• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  సెప్టెంబర్ 8 శనివారం 2018...

సెప్టెంబర్ 8 శనివారం 2018 దినఫలాలు

By - Tupaki Desk
Update: 2018-09-08 04:33 GMT
గమనిక:  ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి - గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు..
   
మేషరాశి: వృత్తిపరమైన శిక్షణలు అనుకూలం.కృషి రంగంలో కొత్త అనుబంధాలు ఏర్పడుతాయి. ఆర్థిక విషయాల్లో ఒత్తిడి పెరుగుతుంది. ప్రైవేటు సంస్థల్లోని వారు మార్పులు చేసే ప్రయత్నాల్లో ఇబ్బందులు తప్పవు.  ప్రతిభకు గుర్తింపు లభించకపోవడంతో మనస్తాపం చెందుతారు. కృషి రంగంలో కొత్త అనుబంధాలు ఏర్పడుతాయి. ఉపాధ్యాయుల్లో నూతన ఆలోచనలు - విద్యార్థుల్లో మనోధైర్యం పెంపొందుతుంది. స్త్రీలకు ఆరోగ్య చికాకులు ఎదుర్కొంటారు.

వృషభరాశి: ప్రియమైన వారి వైఖరిలో మార్పు ఆవేదన కలిగిస్తుంది. ఇంట్లో వేడుకలు - సమావేశాలకు ఏర్పాట్లు చేస్తారు. రియల్ ఎస్టేట్ వ్యవహారాల్లో నిదానం అవసరం. బదిలీలు - మార్పులు అసౌకర్యం కలిగిస్తాయి. నూతన పెట్టుబడులు - ప్రాజెక్టులు సంస్థల స్థాపనలకు కొంత వేచి ఉండండి. పెద్దల సలహాలను పాటిస్తే మేలు జరుగుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి.

మిథునరాశి: రవాణా - ఏజెన్సీలు - స్టేషనరీ - బోధన రంగాల వారు చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. ఒక వార్త కలవరపెడుతుంది. విద్యాసంస్థల్లో ప్రవేశానికి అనుకూలం. ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. ఉమ్మడి - ఆర్థిక వ్యవహారాలను సమర్థంగా నిర్వహిస్తారు. ఒక్కోసారి మీ భార్యతో గొడవలకు కారణమవుతుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అనుకూలిస్తాయి.

కర్కాటకరాశి: సన్నిహితులకు డబ్బు సర్ధుబాటు చేయాల్సి వస్తుంది. రుణాలు - పెట్టుబడులకు సంబంధించిన చర్చలు ఫలిస్తాయి. సన్నిహితుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. ఆర్థిక విషయాలకు సంబంధించి ఒక సమాచారం కలవరపడుతుంది. వ్యాపారాల అభివృద్ధికి చేయు కృషిలో సఫలీకృతులవుతారు. ఉపాధ్యాయుల విశ్రాంతి ప్రయత్నాలు ఫలిస్తాయి.

సింహరాశి:  ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి కొత్త ఆలోచనలు చేస్తారు. అనుకున్న నిధులు సకాలంలో చేతికి అందుతాయి. లక్ష్యాలు సాధిస్తారు. పెట్టుబడులు - పొదుపు పథకాల విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. రాజకీయాలలోని వారికి ప్రయాణాల్లో మెళకువ అవసరం. బంధుమిత్రులకు మీరంటే ప్రత్యేకాభిమానం. వృత్తి - వ్యాపారాల్లో నిలదొక్కుకుంటారు.

కన్యారాశి: గ్రానైట్ - ఫొటోగ్రఫీ - టెక్స్ టైల్ - బోధన రంగాల వారి సంకల్పం నెరవేరుతుంది. ఉన్నత విద్య - విదేశీ వ్యవహారాల్లో లక్ష్య సాధనకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఖర్చులు - చెల్లింపులు ప్రయోజనకరంగా ఉంటాయి. ప్రింటింగ్ - స్టేషనరీ రంగాల వారికి సామాన్యంగా ఉంటుంది. నిరుద్యోగులకు బోగస్ ప్రకటనలు - అపరిచిత వ్యక్తుల పట్ల మెలకువ అవసరం. మీ శ్రీమతి మొండి వైఖరితో చికాకులు - గొడవలు అవుతాయి.

తులారాశి : ప్రదర్శనలు - ఉత్సవాల్లో పాల్గొంటారు. ఆర్థిక సంస్థలతో పనులు పూర్తవుతాయి. ఆర్థిక వ్యవహారాలతో అశాంతికి గురవుతారు. సన్నిహితులకు సంబంధించి రహస్య సమాచారం తెలుసుకుంటారు.  గృహంలో మార్పులు - చేర్పులు అనుకూలిస్తాయి. వాహనాలు ఇచ్చే విషయాల్లో లౌక్యంగా వ్యవహరించండి. స్త్రీల అవసరాలు - కోరికలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. ఎదుటివారితో మాట్లాడినా తప్పుగానే భావిస్తారు.

