాపారాల్లో మంచి అనుకూలతలు కనబడుతున్నాయి. కుటుంబంలో అనురాగవాత్సల్యాలు పెంపొందుతాయి. ప్రేమికుల ఆలోచనలు పెడదోవ పట్టే ఆస్కారం ఉంది.

మకరరాశి: చర్చలు - ప్రయాణాలు ఫలిస్తాయి. భవిష్యత్ ప్రణాళికలు రూపొందించుకుంటారు. న్యాయ - బోధన - రక్షణ - రవాణా రంగాల వారు లక్ష్యాలు సాధిస్తారు. అంచనాలు ఫలిస్తాయి. మంచి కాంట్రాక్టులు లభిస్తాయి. ఆటంకాలు ఎదురైనా నెమ్మదిగా సమసిపోగలవు. సంతానానికి వివాహ విషయాల పట్ల శద్ధ వహిస్తారు. కిరాణ  - ఫ్యాన్సీ రంగాల వారికి అనుకూలంగా ఉంది.

కుంభరాశి: వాయిదా పద్ధతులపై వస్తువులు కొనుగోలు చేస్తారు. బహుమతులు ఇచ్చిపుచ్చకుంటారు. ఆరోగ్య పట్ల జాగ్రత్త అవసరం. ఆర్థిక విషయాల్లో ఉత్సాహంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి విందులు - వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు.

మీనరాశి: బృంద కార్యక్రమాల్లో కీలకపాత్ర పోషిస్తారు. జనసంబంధాలు విస్తరిస్తాయి. భార్యభర్తల వ్యవహారాలు కలిసివస్తాయి. పందేలు - పోటీల్లో పాల్గొంటారు. ఆర్థిక విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. శ్రీవారు - శ్రీమతి వ్యవహారాలు ఉల్లాసం కలిగిస్తాయి.
Tags:    
  • Daily Rashi Phalalu 
  • Daily Horoscope 
  • Horoscope 
  • Rashi Phalalu 
  • Telugu NEws 

Similar News

రేవంత్ బయటపెట్టిన ‘ది గ్రేట్ ఫైనాన్షియల్’ మార్వలస్ ఐడియా

2026-11-04 13:15 GMT

రేవంత్ గెలవడని కేటీఆర్ డిసైడ్.. ఆ భూములు కొనొద్దని పారిశ్రామికవేత్తలకు హెచ్చరిక

2026-11-04 13:10 GMT

పాపం ష‌ర్మిల‌.. ఇంత హ‌ర్ట్ అవుతార‌నుకోలేదా ..?

2026-11-04 13:01 GMT

మాజీ ఐపీఎస్‌.. ఓట‌మి స్ఫూర్తి.. !

2026-11-04 13:00 GMT

నాన్న‌గారి ఆశ‌యాలు నెర‌వేరుస్తా: రాధా ఫ‌స్ట్ స్పీచ్‌

2026-11-04 13:00 GMT

నియంతలు ట్రంప్, నెతన్యాహు ఔట్ అట.. ‘సీజేపీ‘ నేతలు హ్యాపీ.. టార్గెట్ మోడీయేనా?

2026-11-04 12:57 GMT

ఓటువేయలేదుగా.. నా డబ్బులు నాకివ్వండి.. వైసీపీ అభ్యర్థి 'రివర్స్ వసూళ్లు' వైరల్

2026-11-04 11:17 GMT

భారతీయులతో పెట్టుకున్నాడు.. ట్రంప్ అనుభవిస్తున్నాడు..

2026-11-04 10:57 GMT

టికెట్ ధ‌ర‌ల‌పై CM విజ‌య్ ముందు చూపు మనవాళ్ల‌కు ఏదీ?

2026-11-04 09:39 GMT

ఏపీలో మ‌రో ఎన్నిక‌ల పోరు..!

2026-11-04 09:22 GMT

రాప్తాడు నిందితుడిపై కాల్పుల కేసులో కీలక పరిణామం

2026-11-04 09:14 GMT

ఎలా గెలవాలో చెప్పారు...జగన్ కంగ్రాట్స్ !

2026-11-04 09:06 GMT

Copyright @2026

Powered by Blink CMS