• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  సెప్టెంబర్ 3 సోమవారం 2018...

సెప్టెంబర్ 3 సోమవారం 2018 దినఫలాలు

By - Tupaki Desk
Update: 2018-09-03 01:35 GMT
గమనిక:  ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి - గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు..

మేష రాశి:  ఈ రోజు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. చర్చలు - సమావేశాల్లో నిదానం అవసరం.. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి. సన్నిహితుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. మార్కెటింగ్ - బోధన - రవాణా - ఏజెన్సీలు - స్టేషనరీ రంగాల వారు లక్ష్యసాధనకు అధికంగా శ్రమించాలి.

వృషభరాశి: ఆర్థిక పరిస్థితి నిరుత్సాహకరంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త అవసరం..పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ప్రియమైన - చిన్నారుల కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. సృజనాత్మకత రంగాల వారికి తగిన గుర్తింపు లభిస్తుంది..

మిథునరాశి: కుటుంబ వ్యవహారాలు మనస్థాపం కలిగిస్తాయి. మీ మనసు మార్పు కోరుకుంటుంది. వాయిదా పడుతున్న పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. బదిలీలు - మార్పుల కోసం చేసే ప్రయత్నాలు ఫలించకపోవచ్చు.. మానసిక ఆందోళనకు - ఆవేశానికి గురికాకండి.. ప్రశాంతచిత్తంతో ఉండండి..

కర్కాటక రాశి: ఉద్యోగంలో ప్రమోషన్ లేదా బదిలీల కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ రోజు ముఖ్య సమాచారం అందుతుంది. మిత్రులను లేదా బంధువులను కలుస్తారు.ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తిపరంగా మంచి గుర్తింపును పొందుతారు. మానసికంగా ఉత్సాహంగా కనిపిస్తారు.

సింహరాశి:  ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం.. ఈరోజు మానసికంగా కొంత అశాంతి నెలకొంటుంది. పనిచేయడానికి ఇష్టపడరు. అలాగే ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. దూర ప్రయాణాల విషయంలో ఈరోజు అనుకూలంగా ఉంటుంది. పెట్టుబడులకు అనుకూలమైన రోజు కాదు ఇదీ..

కన్యరాశి: ఈ రోజు అనుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థికంగా బాగా అనుకూలిస్తాయి. మొండి బకాయిలు వసూలవుతాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగంలో మీరు అనుకున్న మార్పు చోటుచేసుకుంటుంది.

తులారాశి: ఈ రోజు మీ ప్రవర్తన కారణంగా సమస్యలు వస్తాయి. అలాగే మీరు తీసుకునే నిర్ణయాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి.  అశ్రద్ధగా తీసుకునే నిర్ణయాల కారణంగా భవిష్యత్తులో ఇబ్బంది పడే అవకాశముంటుంది. ఈరోజు బద్దకానికి  - అసూయకు చోటివ్వకపోతే మంచిది.

వృశ్చికరాశి: పెట్టుబడులు - పొదుపు ఖాతాల్లో ఆచితూచి వ్యవహరించాలి. బ్యాంకులు - ఆర్థిక సంస్థలతో పనులు ఆటంకాలు ఎదురవుతాయి. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. వినోద కార్యక్రమాలతో బంధుమిత్రులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు.

ధనుస్సు రాశి: ఈరోజు మీ ఆగిపోయిన పనులు పూర్తి చేయడానికి అనుకూలమైనది. కొత్త పనులు ప్రారంభించవచ్చు. ఆయాచిత సాయం కారణంగా చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేయగలుగుతాం. ఉద్యోగంలో సమస్యలు తొలిగిపోతాయి. మీ శ్రమకు గుర్తింపు లభిస్తుంది. ఆర్థికంగా కొంత సామాన్యంగా ఉంటుంది.