వృశ్చిక రాశి: ఉద్యోగ - వ్యాపారాల్లో సన్నిహితుల సహకారం లోపిస్తుంది. బంధుమిత్రుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. జనసంబంధాలు విస్తరిస్తాయి. కోళ్ల - మత్స్య - పాడి పరిశ్రమ - గొర్రెల రంగాల వారికి అనుకున్నంత సంతృప్తి కానవచ్చును. స్త్రీల మనోవాంచలు నెరవేరుతాయి. ప్రముఖులతో పరిచయాలు మీ ఉన్నతికి తోడ్పడుతాయి.

ధనురాశి: వృత్తికి సంబంధించిన సమావేశాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలు తప్పుతాయి. భవిష్యత్ గురించి  వ్యూహరచన చేస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో గోప్యత మంచిది. స్థిరాస్తి ఆలోచన బలపడుతుంది. సన్నిహితులు, కుటుంబీకుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. నిరుద్యోగులకు చేతిదాకా వచ్చిన అవకాశాలు చేజారిపోతాయి. ముఖ్యుల కోసం షాపింగ్ లు చేస్తారు.

మకరరాశి: పన్నుల వ్యవహారాలు ఇబ్బంది పెడతాయి. పాత వస్తువుల రవణాకు అనుకూలం. గత అనుభవంతో లక్ష్యాలు సాధిస్తారు.  రుణ ప్రయత్నాలు ఫలించవు. సినిమా - విద్యా - సాంస్కృతిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు - వాణిజ్య ఒప్పందాల్లో ఏకాగ్రత అవసరం.

కుంభ రాశి: పెట్టుబడులు - పందేలు - పోటీలల్లో నష్టం వస్తుంది. ప్రియమైన వారి ఆరోగ్యం పట్ల జాగ్రత్త. ఆర్థిక విషయాల్లో సన్నిహితుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. మీరు ప్రేమించే వారి వల్ల కొంత నష్టం ఏర్పడుతుంది. ఊహించని ఖర్చుల వల్ల ఆటుపోట్లు  తప్పవు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు.

మీనరాశి: సన్నిహితుల సహకారంతో వృత్తి - వ్యాపారాల్లో అనుకున్న పనులు పూర్తి చేస్తారు. విందు - వినోదాల్లో పరిమితి అవసరం.  పరిచయాలు లక్ష్యసాధనకు ఉపయోగపడతాయి. రాజకీయ నాయకులు - సభలు - సమావేశాల్లో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. అప్పు ఇచ్చే విషయంలో పునరాలోచన అవసరం.
   

Tags:    
  • Daily Rashi Phalalu 
  • Daily Horoscope 
  • Horoscope 
  • Rashi Phalalu 
  • Telugu NEws 

Similar News

రేవంత్ బయటపెట్టిన ‘ది గ్రేట్ ఫైనాన్షియల్’ మార్వలస్ ఐడియా

2026-11-04 13:15 GMT

రేవంత్ గెలవడని కేటీఆర్ డిసైడ్.. ఆ భూములు కొనొద్దని పారిశ్రామికవేత్తలకు హెచ్చరిక

2026-11-04 13:10 GMT

పాపం ష‌ర్మిల‌.. ఇంత హ‌ర్ట్ అవుతార‌నుకోలేదా ..?

2026-11-04 13:01 GMT

మాజీ ఐపీఎస్‌.. ఓట‌మి స్ఫూర్తి.. !

2026-11-04 13:00 GMT

నాన్న‌గారి ఆశ‌యాలు నెర‌వేరుస్తా: రాధా ఫ‌స్ట్ స్పీచ్‌

2026-11-04 13:00 GMT

నియంతలు ట్రంప్, నెతన్యాహు ఔట్ అట.. ‘సీజేపీ‘ నేతలు హ్యాపీ.. టార్గెట్ మోడీయేనా?

2026-11-04 12:57 GMT

ఓటువేయలేదుగా.. నా డబ్బులు నాకివ్వండి.. వైసీపీ అభ్యర్థి 'రివర్స్ వసూళ్లు' వైరల్

2026-11-04 11:17 GMT

భారతీయులతో పెట్టుకున్నాడు.. ట్రంప్ అనుభవిస్తున్నాడు..

2026-11-04 10:57 GMT

టికెట్ ధ‌ర‌ల‌పై CM విజ‌య్ ముందు చూపు మనవాళ్ల‌కు ఏదీ?

2026-11-04 09:39 GMT

ఏపీలో మ‌రో ఎన్నిక‌ల పోరు..!

2026-11-04 09:22 GMT

రాప్తాడు నిందితుడిపై కాల్పుల కేసులో కీలక పరిణామం

2026-11-04 09:14 GMT

ఎలా గెలవాలో చెప్పారు...జగన్ కంగ్రాట్స్ !

2026-11-04 09:06 GMT

Copyright @2026

Powered by Blink CMS