• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  సెప్టెంబర్ 9 ఆదివారం 2018...

సెప్టెంబర్ 9 ఆదివారం 2018 దినఫలాలు

By - Tupaki Desk
Update: 2018-09-09 04:34 GMT
గమనిక:  ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి - గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు..
    
మేషరాశి:  పరిశ్రమలు - హోటల్ - వ్యవసాయం రంగాల వారు లక్ష్యసాధనకు బాగా శ్రమించాల్సి ఉంటుంది. విందుల్లో పరిమితి పాటించాలి. ఇంటర్వ్యూల్లో నిరాశ తప్పకపోవచ్చు. ఆస్పత్రుల పాలవుతారు. ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలుంటాయి. ప్రేమికుల మధ్య అవగాహన కుదరదు. వీధి - చిరు వ్యాపారులకు కలిసి రాగలదు.

వృషభరాశి: పొదుపు పథకాలు - పెట్టుబడుల విషయంలో ఆచితూచి ముందడుగు వేయండి. విద్యా విషయంలో ఆటంకాలు ఎదురవుతాయి. ప్రేమలు బెడిసి కొట్టే అవకాశం ఉంది. సృజనాత్మకతతో లక్ష్యాలు సాధిస్తారు. స్త్రీలకు నూతన పథకాల పట్ల ఆసక్తి. సోదరులతో మీతో అన్ని విషయాల్లోనూ ఏకీభవిస్తారు. మీ పిల్లల కోసం చేసే పథకాల్లో జయం పొందగలుగుతారు. హోటల్ - క్యాటరింగ్ వారికి కలిసి వస్తుంది.

మిథునరాశి: వాయిదా పడుతున్న పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. వసతి లోపిస్తుంది. కుటుంబ వ్యవహారాలు మనస్తాపం కలిగిస్తాయి. బదిలీ ప్రయత్నాలు ఫలించకపోవచ్చు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. ప్రత్యర్థులు మిత్రులుగా మారుతారు. దైవ దర్శనానికి చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి.  మత్య్స - కోళ్ల వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది.

కర్కటకరాశి: రిప్రెజెంటీటివ్ లు - ఏజెంట్లకు శ్రమాధిక్యం. సమావేశాల్లో అభాసుపాలవుతారు.  ఒక సమాచారం కలవరపెడుతుంది. విద్యార్థులు లక్ష్యసాధనకు పట్టుదలతో కృషి చేస్తారు. వాహనాల కారణంగా అసౌకర్యానికి గురవుతారు. గృహ మార్పుతో ఇబ్బందులు తొలిగి మానసికంగా కుదుటపడతారు. కొంత ధనం వసూలవుతుంది. ప్రింట్ - మీడియాలో ఉన్న వాళ్లు జాగ్రత్తగా ఉండాలి. ఉన్నతంగా ఎదిగే అవకాశాలు పెరుగుతాయి.

సింహరాశి: రుణ ప్రయత్నాలు ఫలించవు. ఖర్చులు అదుపులో పెట్టుకోవాలి. విలువైన వస్తువుల కొనుగోలులో నాణ్యత గమనించండి. బ్యాంకులు - ఆర్థిక సంస్థలతో పనులకు ఆటంకాలు కలిగే అవకాశం ఉంది. డిపాజిట్లపై మంచి ప్రతిఫలం అందుకుంటారు. వాణిజ్య ఒప్పందాల్లో ఏకాగ్రత అవసరం. నూతన అగ్రిమెంట్లు వద్దు. ఆర్థిక లావాదేవీల్లో ఒడిదుడుకులు ఎదుర్కొంటారు.

కన్యారాశి:  కొత్త పనులు వాయిదా వేయండి. అన్ని విషయాల్లో శ్రమ ఎక్కువవుతుంది. మనసులో వెలితి వేధిస్తుంది. పనులకు ఆటంకాలు ఎదురవుతాయి. లిటిగేషన్ వ్యవహారాల్లో జాగ్రత్త. ఊహించని ఖర్చుల వల్ల స్వల్ప ఆటుపోట్లు తప్పవు. పొదుపు చేయాలనే ప్రయత్నం ఫలించదు.

తులారాశి: దీర్ఘకాలంగా వాయిదా పడుతున్న పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. రహస్య సమాచారం అందుకుంటారు. ఆలయాలు - హాస్టళ్లు సందర్శిస్తారు. ఉన్నత విద్య - విదేశీ వ్యవహారాల్లో అవాంతరాలు. రాజకీయ - పారిశ్రామిక రంగాల్లో వారికి అనుకూలం. నూతన వ్యక్తులతో పరిచయాలేర్పడుతాయి. స్థిరాస్థి అమ్మే విషయంలో పునరాలోచన అవసరం..

వృశ్చికరాశి: సన్నిహితుల సహకారంతో ఆర్థికపరమైన లక్ష్యాలు సాధిస్తారు. స్నేహసంబంధాలు బలపడతాయి. మ్యూచివల్ ఫండ్స్ - బ్యాంక్ డిపాజిట్లు - పొదుపు పథకాలు అనుకూల సమయం కాదు. స్త్రీలతో జాగ్రత్త. పాత మిత్రుల కలయితో నూతనోత్సాహం వస్తుంది. దూర ప్రయాణాల్లో వాహనాలతో జాగ్రత్త.

