• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  సెప్టెంబర్ 7 శుక్రవారం...

సెప్టెంబర్ 7 శుక్రవారం 2018 దినఫలాలు

By - Tupaki Desk
Update: 2018-09-07 01:31 GMT
గమనిక:  ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి - గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు..
   
మేషరాశి: వృత్తి - వ్యాపారాల్లో లక్ష్యాలు సాధిస్తారు. వైద్యం - ఇంజినీరింగ్ విద్యార్థులకు శుభప్రదం. ప్రేమానుబంధాలు బలపడతాయి. వాహనం నడుపుతున్నప్పుడు ఏకాగ్రత అవసరం. స్త్రీల ప్రతిభ - సృజానాత్మకతకు గుర్తింపు - రాణింపు లభిస్తుంది.వీధి  - చిరు వ్యాపారులకు పురోభివృద్ధి - పరోపకారానికి సమస్యలు తెచ్చుకోకండి..

వృషభరాశి: ఆర్థిక విషయాల్లో ముందడుగు వేస్తారు. బంధుమిత్రులతో విందు - వినోదాల్లో పాల్గొంటారు.  కుటుంబసభ్యుల వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది. ప్రియతముల కలయికతో ఇంట్లో సందడిగా ఉంటుంది. విద్యాసంస్థల్లో ప్రవేశానికి అనుకూలం.. రియల్ ఎస్టేట్ - నిర్మాణ రంగాల వారికి శుభప్రదం. ఉద్యోగస్థుల విశ్రాంతికై చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.

మిథునరాశి: కాంట్రాక్టులు - అగ్రిమెంట్లు - రిజిస్ట్రేషన్లకు అనుకూలం. ఒక వార్త ఉల్లాసం కలిగిస్తుంది. సోదరీ సోదరుల విషయాల్లో శుభ పరిణామాలు కలుగుతాయి. రాజకీయ నాయకులు సభలు - సమావేశాల్లో పాల్గొంటారు. మిమ్మల్ని పొగిడే వారి పట్ల అప్రమత్తంగా మెలగండి. ఎదుటివారిపై అతివిశ్వాసం పనికిరాదు. పాత మిత్రుల కలయికతో గత అనుభవాలు గుర్తుకొస్తాయి. చేతివృత్తుల వారికి అంతంత మాత్రంగానే ఉంటుంది.

కర్కటకరాశి: విద్యా - ప్రయాణాలకు అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి.ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరం.  ఒప్పందాలకు అనుకూలం. బిల్లులు - చెక్కులు అందుకుంటారు. సన్నిహితుల సాయంతో ఆర్థిక లక్ష్యాలు సాధిస్తారు. దైవ సేవతో ఉపశమనం కలుగుతుంది. ధనం బాగా ఖర్చు చేస్తారు. దంపతుల మధ్య స్వల్ప చికాకులు - అభిప్రాయ భేదాలు వస్తాయి.

సింహరాశి: వ్యక్తిగత సౌకర్యం కోసం ఖర్చు చేస్తారు. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. ఆర్థిక విషయాల్లో కొత్త ఆలోచనలు అమలు చేయాలి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగులు వచ్చిన అవకాశాలు అందిపుచ్చుకుంటే మంచిది. దూర ప్రయాణాలలో వస్తువుల పట్ల మెళకువ అవసరం. సోదరీ - సోదరుల మధ్య తగాదాలు రావచ్చు. కంప్యూటర్ రంగంలోని వారికి అభివృద్ధి కానవస్తుంది.

కన్యరాశి: సినీ రాజకీయ రంగాల వారు లక్ష్యాలు సాధిస్తారు. దీర్ఘకాలంగా వాయిదా పడుతున్న పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. అలజడి తగ్గి మనశ్శాంతి లభిస్తుంది. ఆధ్యాత్మిక ధృక్పథం పెరుగుతుంది. గతానుభవంతో లక్ష్యాలు సాధిస్తారు. ఆర్థిక అవసరాలు చాలక ఖర్చులు పెరిగి అదనపు ఆదాయానికి శ్రమిస్తారు. స్త్రీలకు పనివాళ్లతో ఒత్తిడి - చికాకు ఎదురవుతుంది. పనుల్లో ఓర్పు, పట్టుదల ముఖ్యం. అదనపు రాబడి కోసం ప్రయత్నాలు ఫలిస్తాయి.

తులారాశి: ఆడిటర్లు, కన్సల్టెంట్లకు అనుకూలం. వేడుకలు, శుభకార్యాల్లో పాల్గొంటారు. సమావేశాలు, ప్రదర్శనలకు ఏర్పాట్లు చేస్తారు. దీర్ఘకాలిక పెట్టుబడులకు అనుకూలం. ఆర్థిక లావాదేవీలు, అనుకున్న పనులు ప్రశాంతంగా సాగుతాయి. దైవకార్యం చేయాలనే ఆలోచన మందిది. వాహనం, విలువైన వస్తువుల విషయంలో మెళకువ అవసరం. మత్స్య కోళ్ల వ్యాపారుస్తులకు లాభదాయకం.

