రాజకీయ వ్యభిచారులన్న మాట అవసరమా నారాయణ?

Update: 2016-02-14 04:05 GMT
కమ్యూనిస్ట్ నేత నారాయణ నోటి మాట ఎంత షార్ప్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్పైసీగా మాట్లాడే అధినేతల వరుసలో ఆయన ముందుంటారు. వెనకాముందు చూసుకోకుండా ఎంతటి మాటనైనా అనేసే నారాయణ.. తాజాగా టీటీడీపీ నుంచి టీఆర్ ఎస్ లోకి జంప్ అయిన ఎమ్మెల్యేలను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

పార్టీలు మారే ఎమ్మెల్యేల్ని రాజకీయ వ్యభిచారులుగా అభివర్ణించిన ఆయన.. ఇలాంటి వారిపై కేసులు పెట్టాలంటూ మండిపడ్డారు. ‘రాజకీయ వ్యభిచారులపై కేసులు పెట్టే వరకూ వ్యభిచారం చేసే వేశ్యలపై కేసులు పెట్టొద్దు’’ అంటూ ఆయన వ్యాఖ్యానించటం గమనార్హం. దివంగత నేత వైఎస్ హయాంలో ఆపరేషన్ ఆకర్ష్ కింద పార్టీలోకి టీఆర్ఎస్ నేతల్ని ఆహ్వానించినప్పుడు కేసీఆర్ గగ్గోలు పెట్టారని.. మరి..ఇప్పుడు టీటీడీపీ ఎమ్మెల్యేల్ని పార్టీలోకి ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు.

ఒకరిని తప్పు పట్టే ముందు.. తప్పులు చేయకుండా ఉండాలన్న విషయాన్న నారాయణ లాంటి వారు గుర్తు పెట్టుకుంటే బాగుంటుంది. రాజకీయ వ్యభిచారులంటూ ప్రజాప్రతినిధులను ఉద్దేశించి తీవ్రమైన వ్యాఖ్యలు చేసే కన్నా సూటి విమర్శలు చేస్తే బాగుంటుంది. రాజకీయాల్లో విలువలు మరింత తగ్గేలా మాటల ప్రయోగం ఎవరికి అంత మంచిది కాదన్న విషయాన్ని మర్చిపోకూడదు.
Tags:    

Similar News