ధనురాశి: ఉద్యోగ - వ్యాపారాల్లో అనుకోని చికాకులు ఎదురవుతాయి. పెద్దల ఆరోగ్యం పట్ల జాగ్రత్తం. సంకల్ప సాధనకు పట్టుదలతో కృషి చేస్తారు. చిన్న తరహా, చిరువృత్తుల వారికి సరైన తృప్తి లభిస్తుంది.  మొండి బాకీల వసూళ్లు శుభ సంకేతాలున్నాయి. కొబ్బరి - పండ్ల - పూల - చిరు వ్యాపారులకు కలిసి వస్తుంది. అవివాహితులకు శుభదాయకం.

మకరరాశి:  విద్యార్థులకు మంచిరోజు. రక్షణ, రవాణా రంగాల వారు నిదానం పాటిస్తే మంచిది. ప్రణాళిక లోపించడం వల్ల లక్ష్యాలు సాధించలేకపోతారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో నిరుత్సాహం తప్పదు. ప్రేమ వ్యవహారాలు పెళ్లికి దారితీయవచ్చు. దైవ కార్యాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. పత్రికా సంస్థలలోని వారికి ఊహించని సమస్యలు ఎదురవుతాయి.

కుంభరాశి: గ్రాట్యూటీ - బీమా - పెన్షన్ వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. ఒక బాధకరమైన సమాచారం అందుకుంటారు. ఆస్పత్రులు - బ్యాంకులు - చిట్ ఫండ్ లు మ్యూచువల్ ఫండ్ రంగాల వారికి ఆర్థికంగా బాగుండదు.  ఊహించని ఖర్చుల వల్ల స్వల్ప ఆటుపోట్లు తప్పవు. అమ్మకానికి చేయూ యత్నాలు వాయిదా పడగలవు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు.

మీనరాశి: అంచనాలు పెట్టుబడుల విషయాల్లో నష్టాలు తెస్తాయి. సమావేశాల్లో కీలక పాత్ర పోషిస్తారు. ఆర్థిక విషయాల్లో భాగస్వామి వైఖరి మనస్థాపం  కలిగిస్తుంది. చుట్టుపక్కల వారి ధోరణి ఆశ్చర్యం కలిగిస్తుంది. ఖర్చులు అంతగా లేకున్నా ధన వ్యయం విషయంలో ఏకాగ్రత అవసరం. కాంట్రాక్టర్లకు మంచి అవకాశాలు.. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం.
Tags:    
  • Daily Rashi Phalalu 
  • Daily Horoscope 
  • Horoscope 
  • Rashi Phalalu 
  • Telugu NEws 

Similar News

రేవంత్ బయటపెట్టిన ‘ది గ్రేట్ ఫైనాన్షియల్’ మార్వలస్ ఐడియా

2026-11-04 13:15 GMT

రేవంత్ గెలవడని కేటీఆర్ డిసైడ్.. ఆ భూములు కొనొద్దని పారిశ్రామికవేత్తలకు హెచ్చరిక

2026-11-04 13:10 GMT

పాపం ష‌ర్మిల‌.. ఇంత హ‌ర్ట్ అవుతార‌నుకోలేదా ..?

2026-11-04 13:01 GMT

మాజీ ఐపీఎస్‌.. ఓట‌మి స్ఫూర్తి.. !

2026-11-04 13:00 GMT

నాన్న‌గారి ఆశ‌యాలు నెర‌వేరుస్తా: రాధా ఫ‌స్ట్ స్పీచ్‌

2026-11-04 13:00 GMT

నియంతలు ట్రంప్, నెతన్యాహు ఔట్ అట.. ‘సీజేపీ‘ నేతలు హ్యాపీ.. టార్గెట్ మోడీయేనా?

2026-11-04 12:57 GMT

ఓటువేయలేదుగా.. నా డబ్బులు నాకివ్వండి.. వైసీపీ అభ్యర్థి 'రివర్స్ వసూళ్లు' వైరల్

2026-11-04 11:17 GMT

భారతీయులతో పెట్టుకున్నాడు.. ట్రంప్ అనుభవిస్తున్నాడు..

2026-11-04 10:57 GMT

టికెట్ ధ‌ర‌ల‌పై CM విజ‌య్ ముందు చూపు మనవాళ్ల‌కు ఏదీ?

2026-11-04 09:39 GMT

ఏపీలో మ‌రో ఎన్నిక‌ల పోరు..!

2026-11-04 09:22 GMT

రాప్తాడు నిందితుడిపై కాల్పుల కేసులో కీలక పరిణామం

2026-11-04 09:14 GMT

ఎలా గెలవాలో చెప్పారు...జగన్ కంగ్రాట్స్ !

2026-11-04 09:06 GMT

Copyright @2026

Powered by Blink CMS