మకరరాశి: ఈరోజు ఆర్థిక వ్యవహారాల పట్ల అప్రమత్తత చాలా ముఖ్యం.  ఎవరైనా తెలియని వారి కారణంగా - లేదా నూతన పరిచయాలతో లావాదేవీల వల్ల డబ్బు నష్టపోయే ప్రమాదం ఉంది. మీ శత్రువుల మీద ఓ కన్నేసి ఉంచడం మరిచిపోవద్దు. వారి కారణంగా మీరు తీవ్రంగా నష్టపోతారు. పెట్టుబడులకు అనువైన రోజు ఏమాత్రం కాదు.

కుంభరాశి: ఈరోజు  మీ ఆరోగ్యం విషయంలో అప్రమత్తత చాలా అవసరం. జీర్ణకోశ - శ్వాస సంబంధ సమస్యలు తలెత్తవచ్చు. అలాగే కీళ్లు - ఎముకలు సంబంధించిన వ్యాధులు రావచ్చు. కొత్త పనులకు ఎట్టిపరిస్థితుల్లోనూ ఇది మంచి రోజు కాదు..

మీనరాశి: ఈరోజు కుటుంబంలో కలహాలు తగ్గి మానసికంగా కాస్త ప్రశాంతమైన జీవనం లభిస్తుంది. కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతారు. రోజంతా ఆనందంగా ఉంటారు. కొత్త పనులు చేపట్టడానికి అనుకూల సమయం ఇది. వ్యాపారాలు - ఇతర ఆర్థిక కార్యకలాపాలు అనుకూల ఫలితాన్ని ఇస్తాయి.
   

Tags:    
  • Daily Rashi Phalalu 
  • Daily Horoscope 
  • Horoscope 
  • Rashi Phalalu 
  • Telugu NEws 

Similar News

రేవంత్ బయటపెట్టిన ‘ది గ్రేట్ ఫైనాన్షియల్’ మార్వలస్ ఐడియా

2026-11-04 13:15 GMT

రేవంత్ గెలవడని కేటీఆర్ డిసైడ్.. ఆ భూములు కొనొద్దని పారిశ్రామికవేత్తలకు హెచ్చరిక

2026-11-04 13:10 GMT

పాపం ష‌ర్మిల‌.. ఇంత హ‌ర్ట్ అవుతార‌నుకోలేదా ..?

2026-11-04 13:01 GMT

మాజీ ఐపీఎస్‌.. ఓట‌మి స్ఫూర్తి.. !

2026-11-04 13:00 GMT

నాన్న‌గారి ఆశ‌యాలు నెర‌వేరుస్తా: రాధా ఫ‌స్ట్ స్పీచ్‌

2026-11-04 13:00 GMT

నియంతలు ట్రంప్, నెతన్యాహు ఔట్ అట.. ‘సీజేపీ‘ నేతలు హ్యాపీ.. టార్గెట్ మోడీయేనా?

2026-11-04 12:57 GMT

ఓటువేయలేదుగా.. నా డబ్బులు నాకివ్వండి.. వైసీపీ అభ్యర్థి 'రివర్స్ వసూళ్లు' వైరల్

2026-11-04 11:17 GMT

భారతీయులతో పెట్టుకున్నాడు.. ట్రంప్ అనుభవిస్తున్నాడు..

2026-11-04 10:57 GMT

టికెట్ ధ‌ర‌ల‌పై CM విజ‌య్ ముందు చూపు మనవాళ్ల‌కు ఏదీ?

2026-11-04 09:39 GMT

ఏపీలో మ‌రో ఎన్నిక‌ల పోరు..!

2026-11-04 09:22 GMT

రాప్తాడు నిందితుడిపై కాల్పుల కేసులో కీలక పరిణామం

2026-11-04 09:14 GMT

ఎలా గెలవాలో చెప్పారు...జగన్ కంగ్రాట్స్ !

2026-11-04 09:06 GMT

Copyright @2026

Powered by Blink CMS