ఒంటిపై నూలు పోగు లేకుండా దోచుకోవడం అంటే ఇదేమరి!

Update: 2020-09-17 04:15 GMT
స్మార్ట్ ఫోన్లు ఎప్పుడైతే చేతికొచ్చాయే అప్పటి నుంచి రక రకాల ఆన్ లైన్ మోసాలు కూడా మొదలయ్యాయి. యువతను రెచ్చగొట్టే సైట్స్ మరీ ఎక్కువైపోయాయి. డేటింగ్ యాప్స్, అమ్మాయి, అబ్బాయిలతో గడిపేందుకు,   కోరుకున్న వారిని కలిసేందుకు కూడా యాప్స్ అందుబాటులోకి వచ్చాయి. దీంతో యువతరం ఈ డేటింగ్ యాప్స్ వైపు మల్లి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కొందరు కేటుగాళ్లు డేటింగ్ యాప్స్  ఉపయోగించుకుని సరికొత్త మోసాలకు పాల్పడుతున్నారు. వీరి చేతుల్లో చిక్కుకొని యువత మోసపోతున్నారు. అమ్మాయిలతో సెక్సీ చాట్ చేయిస్తామని, నగ్నంగా మాట్లాడిస్తామని యువకులను రెచ్చగొట్టి డబ్బు వసూలు చేస్తున్నారు. ఆ తర్వాత ఆ యువకులకు సంబంధించిన వీడియోలు తీసుకొని డబ్బు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఇలా  యువత వారి చేతిలో చిక్కుకొని మోసపోతున్నారు. ఇటీవల  హైదరాబాద్ కు చెందిన ఓ యువకుడు కూడా ఇలాగే  మోసపోయి సైబరాబాద్ పోలీసులు ఆశ్రయించాడు.

ఆ యువకుడు ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. ఇంకా వివాహం కాలేదు. కరోనా కారణంగా  వర్క్‌ ఫ్రం హోమ్‌ చేస్తూ ఇంట్లోనే ఉంటున్నాడు. ఇటీవల అతడి స్మార్ట్ ఫోన్ కి  ఓ మెసేజ్ వచ్చింది. అందమైన అమ్మాయిలతో డేటింగ్‌ చేయాలనుకుంటే..ఈ నంబర్‌ లను కాంటాక్ట్ అవండి..అని అందులో ఉంది. మీటింగ్ ఏర్పాటు చేసి నచ్చిన అమ్మాయి తో డేటింగ్ కి కూడా అవకాశం కల్పిస్తామని అందులో వారు పేర్కొన్నారు.దాంతో ఆ యువకుడు ఓ  నంబర్‌కు ఫోన్‌ చేయగా ఆ పక్క నుంచి ఓ యువతి లైన్లోకి వచ్చింది. సరదాగా మాట్లాడి అమ్మాయిలతో సెక్సీ చాట్ కి, డేటింగ్ కి తమ దగ్గర ఉన్న  ప్యాకేజీ వివరాలు  తెలిపింది. దీంతో ఆ యువకుడు  రిజిస్ట్రేషన్‌ ఫీజు ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించాడు. ఆ తర్వాత అతడి మొబైల్ కి  యువతుల నగ్న  చిత్రాలు వచ్చాయి. ఆ తర్వాత అతడితో  ఓ యువతి చాటింగ్‌ చేసింది. సెక్సీ చాట్ మాత్రమే కాదు.. .రూ.20 వేలు డబ్బు ఇస్తే ఏకంగా నగ్నంగా వీడియో కాల్‌ ద్వారా  మాట్లాడతానని రెచ్చగొట్టింది. దీంతో అతడు  ఆమె అడిగిన డబ్బు చెల్లించాడు. ముందు ఆ యువతి నగ్నంగా మాట్లాడుతూ.. ఆ యువకుడిని కూడా నగ్నంగానే మాట్లాడాలని కోరింది. దీంతో అతడు కూడా దుస్తులు తీసేసి అమ్మాయితో మాట్లాడాడు.

ఆ సమయంలో  ఆ కేటుగాళ్లు  యువకుడి ఫోటోలు తీసుకున్నారు. ఆ తర్వాత అతడి నెంబర్ కి ఫోన్ చేసి.. నీ నగ్న చిత్రాలు తమ వద్ద ఉన్నాయని.. రూ.50 వేలు డబ్బు ఇవ్వకపోతే వాటిని  సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తామని బెదిరించడం మొదలు పెట్టారు. దీంతో భయపడ్డ అతడు వారు  కోరినంత డబ్బు చెల్లించాడు. ఇలా పలుమార్లు వారు బెదిరించి ఆ యువకుడి  నుంచి రూ.2 లక్షలు వసూలు చేశారు. ఆ తర్వాత ఆ యువకుడు వారి ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయడం మానేయడంతో  సైబర్‌ నేరగాళ్లు అతడి  ఫొటోలను సోషల్‌ మీడియాలో పెట్టారు. దీంతో బాధితుడు సైబరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డేటింగ్ పేరుతో ఎవరైనా ఫోన్ చేస్తే ఎవరూ నమ్మి మోసపోవద్దని, సోషల్ మీడియాలో అందుబాటులో ఉన్నాయి కదా అని ఏ యాప్స్ పడితే  ఆ యాప్స్ డౌన్ లోడ్ చేసుకొని ఉపయోగించ వద్దని  సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ శ్యామ్‌ బాబు సూచించారు.
Tags:    

Similar News