వృశ్చిక రాశి: పెద్దల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. న్యాయ, బోధన, రక్షణ రంగాల వారు గౌరవ పదవులు పొందుతారు. వృత్తి - వ్యాపారాల్లో ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ప్రముఖులను కలుస్తారు. పెద్దల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. స్థిరాస్తి క్రయ - విక్రయాల కోసం కొంత కాలం ఆగాలి. నిరుద్యోగులు అవకాశాలను సద్వినియోగం చేసుకోవటం ఉత్తమం.

ధనురాశి:  ఉమ్మడి వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీలు సమర్థంగా నిర్వహిస్తారు.  విద్యాసంస్థల్లో ప్రవేశాలు అందుకుంటారు. సంకల్పం నెరవేరుతుంది.  వేడుకలు ఉల్లాసం కలిగిస్తాయి. రాజకీయ, బోధన న్యాయ, రక్షణ రంగాల వారు ఉన్నత పదవులు అందుకుంటారు. వేతనం తక్కువైన నిరుద్యోగులు అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి.

మకరరాశి: ఆర్థిక వ్యవహారాల్లో ప్రణాళికబద్దంగా వ్యవహరించి లక్ష్యాలు సాధిస్తారు. బీమా, గ్రాట్యుటీ, పింఛన్, మ్యూచువల్ ఫండ్ వ్యవహారాలకు అనుకూలం. రుణ ప్రయత్నాలు కొలిక్కివస్తాయి. పుణ్యాకార్యాల్లో పాల్గొంటారు. రాజకీయ నాయకులు సభాసమావేశాల్లో పాల్గొంటారు. ఆదాయానికి మంచి ఖర్చులుంటాయి. ఉద్యోగులు విశ్రాంతికై ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు సంభవిస్తాయి.

కుంభరాశి: శ్రీవారు, శ్రీమతి సహకారంతో ఆర్థికపరమైన లక్ష్యాలు సాధిస్తారు. విలువైన వస్తువులు కొంటారు. పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. సన్నిహితుల సలహా, హితువు మీపై పనిచేస్తాయి. విద్యార్థుల ఉన్నత విద్యా ప్రయత్నాలు ఫలిస్తాయి. స్త్రీలకు పొరుగువారి నుంచి ఆహ్వానాలు అందుతాయి. విలువైన వస్త్రువులు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు. సొంత నిర్ణయాల వల్ల కలహాలు, చికాకులు తప్పవు. పెద్దల ఆరోగ్యంలో మెళకువ అవసరం.

మీనరాశి: సన్నిహితుల ఆరోగ్యం మెరుగవుతుంది. విందులు, వేడుకలు ఉల్లాసం కలిగిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో భాగస్వామి సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. బంధువులతో చికాకులుంటాయి. విద్యార్థులు క్రీడా రంగాల్లో రాణిస్తారు. ట్రాన్స్ పోర్టు, ట్రావెలింగ్ వారికి పురోభివృద్ధి, వీధి వ్యాపారులు , ఇతర వ్యాపారులకు లాభసాటి సాగుతాయి. దంపతుల మధ్య కలహాలు తలెత్తే అవకాశాలుంటాయి. కొన్ని విషయాలు అంతగా పట్టించుకోవడం మంచిది కాదు.
   

Tags:    
  • Daily Rashi Phalalu 
  • Daily Horoscope 
  • Horoscope 
  • Rashi Phalalu 
  • Telugu NEws 

Similar News

రోజంతా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూస్తే జీతం ఇచ్చేస్తారంట..!

2026-11-06 01:50 GMT

ఆ రెండు జెడ్పీల మీదనే హాట్ డిస్కషన్ !

2026-11-06 01:50 GMT

విజయ్ జగన్ కేటీఆర్...ఒకే ఫ్రేమ్‌ లో !

2026-11-06 01:43 GMT

ఆధార్ ప్లేసులో ఓటర్ ఐడీ.. కేంద్రం మరో దుమారం?

2026-11-05 16:15 GMT

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఏపీ ఎన్నిక‌ల్లో ఒక విషాదం.. మ‌రిన్ని చిత్ర విచిత్రాలు!

2026-11-05 16:12 GMT

'దేశ ద్రోహం': మోడీ రేపిన 'రాహుల్ మంట‌లు'!

2026-11-05 16:11 GMT

చెవిరెడ్డ‌న్నా.. గొడ‌వ‌లు వ‌ద్దు.. టీడీపీ నేత బిగ్ ఆఫ‌ర్‌!

2026-11-05 16:09 GMT

అనంత‌లో తేడా ఎక్క‌డ కొట్టింది.. బాబు ఆరా.. !

2026-11-05 13:30 GMT

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

Copyright @2026

Powered by Blink CMS